'డిజైనర్ హత్య.. లైంగికదాడి అనుమానం' | Perfume Designer Monica Ghurde Found Dead at Her Home in goa | Sakshi
Sakshi News home page

'డిజైనర్ హత్య.. లైంగికదాడి అనుమానం'

Published Fri, Oct 7 2016 4:23 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

'డిజైనర్ హత్య.. లైంగికదాడి అనుమానం' - Sakshi

'డిజైనర్ హత్య.. లైంగికదాడి అనుమానం'

పుణె: గోవాలో ప్రముఖ పర్ఫ్యూమ్ డిజైనర్ మోనికా గర్డే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న ఆమెను గురువారం ఆమె ఇంటిపక్కన ఉన్నవాళ్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. దీంతోపాటు ఇంట్లోకి దోచుకోవడానికి వచ్చి ఆమెపై ఎవరైనా లైంగికదాడి చేసి ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా కేసులో పేర్కొన్నారు.

39 ఏళ్ల గర్డే పర్ఫ్యూమ్ డిజైనర్ గా పనిచేస్తోంది. ఆమెకు గురువారం తన సోదరుడు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటిపక్కన వారికి ఆ విషయం తెలియజేయగా వారి వద్ద అదనంగా ఉన్న తాళంతో తలుపు తెరిచి చూడగా గర్డే ప్రాణాలుకోల్పోయి పండి ఉంది. ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించారు. తొలుత ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అనంతరం మంచి ఫర్ఫ్యూమర్ గా, పరిశోధకురాలిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement