చెడువాసన రాకుండా...
బ్యూటిప్స్
ఇటీవల కాలంలో వేడిమి బాగా పెరుగుతోంది. చెమట సమస్య కూడా అంతా ఎదుర్కొంటున్నారు. బాహుమూలాల్లో చెమట అధికంగా పడితే దుర్వాసన కూడా వస్తుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా...
బాహుమూలాల్లో...
వెనిగర్, నీళ్లు సమ భాగాలుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, బాహుమూలాల్లో స్ప్రే చేసి, మెత్తని క్లాత్‌తో తుడుచుకోవాలి. లేదంటే దూదిని ఉండగా చేసి, పై మిశ్రమంలో ముంచి తుడవాలి. తర్వాత డియోడరెంట్ వాడాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసనే కాదు ఎలాంటి ఇరిటేషన్ సమస్యా రాదు.
స్నానానికి...
టేబుల్ స్పూన్ అల్లం తరుగు, స్పూన్ కొత్తిమీర, చెంచాడు లెమన్ జెస్ట్ (నిమ్మకాయ పై తొక్కను తురిమినది), రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ మస్లిన్ క్లాత్‌లో వేసి గట్టిగా ముడివేయాలి. ఈ మూటను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచాలి. తర్వాత ఆ నీటిని స్నానానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. చెమట వల్ల దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది. సువాసన ఆహ్లాదానుభూతిని కలిగిస్తుంది.