హాలీవుడ్ నటి, మోడల్ గాల్‌గాడోట్ వైవిధ్య భరితమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి గాల్‌గాడోట్ ఇజ్రాయెల్‌కి చెందిన నటి, మోడల్‌గా, నాట్యకారిణిగా కెరీర్ సాగిస్తుండగానే అనూహ్యంగా హాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూడలేనంతగా సక్సెస్‌ని అందుకుంది. కెరీర్ మంచి పీక్‌లో ఉండగానే 2008లో ఇజ్రాయెలీ రియల్ ఎస్టేట్ డెవలపర్ జారోన్ యారోన్ వర్సనోను వివాహం చేసుకుంది.ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా. అయితే నాల్గోసారి గర్భందాల్చడం గాల్‌కి ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. మహిళలంతా తప్పక ఈవ్యాధిపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం అంటూ ఆరోగ్య స్ప్రుహని కలిగిస్తోంది. ఇంతకీ గాల్ నాల్గోసారి గర్భందాల్చినప్పుడూ ఏ వ్యాధిని ఎదుర్కొంది? ఎందువల్ల వస్తుంది..? తదితరాa గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!.
గాల్‌గాడోట్‌కి నాల్గో గర్భధారణలో అది పెద్ద ఆరోగ్య సవాలుని ఎదుర్కొంది. సరిగ్గా ఎనిమిదోనెలలో ఉండగా సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ (CVT) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చుస్తుండగానే ఆమె పరిస్థితి విషమించడం మొదలైంది. దీంతో వైద్యులు ఆమెకు గర్భంతో ఉండగానే బ్రెయిన్‌కి సర్జరీ చేశారు. ఆ క్లిష్ట సమయంలోనే ఓరి అనే బిడ్డకు జన్మనిచ్చింది గాల్.
అంతటి పరిస్థితిలోనూ సడలని నమ్మకంతో ఆ సమస్య నుంచి నెమ్మదిగా బయటపడటం మొదలు పెట్టింది. ఈ విషయాన్నే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అందరికీ ఈ వ్యాధిపై కచ్చితంగా అవగాహన ఉండాలని చెబుతోంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు దీనిపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమని తెలిపింది.
సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటే..
సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అనేది స్ట్రోక్ సంబంధిత అరుదైన రూపమని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా విపరీతమైన తలనొప్పి, మూర్చ వంటివి వస్తాయని అన్నారు. మెదడు సిరల సైనస్‌లలో రక్తం గడ్డకట్టడం లేదా సరైన రక్తప్రసరణ లేకుండా నిరోధించడం వల్లన ఈ పరిస్థితి ఏర్పడుతుందట. దీంతో బ్రెయిన్‌లో ఒక విధమైన ఒత్తిడి పెరిగి తత్ఫలితంగా తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్యలు లేదా ఫిట్స్ వంటి సమస్యలు వస్తాయని అన్నారు వైద్యులు.
లక్షణాలు..
తీవ్రమైన నిరంతర తలనొప్పి
దృష్టి సమస్యలు
మూర్చ
వికారం లేదా వాంతులు
మాట్లాడటంలో ఇబ్బంది, నరాల సంబంధిత సమస్యలు
కారకాలు..
గర్భం దాల్చినప్పుడు, ముఖ్యంగా ప్రసవానంతర కాలంలోనూ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందది.
డీ హైడ్రేషన్
మెనింజైటిస్ వంటి అంటువ్యాధులు కారణంగా
నివారణ:
దీన్ని సకాలంలో గుర్తిస్తేనే నివారించగలం. ఎంఆర్‌ఐ లేదా సీటీ స్కాన్‌లతో ఈ సమస్యను గుర్తిస్తారు వైద్యలు. మెదుడులోని గడ్డకట్టిన ప్రాంతాన్ని కరిగించేలా మందులు ఇవ్వడం లేదా సమస్య తీవ్రతను అనుసరించి సర్జరీ చేయాల్సి రావడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలామటుకు సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటేనే ఈ సమస్య నుంచి త్వరితగతిన బయటపడగలుగుతారు. అయితే కొందరూ రోగులు నాడీ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారని అన్నారు వైద్యులు.
(చదవండి: ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!)
Comments
Please login to add a commentAdd a comment