ఆకర్షణీయమైన వస్తువులు, బ్యాగులు, చెవి రింగులను కళాత్మకంగా ఎవరైనా చేస్తారు. అందుకోసం రాళ్లు, బంగారం, వెండి ఇలా ఏవేవో వాడుతుంటారు. వెంట్రుకలతో, కుట్టు మిషన్లతో ఇలా కాదేదీ కళకనర్హం అన్నట్లు అన్ని వస్తువులను వాడేశారు కళాకారులు. అయితే వీరందరికీ భిన్నాతిభిన్నంగా బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన అలైస్ పాట్స్ ఆలోచించారు. మహిళల కోసం పలు రకాల ఉత్పత్తులను భిన్నమైన పదార్థాలతో తయారు చేసి చాలా ఫేమస్ అయిపోయారు.
ఎందుకంటే వాటిని తయారు చేసేందుకు ఆమె ఎంచుకున్న ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే. అవేంటో తెలుసా.. మన శరీరం నుంచి ఉత్పత్తయ్యే చెమట, మూత్రం, రక్తం! ఏంటీ వీటితో ఎలా తయారు చేస్తారనుకుంటున్నారా..? వీటి నుంచి తెల్లగా మెరిసే స్ఫటికాలను తయారు చేసి బట్టలను చాలా అందంగా ముస్తాబు చేస్తారట. ప్లాస్టిక్‌ను వాడే కన్నా వీటితో తయారు చేస్తే ప్రకృతికి కూడా మేలు చేసినట్లవుతుందని పాట్స్ చెబుతున్నారు. ఇటీవల కాలేజీ ఫ్యాషన్ షోలో ఆమె చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచితే అనూహ్య స్పందన వచ్చింది.
చెమటోడ్చి తయారు చేశారు!
Published Sun, Jun 24 2018 3:27 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment