కశ్మీర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార కేసులో కోర్టు ఆరుగురు నిందితులకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వీరిలో జీవిత ఖైదు పడిన సాంజి రామ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అధికారులు. ఆర్కే జల్లా అనే అధికారి మాట్లాడుతూ.. కేసు విచారణ నిమిత్తం సాంజీ రామ్ ఇంటికి వెళ్లినప్పుడు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా తోచింది. మా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నించాడని తెలిపాడు. ‘అప్పటికే అతని మైనర్ అతని మేనల్లుడిని జువైనల్ హోమ్‌కు తరలించాం. సాంజీని,అతని కుమారుడు విశాల్‌ని విచారించే నిమిత్తం అతని ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చూడగానే చాలా కంగారు పడ్డాడు. భయంతో కంపించిపోయాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నిస్తుండగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు’ అని గుర్తు చేసుకున్నాడు.
‘అతని కొడుకు గురించి ప్రశ్నించగా.. మీరట్‌లో చదువుతున్నాడని.. కావాలంటే తన కాల్ రికార్డ్ డాటా(సీఆర్‌డీ)ను పరిశీలించుకోవచ్చని తెలిపాడు. అప్పుడు నాకు రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి సీఆర్‌డీ చెక్ చేసుకోమంటూ మాకే సలహా ఇవ్వడం.. రెండు చలి విపరీతంగా ఉండే జనవరిలో అతనికి చెమట పట్టడం. దాంతో మాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది. అతని మీద బెనిఫిషరి ఆఫ్ డౌట్ కింద కేసు నమోదు చేసి.. తదుపరి విచారణను పూర్తి చేశామని వెల్లడించారు. సాంజీ తన కుమారున్ని కాపాడుకోవడానికి అన్నివిధాల ప్రయత్నం చేశాడని జల్లా పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని జల్ల స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు సేకరించేందుకు తాము చేసిన కృషిని హై కోర్టు గుర్తించి ప్రశంసించిందని తెలిపారు. (చదవండి : సరైన తీర్పు)
Comments
Please login to add a commentAdd a comment