
దాచిపెట్టి తీసుకువెళ్లడానికి కూడా సాధ్యం కాని వస్తువును దొంగతన చేస్తుంది. దీంతో ఆమె ఆ వస్తువుని దాచడానికీ ఎంతలా తిప్పలు పడుతుందో.
ఇటీవల కాలంలో దొంగలు రకరకాలు వస్తువులను ఎత్తుకెళ్లుతున్న సంఘటనలు గురించి చాలానే విని ఉంటాం. కొన్ని రకాలు వస్తువులను సైతం దొంగతనం చేసినపుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది. అంతెందుకు కొన్ని వస్తువులు దొంగతనం చేసేందుకు కూడ సాధ్యం కానివి అయినప్పటికీ కొంతమంది వాటిని కూడా దొంగతనం చేసి నవ్వులు పాలువుతుంటారు. అచ్చం అలాంటి పనే ఇక్కడొక మహిళ చేసింది.
(చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?)
అసలు విషయంలోకెళ్లితే...ఐరన్ వస్తువులకు సంబంధించిన ఒక పెద్ద స్టోర్‌లో ఒక మహిళ చైన్ సా (కటింగ్ సాధనం(రంపం))ని దొంగలిస్తుంది. నిజానికి దాన్ని దొంగతనం చేయడం పైగా ఎవ్వరికి కనిపించకుండా దాచిపెట్టి తీసుకెళ్లడమనేదే అసాధ్యం. అలాంటి వస్తువును ఆమె దాచడానికి తెగ ప్రయత్నిస్తోంది.
ఈ మేరకు ఆ స్టోర్ సీసీపుటేజ్‌లో ఆమె ఆ వస్తువును దాచడానికీ ప్రయత్నించే క్రమంలో ఫ్యాంటు వెనుకవైపు లోపలకి దూర్చడమే కాకా పైన వేసుకున్న కోటుతో కవర్ చేయడానికీ ప్రయత్నిస్తుంది. కానీ ఆమె భుజానికి తగలించిన బ్యాగ్‌ల మూలంగా ఆ వస్తువు బయటకీ కనిపిస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు "ఆమె ఈ వస్తువును దాచిపెట్టగలనా లేదా అని చూస్తోంది" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: వ్యాక్సిన్ వేయించుకుంది.. రూ 7.4 కోట్లు గెలుచుకుంది)