ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు.
బహుశా ఎలాగో పోతున్నాం కదా అని దొంగతనం చేస్తున్నారు కాబోలు. ఈ క్రమంలో ఖెర్సన్ జూలోని ఏడు రకూన్లు అనే అమెరికన్ ఎలుగుబంటి జాతులను, లామా అనే ఒంటె, నెమళ్లు, రెండు ఆడ తోడేళ్లు, గాడిద వంటి జంతువులను బలవంతంగా పట్టుకుని వాహనంలో ఎక్కించారు. కేవలం జంతువులే కాదు అక్కడ ఆస్పత్రుల్లో ఉన్న వివిధ కళాఖండాలు, వైద్య పరికరాలు వంటివి పట్టుకుపోయారు.
ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ జంతు ప్రదర్శనశాల నుంచి రష్యా బలగాలు జంతువులను పట్టుకుపోవడాన్ని తప్పపట్టారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి పెయింటింగ్‌లు,మ్యూజియంల నుంచి పురాత వస్తువులు తదితరాలన్నింటిని దొంగలించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు రష్యా బలగాలు ఉక్రెయిన్‌ని ఏమీ చేయలేక ఈ దొంగతనానికి ఒడిగట్టారంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment