Volodymyr Zelensky Has Criticized That Russia Is More Dangerous Than ISIS, Details Inside - Sakshi

ఐసిస్‌ కంటే రష్యానే మహాప్రమాదకరం

Apr 12 2023 7:39 PM | Updated on Apr 13 2023 5:38 AM

Russia Worse Than ISIS Says Ukraine On Viral Video - Sakshi

ఏడాదికి పైగా యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్‌.. రష్యాపై తీవ్ర ఆరోపణలకు దిగింది. ఐసిస్‌ కంటే రష్యా ప్రమాదకరమైందని, ఆ దేశ సైనికుల అకృత్యాలు మరీ దారుణంగా ఉంటున్నాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ విమర్శించారు. 

తాజాగా రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఓ వ్యక్తి తల నరికి కిరాతకంగా చంపారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అయ్యింది. చనిపోయిన వ్యక్తి చేతికి ఉక్రెయిన్‌ సైనికులు ధరించే యెల్లో బ్యాండ్‌ ఉండడంతో.. అతను  ఉక్రెయిన్‌ సైనికుడు అయ్యి ఉంటాడని అంతా భావించారు. అయితే.. అతడు తమ సైనికుడేనని ఉక్రెయిన్‌ తాజాగా ధృవీకరించింది. 

ప్రపంచంలో ఎవరూ విస్మరించలేని విషయం  ఒకటి ఉంది. ఈ జంతువులు ఎంత సులువుగా మనుషుల్ని చంపుతున్నాయో. రష్యా ఐసిస్‌ కంటే ఘోరమైంది. మహా ప్రమాదకరమైంది అంటూ వైరల్‌ వీడియోపై వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా సైతం ఈ భయానక వీడియోపై తీవ్రంగా స్పందించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు భద్రతా సంస్థ ప్రకటించింది. 

అయితే.. వైరల్‌ అవుతున్న వీడియోపై మాస్కో వర్గాలు ఇంకా స్పందించలేదు. గతంలో ఉక్రెయిన్‌ ఆక్రమణ సందర్భంగా ఇలాంటి వీడియోలు చాలానే వైరల్‌ అయ్యాయి. అయితే వాటన్నింటిని ఖండిస్తూ వచ్చింది క్రెమ్లిన్‌.

ఇస్లామిక్‌ దేశాలపైనా ఇరాక్‌, సిరియాలలో ఐసిస్‌ ఉగ్రవాదులు 2014-17 మధ్య నరమేధం సృష్టించారు. మనుషుల్ని నరికి చంపుతూ.. ఆ వీడియోలను రిలీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement