Singer Sri Krishna Reacts To Yasaswi Kondepudi Controversy, Deets Inside - Sakshi
Sakshi News home page

Singer Sri Krishna : 'యశస్వీకి ఆ అవసరం లేదు.. నేనే స్వయంగా చూశాను' సింగర్‌ శ్రీకృష్ణ సపోర్ట్‌

Feb 10 2023 11:41 AM | Updated on Feb 10 2023 1:40 PM

Singer Sri Krishna Reacts To Yasaswi Kondepudi Controversy - Sakshi

సింగర్‌ యశస్వి కొండెపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జాను చిత్రంలోని లైఫ్‌ ఆఫ్‌ రామ్‌ పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న యశస్వి తాజాగా ఓ వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఓ షోలో యశస్వి తాను చేసిన సేవా కార్యక్రమాల గురించి వెల్లడించాడు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. దీనిపై కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు ఫరౌ కౌసర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

యశస్వీ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని, ఏమీ చేయకుండా అబద్దపు ప్రచారాలు చేసి తమ సంస్థ పేరును వాడుకొని ఫేమ్‌, ఓటింగ్‌ పెంచుకోవాలని చూస్తున్నాడంటూ యశస్వీపై ఆరోపణలు గుప్పించింది. తాజాగా ఈ కాంట్రవర్సీపై సింగర్‌ శ్రీకృష్ణ స్పందించారు. 'యశస్వీ కేవలం పబ్లిసిటీ కోసం ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఎందుకంటే తాను వివిధ ఎన్జీవోలకు పెద్ద మొత్తంలో సహాయం చేయడం నేను స్వయంగా చూశాను. అతను ఆల్రెడీ అందరికి తెలిసిన సింగర్‌. అలాంటప్పుడు ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి నిజం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ పోస్ట్‌ చేస్తున్నాను. నేను యశస్వికి సపోర్ట్‌ చేస్తున్నా' అంటూ ఇన్‌స్టాలో సుధీర్ఘ పోస్టులో రాసుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement