Yasaswi Kondepudi
-
ఈ పాట ఏ. ఆర్ రెహమాన్ ముందు పాడాలని నాకు చాలా ఆశగా ఉంది
-
యశస్వీకి పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు : సింగర్
సింగర్ యశస్వి కొండెపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జాను చిత్రంలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటతో ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న యశస్వి తాజాగా ఓ వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఓ షోలో యశస్వి తాను చేసిన సేవా కార్యక్రమాల గురించి వెల్లడించాడు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. దీనిపై కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఫరౌ కౌసర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యశస్వీ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని, ఏమీ చేయకుండా అబద్దపు ప్రచారాలు చేసి తమ సంస్థ పేరును వాడుకొని ఫేమ్, ఓటింగ్ పెంచుకోవాలని చూస్తున్నాడంటూ యశస్వీపై ఆరోపణలు గుప్పించింది. తాజాగా ఈ కాంట్రవర్సీపై సింగర్ శ్రీకృష్ణ స్పందించారు. 'యశస్వీ కేవలం పబ్లిసిటీ కోసం ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే తాను వివిధ ఎన్జీవోలకు పెద్ద మొత్తంలో సహాయం చేయడం నేను స్వయంగా చూశాను. అతను ఆల్రెడీ అందరికి తెలిసిన సింగర్. అలాంటప్పుడు ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి నిజం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నాను. నేను యశస్వికి సపోర్ట్ చేస్తున్నా' అంటూ ఇన్‌స్టాలో సుధీర్ఘ పోస్టులో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Srikrishna Vishnubhotla (@music.srikrishna) View this post on Instagram A post shared by yasaswi_fanpage (@yasaswi_girl_fanpage) -
నాకు బుద్ధి తక్కువై అలా చేశాను: యశస్వి కొండెపూడి
సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి.. తాను చేసిన సేవాకార్యక్రమాల గురించి వెల్లడించాడు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని నవసేవ ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ మండిపడ్డారు. నవసేన ఎన్జీవో ద్వారా 50-60 మందిని చదివిస్తున్నట్లు చెప్పాడని, కానీ అదంతా వట్టి అబద్ధమని పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై యశస్వి స్పందించాడు. 'నవసేనకు, ఆ ఎన్జీవోలోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు, వారిని దత్తత తీసుకున్నట్లు నేనెక్కడా చెప్పలేదు. నేను వాళ్ల దగ్గరకు వెళ్లలేదు, నాకసలు సంబంధమే లేదు. సాధ్య ఫౌండేషన్‌కు మా కుటుంబమంతా సహాయం చేస్తుంటాం. ఈ ఫౌండేషన్ తమకు నచ్చిన సంస్థలకు సాయం చేస్తుంటుంది. అలా వాళ్లు కాకినాడలోని ఓ అనాధాశ్రమానికి సాయం చేశారు. మా బ్రదర్స్ సాధ్య ఫౌండేషన్‌కు సాయం చేశారు. దానిద్వారా వారు నవసేన ట్రస్టుకి మూడు, నాలుగుసార్లు సాయం చేశారు. కాబట్టి వాళ్లతో ఆల్‌ద బెస్ట్ చెప్పించుకుంటామన్నారు. నవసేన నిర్వాహకులు ఫరా కుటుంబం ఎదురుగానే పిల్లలతో ఆల్‌ద బెస్ట్ చెప్పిస్తూ వీడియోలు చేశారు. నా ఫ్యాన్స్ కూడా పుట్టినరోజు నాడు అదే ట్రస్టులో పిల్లలతో కేక్ కట్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆ వీడియోలన్నింటిని చిన్నగా కట్ చేసి ప్రోమోలో యాడ్ చేశారు. అందులో నవసేన అన్న బోర్డు కనిపించింది. మా బోర్డు వాడుకున్నారు, కానీ పిల్లలను చూపించలేదు అని ఆమె అడిగారు. ఇది ప్రోమోనే, ఎపిసోడ్లో అంతా వస్తుందని చెప్పాను. అయినా ఆమె ఇంత రాద్ధాంతం చేస్తుండటంతో ప్రోమో డిలీట్ చేయించా. ఎపిసోడ్లో కూడా అవేవీ ఉండకుండా ఎడిట్ చేసేయమన్నాను. ఇంతవరకు నా జీవితంలో ఎక్కడా నాకు నెగెటివ్ మార్క్ లేదు, ఇప్పుడిదంతా జరుగుతుంటే చాలా బాధగా ఉంది. పిల్లలను అడ్డు పెట్టుకుని నేనెందుకు ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటాను. ఆమె ఫోన్ చేసి మా సంస్థ బోర్డు చూపించారు, కాబట్టి 9 నెలల దాకా అనాధాశ్రమాన్ని దత్తత తీసుకోవాలంటున్నారు. నాకు ఉన్నంతలో సాయం చేస్తాను, కానీ దత్తత ఎలా తీసుకుంటాను? అన్నాను. దీంతో ఆమె లీగల్‌గా వెళ్తానంది. మాట విననప్పుడు ఏం చేస్తాను, సరేనన్నాను. కానీ నాకు బుద్ధి తక్కువై ఎపిసోడ్‌కు వీడియోలు ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు యశస్వి. -
సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ
యశస్వి కొండెపుడి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడి ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన యశస్వి పాటనే మారుమోగింది. ఆ సీజన్ సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్‌గా టైటిల్ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాడు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతడి బాగోతాన్ని నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ బట్టబయలు చేశారు. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! కాగా ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేవ అనే పేరుతో గత ఐదేళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని చెప్పారు. కానీ ఓ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా? అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్‌పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కాగా సరిగమప సింగింగ్ షో తెచ్చిన పెట్టిన పాపులారిటితో యశస్వి సెలబ్రెటి అయిపోయాడు. అదే క్రేజ్‌తో అతడు పలు ఈవెంట్స్‌లో తన గాత్రంతో అలరిస్తూ ఎన్నో షోలు చేస్తూ బిజీగా మారాడు.