యశస్వి కొండెపుడి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడి ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన యశస్వి పాటనే మారుమోగింది. ఆ సీజన్ సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్‌గా టైటిల్ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాడు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతడి బాగోతాన్ని నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ బట్టబయలు చేశారు.
చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు!
కాగా ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్‌లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేవ అనే పేరుతో గత ఐదేళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని చెప్పారు. కానీ ఓ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.
చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్‌పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కాగా సరిగమప సింగింగ్ షో తెచ్చిన పెట్టిన పాపులారిటితో యశస్వి సెలబ్రెటి అయిపోయాడు. అదే క్రేజ్‌తో అతడు పలు ఈవెంట్స్‌లో తన గాత్రంతో అలరిస్తూ ఎన్నో షోలు చేస్తూ బిజీగా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment