నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన | Actress Mirchi Madhavi Cheated Financially From Close Person | Sakshi
Sakshi News home page

Actress Madhavi: ఆ వ్యక్తిని చాలా నమ్మాను, కానీ అతడు నా డబ్బు కాజేశాడు: నటి ఆవేదన

Published Sun, Mar 5 2023 9:37 AM | Last Updated on Sun, Mar 5 2023 9:53 AM

Actress Mirchi Madhavi Cheated Financially From Close Person - Sakshi

ప్రముఖ సినీ, టీవీ నటి మాధవి ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయానంటూ షాకింగ్‌ విషయం బయటపెట్టింది. నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్‌ ‘మిర్చి’ సినిమాతో ఆమె గుర్తింపు పొందిం​ది. మిర్చిలో మాట వినని కొడుకు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిగా కనిపించింది. దీంతో ప్రభాస్‌ ఆమెకు విలన్‌ కుటుంబం తరపున డబ్బు సాయం చేస్తాడు. అలా ఈ సినిమాలో ఎమోషన్స్‌ పండించి నటిగా మంచి  గుర్తింపు పొందిన ఆమె పలు టీవీ సీరియల్స్‌లో విలనిజం పోషిస్తోంది. బుల్లితెరపై కుట్రలు చేస్తూ, మోసం చేసే పాత్రల్లో మాధవి ఆకట్టుకుంటోంది.

చదవండి: ఏడాది తిరక్కుండానే యాంకర్‌ శ్యామల మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’

అలాంటి ఆమె నిజ జీవితంలో ఓ వ్యక్తి నమ్మ భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకుందట. ఇటీవల లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తనకు తెలిసిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు బాగా తెలిసిన వ్యక్తి స్టాక్‌ మార్కెట్లో డబ్బులు పెట్టమన్నాడు. అతడిని నమ్మి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మాయ మాటలు చెబుతూ ఆ డబ్బు మొత్తం కాజేశాడు. స్టాక్‌ మార్కెట్‌పై నాకు పెద్దగా అవగాహన లేకపోడం వల్లే సులువుగా నన్ను మోసం చేయగలిగాడు.

చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కల్యాణ్‌ రామ్‌ అమిగోస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..!

డబ్బు పోయిందనే బాధ కంటే.. తెలిసినే వ్యక్తే, నేను బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని, లేదంటే తనలా మోసపోతారంటూ నెటిజన్లకు సూచించింది. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలియకుండ అసలు డబ్బులు ఇన్వెస్ట్‌ చేయొద్దని ఆమె తెలిపింది. కాగా స్టార్‌ మాలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో మాధవి దేవయాని పాత్ర పోషించింది. ఇందులో హీరోకు పెద్దమ్మగా నటించింది. కపట ప్రేమ చూపిస్తూ.. సొంతవాళ్లపైనే కుట్రలు చేసే పెద్దమ్మగా మాధవి తన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సీరియల్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement