
తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. కానీ గత కొన్నేళ్లలో మాత్రం 'కార్తీకదీపం' హిట్ అయినట్లు మరేది క్లిక్ అవ్వలేదని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇందులో హీరోయిన్ వంటలక్కగా చేసిన ప్రేమి విశ్వనాథ్.. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారిపోయింది.
స్వతహాగా మలయాళ నటి అయిన ప్రేమి విశ్వనాథ్.. 2014 నుంచి సీరియల్స్ చేస్తోంది. తొలుత సొంత భాషలో చేసింది. 2017 నుంచి మాత్రం తెలుగులో కార్తీకదీపం చేస్తోంది. 2023 వరకు కొనసాగిన ఈ సీరియల్.. అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ నటుడు దర్శన్ అరెస్ట్!)
ప్రస్తుతం రెండో సీజన్ అని నడిపిస్తున్నారు. 300కి పైగా ఎపిసోడ్లు ప్రసారం చేశారు గానీ తొలి పార్ట్ అంత బజ్ సొంతం చేసుకోలేకపోయింది. సీరియల్ గురించి పక్కనబెడితే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈమె రోజుకి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తోందట.
నెలలో దాదాపు 20-25 రోజుల పాటు ప్రేమి విశ్వనాథ్ షూటింగ్ లో పాల్గొంటుంది. తద్వారా లక్షల్లోనే పారితోషికం అందుకుంటోంది. రెమ్యునరేషన్ విషయంలో వంటలక్క తర్వాత సుజిత, కస్తూరి లాంటి ఆర్టిస్టులు ఉన్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఏళ్లు గడుస్తున్నా వంటలక్క క్రేజ్ మాత్రం తగ్గట్లేదుగా!
(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)