
ప్రముఖ దర్శకులు రాజమౌళి వద్ద ‘మగధీర’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. అశోక్ కుమార్, ప్రియాంక శర్మ జంటగా చంద్ర బాలాజీ ఫిల్మ్స్ పతాకంపై కె.చంద్రరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. సాయికృష్ణ మాట్లాడుతూ –‘‘రాజమౌళిగారి స్ఫూర్తితో దర్శకునిగా మారా. అశోక్ కుమార్ కొత్తవాడైనా అనుభవం ఉన్నవాడిలా తన పాత్రలో జీవించాడు. సినిమా విడుదల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు మరో యువ హీరో వచ్చాడని అంటారు.
నాకు దర్శకునిగా అవకాశమిచ్చిన చంద్రరావుకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. పల్లెటూరి నేపథ్యంలో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు అశోక్ కుమార్. ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్ యస్, సంగీతం: యాజమాన్య, సహనిర్మాత: శ్రీతేజ్ మనోజ్ పాలిక.
Comments
Please login to add a commentAdd a comment