
నటుడు శివాజీ(పాత చిత్రం)
విజయవాడ: బీజేపీ నాయకత్వంపై సినీ నటుడు శివాజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే శివాజీతో చంద్రబాబు ఆపరేషన్ గరుడ అంటూ మాట్లాడిస్తున్నారని విమర్శించారు. మతి భ్రమించిన శివాజీ, బాబు డైరెక్షన్లో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు నెలల క్రితం శివాజీ ఇదే ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడారు..అందులో ఏ ఒక్కటైనా నిజమైందా అని సూటిగా ప్రశ్నించారు.
ఆపరేషన్ గరుడ అనేది బీజేపీపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఎత్తుకున్న విషయమని, అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా తయారు చేసిందని ఆరోపించారు. టీడీపీ కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైంది..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో సోనియాను దెయ్యం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే సోనియా గాంధీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని సూటిగా అడిగారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిదన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment