Operation Garuda
-
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఆపరేషన్ గరుడ: డ్రగ్స్ ముఠాలపై సీబీ‘ఐ’.. 175 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్థాల(డ్రగ్స్) దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు నెరుపుతూ దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై కేసులు, అరెస్టులు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గరుడ ఏమిటి? అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్‌వర్క్‌లను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో పలు దఫాలుగా తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఇంటర్‌పోల్ ద్వారా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి డ్రగ్ ట్రాఫికింగ్లను గుర్తించేందుకు ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనూ ఈ తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీబీఐ తెలిపింది. ఇంటర్‌పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)ల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్న నెట్వర్క్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ కొనసాగిస్తోంది సీబీఐ. దీని ద్వారా డ్రగ్స్ నిర్వహణ, సరఫరా, తయారీ జోన్స్, వారికి మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపట్టింది. 6600 అనుమానితులపై.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. సుమారు 6600 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసింది. 127 కొత్త కేసులు నమోదు చేసి.. 175 మందిని అరెస్ట్ చేసింది. అందులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సైతం ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1365 గ్రాముల మెఫెడ్రోన్, 33.8 గ్రాముల స్మాక్, బుప్రెనోర్ఫిన్కు చెందిన 87 సిరంజీలు, 122 ఇంజెక్షన్లు, 87 ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే 946 అల్ప్రాజోలమ్ ట్యాబ్లెట్లు, 106 కిలోల ట్రామడోల్, 10 గ్రాముల హాష్ ఆయిల్, 0.9 గ్రాముల ఎక్స్టాసీ పిల్స్, 1.15 కిలోల ఓపియమ్, 30 కిలోల పప్పీ హక్, 1.43 కిలోల ఇటోక్సికాంట్ పౌండర్, 11039 పిల్, క్యాప్సల్స్ సీజ్ చేసింది. ఇదీ చదవండి: పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
మీడియాపై శివాజీ చిందులు
సాక్షి, గన్నవరం : ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇటీవల హడావుడి చేసిన సినీనటుడు శివాజీ సోమవారం కృష్ణా జిల్లా గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మండల పరిధిలోని అపార్టుమెంట్లో ప్లాట్ల కొనుగోలు నిమిత్తం వచ్చిన ఆయన మీడియా కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై శివాజీ రుసరుసలాడారు. ఫొటోలు, వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ‘రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు... అంతేగా..’ అంటూ చిరుబుర్రులాడారు. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే పరుగు పరుగున కారు ఎక్కేసి వెళ్లిపోయారు. గన్నవరం మండలం చిన్నఆవుటపల్లి పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన అపార్టుమెంట్లో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ నిమిత్తం శివాజీ సాయంత్రం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. శివాజీ నేరుగా సబ్‌రిజిస్ట్రార్ చాంబర్లోకి వెళ్లి కూర్చోగా ఆయన వెంట వచ్చిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులను ఫొటోలు తీయకుండా శివాజీ వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు అడ్డుకున్నారు. దౌర్జన్యంగా ఫోన్ల నుంచి ఫొటోలను తొలగించారు. -
ఆపరేషన్ గరుడ..శివాజీపై డీజీపీకి ఫిర్యాదు
హైదరాబాద్: సినీ నటుడు శివాజీపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బుర్రగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి శివాజీని అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే కుట్రతో ఈ దాడి జరిగిందని, సినీ నటుడు శివాజీ ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్లోనే శివాజీ ఉంటున్నాడు కాబట్టి తెలంగాణ పోలీసులే విచారించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీజీపీ సానుకూలంగా స్పందించారని, ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని బుర్రగడ్డ అనిల్ తెలిపారు. -
ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు యాగీ
-
మీరు జోక్యం చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత దర్యాప్తు జరుగుతోందని, తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని సంస్థలతో దర్యాప్తు జరిపించేలా చూడాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆరు పేజీల లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రపతికి అందజేసింది. లేఖ సారాంశం ఇదీ.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రమాదకర పరిస్థితులను మీ దృష్టికి తేవాలని ఈ లేఖ రాస్తున్న. 2018 అక్టోబర్ 25న సుమారుగా మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో ఓ యువకుడి చేతిలో హత్యాయత్నానికి గురయ్యాను. సెల్ఫీ ఫొటో తీసుకోవాలంటూ నాకు అత్యంత చేరువగా వచ్చి పదునైన ఆయుధంతో నా గొంతు కోయడానికి ప్రయత్నించాడు. సాధారణంగా ఆ ఆయుధాన్ని కోడి పందేల్లో కత్తిగా వాడుతారు. ఆత్మరక్షణలో భాగంగా నేను వెంటనే స్పందించి.. మెడకు తగలకుండా భుజాన్ని అడ్డుపెట్టాను. నా ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. 3.5 నుంచి 4 సెంటీమీటర్ల లోతున కోసుకుపోయింది. నా వెంట ఉన్న వారు హత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని పట్టుకుని అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ డాక్టర్ నాకు అవసరమైన ప్రాథమిక చికిత్స చేశారు. నా పై హత్యాయత్నం జరిగిందనే వార్తలు రాష్ట్రంలో తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని నేను గ్రహించాను. అందువల్ల రాష్ట్ర ప్రజలు నా క్షేమంపై ఆందోళన చెందకుండా ఉండాలన్న ఆలోచనతో నేను రక్తంతో తడిచిన నా చొక్కాను మార్చుకున్నాను. కనీస ప్రాథమిక చికిత్స పొంది, గాయానికి డ్రెసింగ్ చేయించుకుని షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 1.05 గంటల విమానంలో హైదరాబాద్ బయలుదేరాను. రెస్టారెంట్ యజమాని సాయంతోనే.. హైదరాబాద్ చేరుకున్న వెంటనే నన్ను సిటీ న్యూరో ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. భుజానికి అయిన లోతైన గాయాన్ని వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స నిర్వహించి 9 కుట్లు వేశారు. తెగిన కండరానికి నాలుగు కుట్లు, మిగిలినవి చర్మానికి వేశారు. దాడిలో విషమేదైనా వాడారేమోనన్న అనుమానంతో రక్త నమూనాలను తదుపరి వైద్య పరీక్షల కోసం పంపారు. దుండగుడు నాపై దాడికి వాడిన కత్తి.. రెండు భద్రతా వలయాలను దాటుకొని ఎయిర్‌పోర్ట్‌లోకి చేరింది. హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్లో పని చేస్తున్న ఉద్యోగి. ఈ రెస్టారెంట్‌ను హర్షవర్దన్ అనే టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్నారు. ఈయన గాజువాక శాసనసభ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ టికెట్ ఆశించిన నేత. ఇతనికి ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్‌తోపాటు ఇతర టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మరోవైపు దుండగుడికి నేర చరిత కూడా ఉంది. ఇతడిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ హర్షవర్దన్ అతడికి ఉద్యోగం కల్పించారు. టీడీపీ ప్రభుత్వం కోసం పని చేస్తున్న హర్షవర్దన్ సహాయం లేకుండా హత్యాయత్నం చేసిన యువకుడు ఎయిర్‌పోర్టులో పని చేసేందుకు అనుమతి గానీ, ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి గానీ వచ్చి ఉండేవి కాదు. ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చి, లోపభూయిష్ట విధానంలో ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో దర్యాప్తు సంస్థ ఉద్దేశ పూర్వకంగానే ముందస్తుగా ఒక ముగింపునకు సిద్ధమైంది. నేను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అంతర్గత కుట్రగా దీనిని చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే రాష్ట్ర డీజీపీ మీడియా ముఖంగా ఒక ప్రకటన చేశారు. ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే అతడు ఈ దాడికి పాల్పడ్డాడని ప్రాథమిక దర్యాప్తు సంకేతాలిస్తోందని డీజీపీ ప్రకటించారు. నిర్దిష్టత లేకుండా ఆయన చేసిన ఈ ప్రకటన ఈ దాడిని చిన్న అంశంగా చూపింది. తద్వారా అధికార టీడీపీ ప్రయోజనాలకు ఉపకరించేలా చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నా పై జరిగిన దిగ్భ్రాంతికర దాడిని చిన్నదిగా చూపించే ఉద్దేశంతో పని చేస్తోందని స్పష్టమైంది. పైగా.. నాపై హత్యాయత్నానికి పాల్పడిన యువకుడు వైఎస్సార్సీపీ అభిమాని అని డీజీపీ ప్రకటించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేకున్నప్పటికీ ఆయన ఈ ప్రకటన చేశారు. సీఎం ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారు ఈ దాడి ప్రణాళికాబద్ధంగా, పార్టీలో అంతర్గతంగా జరిగిందని.. రానున్న ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు చేసిన దాడి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీడీపీ నేతలు అనేక ప్రకటనలు చేశారు. నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే దర్యాప్తు ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు, ముందుగా నిర్దేశించిన దారిలోకి మళ్లించేందుకు ఎంచుకున్న క్రూరమైన వ్యూహమిది. నేను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఇంటికి వెళ్లానని, బీజేపీ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చాకనే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యానని ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఇది పూర్తిగా అసత్యం. దర్యాప్తు సంస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. భద్రతా సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ భద్రత వాహనంలో ఎయిర్పోర్ట్ నుంచి నన్ను నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ‘ఆపరేషన్ గరుడ’ అని శివాజీ చెబుతున్నారు హత్యాయత్నం చేసిన యువకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు అని చెప్పేందుకు టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు ఓ ఫ్లెక్సీని తెరపైకి తెచ్చారు. దాడి జరిగిన ఒక గంటలోనే డీజీపీ, టీడీపీ నేతలు ఎప్పుడో 9 నెలల కిందటి కాలానికి చెందినదని సూచిస్తున్న ఓ ఫ్లెక్సీని ఎలా తేగలిగారన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలాగే టీడీపీ మీడియా ఆవిష్కరించిన ఆ ఫ్లెక్సీ బొమ్మల్లో కొన్నింటిపై గులాబీ బొమ్మ ఉండగా మరికొన్నింటిలో లేదు. ఇటీవల తెలుగు చిత్ర రంగానికి చెందిన శివాజీ అనే టీడీపీ సానుభూతిపరుడు ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఒక థియరీని తీసుకొచ్చారు. బీజేపీ దానిని అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ పథకంలో భాగంగా నాపై దాడి జరుగుతుందని, దీనిని ఆసరాగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిర çపరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని ఫ్లెక్సీలపై గరుడ చిత్రాన్ని ప్రముఖంగా ముద్రించారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే నాపై దాడి జరిగిందని చిత్రించేలా టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. వీటన్నింటి దృష్ట్యా చూస్తుంటే ఈ ఘటన నన్ను కడతేర్చాలన్న కుట్రగా అర్థమవుతోంది. అది విఫలమైనప్పుడు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆపరేషన్ గరుడ’గా చిత్రించి, రాజకీయ లబ్ధికి వీలుగా వాడుకునేందుకు పన్నిన కుట్రగా స్పష్టమవుతోంది. దీనిని అమలు చేయడానికి ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకోవడం, ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తిని తేగలిగే వీలు కల్పించడం కూడా కుట్రలో భాగం. ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ నియంత్రణలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపవచ్చనేలా కుట్రదారులు ప్రణాళిక రచించారు. దర్యాప్తును ప్రభావితం చేశారు ముఖ్యమంత్రి ఒక సిగ్గుమాలిన చర్యకు దిగారు. బీజేపీ, జేఎస్పీ, టీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలియపరిస్తే దానిని కుట్రకు సంకేతమని, దాడిలో వారి హస్తం ఉందని చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నించారు. అలా అనుకుంటే నా వద్దకు వచ్చి సానుభూతి తెలిపిన వారిలో తెలంగాణలో ఆయన మిత్రపక్ష కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయలేదు? ఇది ముఖ్యమంత్రి దిగజారుడు వైఖరిని తెలియజేస్తోంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరిగినప్పుడు రాష్ట్ర యంత్రాంగానికి అధిపతిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రే స్వయంగా ఈ దాడి ఆ పార్టీలో జరిగిన అంతర్గత కుట్రగా మాట్లాడడం దురదృష్టకరం. ఇది దర్యాప్తును ప్రభావితం చేసేందుకు జరిపిన ప్రయత్నం. దాడిని ప్రజలు నమ్మకుండా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయాలని ముఖ్యమంత్రి ఈ ప్రచారానికి దిగారు. 3.5 సెంటీమీటర్ల లోతున తెగడంతో 9 కుట్లు పడ్డాయని డాక్టర్లు వెల్లడించినప్పటికీ.. కేవలం 0.5 సెంటీమీటర్ల మేర మాత్రమే తెగిందని ముఖ్యమంత్రి ప్రెస్మీట్లో చెబుతూ చిన్న ఘటనగా చిత్రీకరించే యత్నం చేశారు. ఒకవేళ ఆ దాడిలో తలకు, మెడకు రక్త ప్రసరణ జరిపే ధమనులు దెబ్బతిని ఉంటే ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడి ఉండేదని ఊహిస్తేనే దిగ్భ్రాంతికరంగా ఉంటుంది. అసలు కుట్రదారుల ప్రాథమిక ఉద్దేశమే ఇది. కానీ ఆ దేవుడి అండతో ఆ ప్రమాదం తృటిలో తప్పింది. అందుకే మీరు జోక్యం చేసుకోవాలి రాష్ట్ర సర్కార్ పరిధిలో దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు జరిపితే అవి ప్రభావవంతంగా వాటి విధులు నిర్వర్తించలేవు. నేర ఘటనలో బాధితుడు న్యాయమైన విచారణకు, నిష్పాక్షిక దర్యాప్తు కోరుకునేందుకు అర్హుడు. ఏ దర్యాప్తు అయినా న్యాయంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలి. పక్షపాతంగా ఉండకూడదు. నిగూఢ ఉద్దేశంతో ఉండకూడదు. ముందస్తు నిర్ధారణకు రాకుండా, ముందస్తుగానే ఒక నిర్ణయానికి రాకుండా తగిన సాక్ష్యాధారాలను సేకరించడం, దర్యాప్తు నిర్వహించడం న్యాయమైన దర్యాప్తులో కీలక అంశాలు. ఈ ఘటన ఓ కుట్రగా పుష్కలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వైఎస్సార్సీపీలో జరిగిన అంతర్గత కుట్ర అన్న కోణంలో ఈ దర్యాప్తు ప్రక్రియను నడిపిస్తున్నాయి. నిష్పాక్షిక దర్యాప్తు జరగడం లేదనడానికి ఇదే సంకేతం. ఈ నేపథ్యంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేస్తే ఈ ఘటన వెనక వాస్తవాలను వెలికితీసేందుకు దోహదపడుతుంది. నేరస్తులకు శిక్ష పడేలా చేస్తుంది. ఆ లేఖ కల్పితం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి పాత్రికేయుల సమావేశంలో నాపై, వైఎస్సార్ కాంగ్రెస్‌పై జుగుప్సాకరంగా మాట్లాడారు. దాడికి పాల్పడిన వ్యక్తి నుంచి 10 పేజీల లేఖను స్వాధీన పరుచుకున్నామని, అతడు వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరుడని ఈ లేఖ ద్వారా తెలిసిందని చెప్పారు. అతని ఇంటిని తనిఖీ చేస్తుండగా దివంగత రాజశేఖరరెడ్డి ఫొటో దొరికిందని ప్రకటించారు. సానుభూతి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఈ దాడికి పథక రచన చేసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన దురుద్దేశంతో కూడినది. జేబులో లేఖ దొరికిందంటే అది మడత పెట్టి ఉండాలి. అలా మడతపెట్టి ఉంటే అన్ని పేజీలకూ మడతలు ఉండాలి. కానీ ఒకే పేజీ మడత పెట్టినట్టుగా స్పష్టమైంది. మరోవైపు ఆ లేఖను ఒకరికంటే ఎక్కువ మంది రాసినట్టు అవగతమవుతోంది. ఎందుకంటే నలుగురైదుగురి చేతి రాత ఆ పేజీల్లో కనిపిస్తోంది. దాడి జరిగిన గంటకు డీజీపీ ప్రెస్మీట్లో చెప్పిన పేజీల సంఖ్యకు, లేఖ విడుదల చేసిన సమయంలో ఉన్న పేజీల సంఖ్యకు మధ్య తేడా ఉంది. నన్ను చంపాలనుకున్న వ్యక్తి తన వద్ద లేఖ పెట్టుకుంటాడా? అతడి వద్ద దొరికిందని చెబుతున్న లేఖ కేవలం కల్పిత గాథ. ఒక నిర్దిష్ట వాదన వినిపించేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగా పెట్టిన లేఖ అది. ఆ యువకుడు నన్ను చంపేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో పోలీస్ శాఖ నిర్ధారించింది. అతను నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నట్టుగా, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుకున్నట్టుగా లేఖలో ఉందని చెబుతున్నారు. ఇది రిమాండ్ రిపోర్ట్ ఉద్దేశాలకు విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ లేఖ కేవలం అబద్ధాల అల్లిక. - భవదీయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి -
బాబు పాలనలో ‘బాధితులే నిందితులు’
‘ఒక సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇంకో పెద్ద సంఘటన సృష్టించే అతి తెలివిని చంద్రబాబు నాయుడు ఎప్పట్నుంచో అమలుపరుస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాప్రయత్నం దరిమిలా ప్రజల్లో రేగిన అలజడి నుంచి అందరి దృష్టిని వేరే అంశంవైపు మరల్చడానికే.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమ యం సందర్భం లేకుండా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా తన పాత మిత్రులం దర్నీ కలిసి వచ్చారన్నది తిరుగులేని వాస్తవం. ఆ హత్యాయత్నంపై ప్రభుత్వం స్పందించిన తీరును మెజారిటీ ప్రజలు ఈసడించుకోవడంతో తొలుత సినీనటుడు శివాజీ భవిష్యత్తును ఊహిస్తూ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందంటూ ప్రచారం మొదలు పెట్టారు. సదరు ప్రచారమూ ఎదురు తిరగడంతో ప్రజల దృష్టిని ఆ కేసు నుంచి మరల్చడానికి.. బాబు అప్పటికప్పుడు రాహుల్ అపాయింట్మెంట్ తీసుకొని పొత్తుల మిషతో ఢిల్లీకి వెళ్లారు. వెంటనే వై.ఎస్.జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన వార్తలను పక్కన పెట్టిన ఒక వర్గం మీడియా బాబు ఢిల్లీ పర్యటనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించింది. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయడానికి నిర్ణయించుకొని చాలా కాలమే అయింది. కూటమి ఏర్పాటై నెలన్నర దాటింది. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అంతకుముందే బాబు ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్, శరద్ యాదవ్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మాయావతి తదితరులను కలిసి వచ్చారు. తర్వాత తాను రాహుల్ ఇంటికి వెళ్లి పొత్తు కుదిరిందని ప్రకటించారు. రాహుల్‌తో అంతకుముందే అవగాహన కుదుర్చుకోకుండానే తెలంగాణలో పొత్తు ఎలా సాధ్యమైందని ఏ ఒక్క మీడియా ప్రతినిధీ ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం. ప్రజాస్వామ్యం దాని అనివార్యత గురించి మాట్లాడే బాబు వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని అవహేళన చేయడాన్ని యావత్ మీడియా తప్పుపట్టి ఉండవలసింది. కానీ ‘కోడికత్తి కేసు’ అంటూ బాబు, ఆయన అంతేవాసులు చేసిన దుష్ప్రచారానికి టీడీపీ అనుకూల మీడియా వంతపాడింది. ఆ దన్నుతోనే బాధితుడైన వై.ఎస్. జగనే ఈ కేసులో నిందితుడు అనే భావం ప్రజల్లో నాటుకుపోయేందుకు అధికార తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. తమ పార్టీ నేతలు పాల్పడే దాష్టీకాలకు, దాడులకు బలైపోతున్న బాధితుల్నే నిందితులుగా చిత్రీకరించడం బాబుకు అలవాటు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా పాల్పడుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకొనే క్రమంలో టీడీపీ నేతలు చేసిన పాశవిక దాడికి గురై తీవ్ర అవమానం పొందిన కృష్ణా జిల్లా ఎమ్మార్వో వనజాక్షి ఉదంతం దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఆమె పట్ల సానుభూతి వెల్లువెత్తడంతో సాక్షాత్తూ బాబు రంగంలోకి దిగి 24 గంటల వ్యవధిలో ఆమెను విధులను అతిక్రమించిన అధికారిణిగా చిత్రీకరించేశారు. ఆమెను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిచి చీవాట్లు పెట్టి పంపించారు. బాధితురాలైన వనజాక్షిపైనే నిందితురాలిగా ముద్రవేశారు. అలాగే గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది దారుణ మరణాన్నికూడా బాబు మీడియా ద్వారా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి పక్షాల డిమాండ్ వల్ల సీఎం ఈ ఘటనపై నియమించిన కమిషన్ కూడా సీఎంకి తోడునీడై నిలిచింది. పుష్కరాల తొక్కిసలాట సంఘటనలో సైతం బాధితులే నిందితులని తేల్చేసింది! భక్తులు ప్రదర్శించిన ఆత్రుతే వారి ప్రాణాలు తీశాయి. ఇందులో సీఎం ప్రమేయమేమీలేదు, ప్రభుత్వ వైఫల్యం లేనే లేదట. సంక్షోభాల నుంచి అవకాశాలు పొందడం తన నైజం అని బాబు పదేపదే చెబుతుంటారు. తాజాగా, వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం సంఘటనను, బద్ధ శత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బాబు తాపత్రయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపించి లబ్ధి పొందిన బాబు, 2019 ఎన్నికల్లో బీజేపీని; బీజేపీతోపాటు వైఎస్సార్సీపీ, జనసేనలను విలన్లుగా చిత్రీకరించి లబ్ధి పొందడానికి వ్యూహాలు రచిస్తున్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం సంఘటనలో కూడా రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రాణాలకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రజల్లో చర్చ మొదలైంది. కేవలం గెలుపే పరమావధిగా అన్ని విలువలకు మంగళం పాడుతూ దానిని ప్రజాస్వామ్య అనివార్యతగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు వేసుకున్న ముసుగును ప్రజలే తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ 81069 15555 -
సముద్రాలనే జయించిన మీరు ప్రకృతిని జయించలేకపోయారా?
సాక్షి, అమరావతి: మట్టిలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలోని మార్పులవల్లే పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మట్టి రహదారిలో పగుళ్లు ఏర్పడ్డాయని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తుపాన్లు, సముద్రాలు, ఎండలనే జయించిన సీఎం ప్రకృతిని జయించలేకపోయారా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. కీలక ప్రాజెక్టు దగ్గరకి వెళ్లే సిమెంట్‌తో నిర్మించిన రహదారి భారీ ఎత్తున బీటలు వారితే సంబంధిత అధికారులు, కాంట్రాక్టులపై చర్యలు తీసుకోకుండా, తప్పంతా ప్రకృతిదేనని వ్యాఖ్యానించడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే దానిని వెంటనే ప్రతిపక్షాలపైకి నెట్టేసే సీఎం ఈసారి తప్పును ప్రకృతి మీదకి నెట్టేశారని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా కేంద్రం పగుళ్లు సృష్టించిందంటూ ధర్మపోరాట దీక్షలకు దిగరు కదా అంటూ చురకలేశారు. అది మట్టి రహదారా మహాశయా.. శీతాకాలంలో పగుళ్లకు వేజలైన్ వాడాలంటూ ఒక నెటిజన్ సెటైర్ ఫొటోలు, వీడియోల్లో కిలోమీటరుకుపైగా ఉన్న ఆ రహదారి సిమెంట్‌తో నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అది మట్టితో నిర్మించిన రహదారి అని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ భూమిలో తేమ శాతం ఎంత, నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది సివిల్ ఇంజనీర్ల కనీస ధర్మమని, అలాంటిది తేమ శాతం తగ్గడం వల్ల రహదారి పగిలిపోయిందని సీఎం బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు. రేపటిరోజున ఏదైనా జరగరానిది జరిగితే ఎండ వేడి పెరగడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయంటూ ప్రకటిస్తారా? అని దుయ్యబట్టారు. సీఎం చెప్పినట్లు వాతావరణ మార్పులవల్ల పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే గోదావరి రెండు జిల్లాలు మునిగిపోయే ప్రమాదముందన్న భయాందోళనలను వారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయంలో పెచ్చులూడిపోయి నీరు లోపలికి రావడంతోపాటు గోడలు కూడా కూలిపోయాయని, ఇప్పుడు కీలక ప్రాజెక్టు వద్ద రోడ్డే ఇలా పగిలిపోయిందంటే కాంట్రాక్టర్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గోదావరి నది పక్కన తేమ తగ్గితేనే రహదారి ఇలా పగిలిపోయిందని, ఇప్పుడు కృష్ణా నది పక్కన రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, మెత్తటి నేలల్లో ఇంతటి ఎత్తైన భవనాలు ఎలా తట్టుకుంటాయంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టిలో తేమ శాతం తగ్గడం వల్ల కాదు.. పనుల్లో అవినీతి శాతం పెరగడం వల్ల పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. సెటైర్లే సెటైర్లు... సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు భారీ ఎత్తున సెటైర్లు విసురుతున్నారు. ఈ రోడ్లను సింగపూర్ టెక్నాలజీతో నిర్మించారా? లేక జపాన్ టెక్నాలజీనా? అని కొందరు ప్రశ్నిస్తే.. వాతావరణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా ఈ రోడ్డును నిర్మించారంటే ఆ ఇంజనీర్లు తప్పక నారాయణ కాలేజీ నుంచి వచ్చినవాళ్లే అయి ఉంటారంటూ జోకులేస్తున్నారు. వేజలైన్ రాస్తే శీతాకాలంలో పగుళ్లు రావని, ఇకనుంచీ మట్టిలో వేజలైన్ కలిపి రోడ్లు వేయాలంటూ.. దానికి రూ.100 కోట్లు కేటాయించడంటూ ట్వీట్ చేశారు. రెయిన్‌గన్స్ టెక్నాలజీని వినియోగించాలని చురకలేశారు. ప్రకృతినే కంట్రోల్ చేసినవాళ్లకు ఈ పగుళ్లు ఎంతంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో కలవడం ప్రకృతికి కూడా ఇష్టం లేదనుకుంటా అని మరికొంతమంది చమత్కరించారు. సాధారణంగా సీఎం చేసే ట్వీట్‌కు 500లోపు లైకులు, 150 నుంచి 200లోపు ప్రతిస్పందనలు ఉంటాయి. అయితే సీఎం తాజా ట్వీట్‌కు సోమవారం సాయంత్రానికే దాదాపు 3,500 లైకులు, 950కిపైగా రీట్వీట్లు వచ్చాయి. -
చంద్రబాబు స్ధాయి మరిచి అబద్ధాలు చెప్పారు
-
‘గరుడ పురాణం’ పాత సినిమానే!
తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు పాపపు ఆలోచనలకు ఒడిగట్టారు. జగన్ మో హన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని కూడా తన క్షుద్ర రాజకీయ కుట్రలోకి లాగారు. ఇదంతా తెలం గాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆడిన నాటకమేనట, కేసీఆర్, కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు సృష్టించాలని, అస్థిర పరచాలని చూశారని అంటూ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కావాలనుకుంటే కొట్లాడి తెచ్చుకునే వాళ్లం. ఇచ్చిన మాటకోసం తల నరుక్కునే మనుషులు మా నేతలు. చంద్రబాబు తరహాలో కుట్రలు చేయటం మాకు చేతకాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లిస్తున్న ‘గరుడ పురాణం’ పాత రోజుల్లోని ‘అంతిమ తీర్పు’ సినిమా కథ తరహాలో సాగుతోంది. కథానాయకుడే ఒక్కొక్కరిని చంపేస్తూ .. చంపేసిన తీరు తన పత్రికలో కథనంగా రాయటం సినీ ఇతివృత్తం. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆపరేషన్ గరుడ’ సాగుతోంది. సినిమా నటుడు శివాజీని తెరపై చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కనుసన్నల్లో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కలిసికట్టుగా రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్‌ని మించిన హత్యా రాజకీయ చిత్రమిది. ఆయన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఆం్ర«ధా జనం విసిగిపోయారు. అక్రమాలు, అబ ద్ధపు మాటలతోనే గడిపారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ మళ్లీ జనంలోకి వెళ్లాలి. దొంగ మాట లతో... మాయల ఫకీరు వేషాలతో జనాన్ని తన వైపు తిప్పుకోవాలి. ఆ ప్రయత్నంలోంచి పుట్టిందే ‘ఆపరేషన్ గరుడ’. ఇదో ఫ్రీ ప్లాన్డ్ స్కెచ్. విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లోనే ఈ పథకానికి బీజాలు పడ్డాయి. గత ఏడాది జనవరిలో హోదా కోసం అక్కడి యువత విశాఖ ఆర్కే బీచ్‌లో మౌన దీక్ష చేపట్టింది. పోలీ సులు 144 సెక్షన్ పెట్టి మద్దతుదారులు ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేశారు. కానీ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సినిమా నటుడు శివాజీ, చంద్రబాబు మీద ఐదు ప్రశ్నలు సందిస్తున్నానంటూ జనం దృష్టిని ఆకర్షించారు. దీనికి ఓ వర్గం మీడియా విçస్తృత ప్రచారం కల్పించింది. ఏడు నెలల కిందట నుంచి చంద్రబాబు మార్కు రాజకీయ దృశ్య రూపకం తెర మీదకు వచ్చింది. ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తారని, ముఖ్య రాజకీయ పార్టీ నేతపై ప్రాణాపాయంలేని దాడి చేస్తారని.. అనంతరం రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారని దాని పేరే ‘ఆపరేషన్ గరుడ’ అంటూ నటుడు శివాజీ జోస్యం చెప్పారు. దీనికి స్వయంగా చంద్రబాబే ఓ వర్గం మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్లాగా విస్తృత ప్రచారం కల్పించి జనంలోకి వదిలారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ మీడియా ముందుకు రావటం, దాడి చేసిన వ్యక్తి కులాన్ని ప్రస్తావిస్తూ, ఆ వ్యక్తి జగన్ అభిమానేనని, ప్రచారం కోసమే అతను హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు ప్రకటించటం కట్టు కథలు చెప్పినట్టే అనిపించింది. అతడి జేబులో 8 పేజీల లేఖ ఉందని (తరువాత ఇది 11 పేజీలకు పెరిగింది) ముందస్తుగానే ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధం. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని మీద హత్యాయత్నం జరిగినప్పుడు దర్యాప్తు జరుపకుండానే ఒక ఉన్నతస్థాయి అధికారి చెప్పటం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అనూహ్య సంఘటనలు జరిగాయి. మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు హత్య, జగన్‌పై హత్యాయత్నం రెండూ పోలీసు వైఫల్యాలే. నేరాలను పసిగట్టి, సమాచారం అందించే పోలీసు ఇంటెలిజెన్సీ వ్యవస్థను చంద్రబాబు సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అక్కడి సిబ్బందిని తెలంగాణకు పంపించి తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు అనుకూలమైన నియోజకవర్గాలు ఏవో తేల్చాలని ఆదేశించారు. అధికారులు అంతా తెలంగాణ ఎన్నికల సర్వే బిజీలో ఉండటంతోనే ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పట్టుతప్పింది. వీటన్నిటికి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు మానం, అభిమానం లేవు. నీతి నియమాలు లేవు. ఎన్ని అడ్డదార్లు తొక్కైనా అధికారంలో ఉండాలనేది ఆయన ఫిలాసíఫీ. పిల్లనిచ్చిన పాపానికి సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. అధికారం కోసం త్రాచుపాములా సొంత వాళ్లను తినటానికి కూడా వెనుకాడని తత్వం ఆయనది. ప్రతి విషయాన్ని రాజకీయంగా ఆలోచన చేసే నీచ మనస్తత్వం ఆయనది. తెలంగాణలో శాసన సభ్యులను కొనుగోలు చేసి మా ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేసి చట్టానికి అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు. తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి బలిదానాలకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పునాది రాళ్లు వేసిన రోజునే ఉద్యమ నాయకుడు కేసీఆర్ అక్కడికి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా దీవిం చారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మాటిచ్చారు. మాట కోసం తల నరుక్కుంటాడు కానీ చంద్రబాబు తరహా కుట్రలు చేసే మనిషి చంద్రశేఖర రావు కాదు. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే ‘ 94403 80141 -
పథకంలో భాగంగానే శివాజీ అమెరికాకు
-
పథకంలో భాగంగానే శివాజీ అమెరికాకు: రోజా
హైదరాబాద్: గతంలో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ లేకపోయినా చంద్రబాబు నాయుడు తన మద్ధతు ఇచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు సరైన రీతిలో దర్యాప్తు చేయడంలేదని, ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని గవర్నర్ నరసింహన్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కలగజేసుకుని థర్ట్ పార్టీ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన ప్రసాద రావు, ఆర్కే రోజా, మోపిదేవి వెంకటరమణ, కోన రఘుపతి, తదితరులు ఉన్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను రాజకీయంగా తొక్కేయడానికి వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నా మొక్కవోని దీక్షతో ప్రజల్నే నమ్ముకుని నిలదొక్కుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అంతమొందించాలని పక్కా ప్లాన్ చేసి హత్యాయత్నం చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడి కేసు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న గాయమంటూ కేసును తేలికగా కొట్టిపారేస్తున్నారని, కుట్ర కోణంలో విచారణ సాగకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసులో కీలక నిందితుడు హర్షవర్దన్ చౌదరీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, గంటా శ్రీనివాసరావులకు ఎంత సన్నిహితుడో అందరికీ అర్దమవుతోందన్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో నాటకం ఆడుతున్న శివాజీని అరెస్ట్ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పథకంలో భాగంగానే ముందే శివాజీ అమెరికా పారిపోయాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర అంతా హత్యా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లేనని, తనకు అడ్డుగా వస్తే పిల్లనిచ్చిన మామను కూడా అడ్డుతొలగించిన చరిత్ర బాబుదన్నారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్, బీజేపీకి చెందిన పెద్ద నాయకుల కాళ్లు పట్టుకుంటారని చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రం నుంచి చంద్రబాబును తరిమికొట్టినప్పుడే తెలంగాణా, ఏపీ బాగుపడతాయని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను చంపి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టిద్దామని అనుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌కు ప్రజలు, దేవుడిపై అపార నమ్మకం ఉందని, జగన్‌ను పార్టీ కార్యకర్తలే కాపాడుకుంటారని అన్నారు. ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగింది కాబట్టి తమకు సంబంధం లేదని చెబుతున్న టీడీపీ నేతలు.. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చినపుడు ఎయిర్‌పోర్టు రన్‌వే మీద ఎలా పోలీసులు అడ్డుకున్నారని సూటిగా ప్రశ్నించారు. -
బీజేపీ ఆటలు సాగనివ్వను
సాక్షి ప్రతినిధి కడప/ప్రొద్దుటూరు: ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాలపట్ల సమదృష్టిని ప్రదర్శించడంలేదు. విభజన చట్టంలోని అంశాలను అమలుచేయలేదు. రాజకీయంగా విభేదించి ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారు. బీజేపీ ఆటలు సాగనివ్వను’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం జరిగిన ధర్మపోరాటం సభలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లు నిష్టగా రాజకీయాలు చేశానని, ఆ రోజు ఇందిరా గాంధీకి ఎన్టీఆర్ భయపడలేదని.. ఇప్పుడు తాను నరేంద్ర మోదీకి భయపడే ప్రసక్తేలేదన్నారు. మోదీ కంటే పదేళ్లు ముందుగా సీఎంగా బాధ్యతలు చేపట్టానన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా ధర్మపోరాటం చేస్తున్నామని వివరించారు. అసెంబ్లీ సీట్లు పెంచలేదు.. ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. విభజన అంశాలు అమలుచేస్తామని చేయలేదు. చివరికి అసెంబ్లీ సీట్లు పెంచమని కోరినా పెంచలేదు. మొత్తం 175 సీట్లలో టీడీపీ సత్తా చాటుతాం. ‘ఆపరేషన్ గరుడ’పై సినీ నటుడు శివాజీ చెప్పినట్లే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతపై ఆయన అభిమానే కోడికత్తితో దాడిచేశాడు. వీళ్లు చెప్పి చేయించారా.. ఆయనే చేశాడా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. అలాగే, కోడి కత్తి కేసులో నేరుగా గవర్నర్ డీజీపీకి ఫోన్‌చేసి విచారించడం రాజ్యాంగ విరుద్ధం. సాక్షి పేపర్, సాక్షి టీవీ ఉందని ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. వారి ఆటలు సాగవు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసమే పొత్తులు పెట్టుకున్నాం’.. అని బాబు స్పష్టం చేశారు. కాగా, కడప కేంద్రంగా రాయలసీమ ఉక్కు కర్మాగారానికి నెలలోగా శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, సోమిరెడ్డి, దేవినేని ఉమా, ఆది నారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి, బుట్టా రేణుక, జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య పాల్గొన్నారు. తిరుమల బస్సుల అపవిత్రత ఇదిలా ఉంటే.. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని అందరూ ఎంతో పవిత్రంగా కొలుస్తారు. అలాంటిది తిరుమలకు వెళ్లే బస్సులను సైతం టీడీపీ నేతలు అపవిత్రం చేశారు. ప్రొద్దుటూరులో జరిగిన సీఎం ధర్మపోరాట సభకు జనాన్ని తరలించేందుకు తిరుపతి, తిరుమల బస్సులనూ వినియోగించారు. జన సమీకరణ కోసం టీడీపీ నేతలు స్థాయిని బట్టి రూ.200 నుంచి రూ.300 వరకు నగదు ఇవ్వడంతోపాటు బిర్యాని ప్యాకెట్, మద్యం బాటిళ్లు అందించారు. టీడీపీ శ్రేణులు ఈ బస్సుల్లో మద్యాన్ని తీసుకెళ్లడం, మద్యం సేవించి ప్రయాణించడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శివాజీ వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరు?
నాంపల్లి: ఆపరేషన్ గరుడ పేరుతో సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో అలజడులకు కారణమవుతున్నాయని ఏపీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు డేరంగుల ఉదయ్ కిరణ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీ హీరో శివాజీ ఓ టీవీ ఛానెల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను బట్టి అతడి వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆపరేషన్ గరుడలో శివాజీ వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి పేరును బహిర్గతం చేయాలన్నారు. విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. శివాజీ దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కేంద్ర హోంమంత్రి దృష్టికి ఆపరేషన్ గరుడ..
సాక్షి, న్యూఢిల్లీ : ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది ఎవరో నిగ్గు తేల్చాలని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఏపీ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో రాష్ట్రంలో దుమారం రేగుతోంది. అయితే ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సినీ నటుడు శివాజీ గతంలో ఆపరేషన్ గరుడ గురించి మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినవిధంగానే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో ఈ ఆపరేషన్ గరుడ పేరుతో జరుగుతున్న కుట్రపై దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడపై విచారణ జరపాలని, తిత్లీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని బీజేపీ నేతలు కోరారు. అనంతరం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ అనేది టీడీపీ సృష్టేనని, దీనిపై నిజానిజాలు వెలికితీయాలని రెండు నెలల కిందటే ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని విమర్శించారు. వైఎస్ జగన్‌పై దాడి జరుగుతుందని రెండు నెలల కిందటే చెప్పిన వ్యక్తిని సాక్షిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. నటుడు శివాజీని భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. సీఎంపైనే దాడి జరుగుతుందని రెండు రోజుల కిందటే చెప్పినా.. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. చార్జిషీట్లో శివాజీ పేరు లేకుండాచేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుపడిన టీడీపీకి ధర్మపోరాట దీక్ష చేసే హక్కులేదని ఎద్దేవా చేశారు. తిత్లీ సహాయక చర్యలను ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. చంద్రబాబులో ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనే తలంపే కనబడుతోందని ఆరోపించారు. -
ఆ ముగ్గురు ఎక్కడ?
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో సంచలనం రేపిన రాష్ట్రంలోని మూడు ప్రధాన ఘటనల్లో కీలక పాత్రధారులైన ముగ్గురు కొద్ది రోజులుగా కన్పించకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీంతో ‘ఆపరేషన్ గరుడ’ అంటూ భవిష్య వాణి వినిపించిన సినీనటుడు శివాజీ, ఐటీ దాడులపాలైన సీఎం రమేష్, సీబీఐ హిట్ లిస్ట్‌లో ఉన్న సాన సతీష్‌ల కదలికలపై నిఘా మొదలైంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరుగుతుందని ముందే చెప్పిన శివాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తే గరుడ పురాణం వెనుక అసలు విషయాలు వెలుగు చూస్తాయనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఒక మీడియా ఛానల్‌కు అమెరికా నుంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నిర్వహిస్తున్న ఆపరేషన్ గరుడలో కుట్రదారుడైన నటుడు శివాజీని అరెస్టు చేసి, విచారించాలంటూ విజయవాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, పి.గౌతంరెడ్డి తదితరులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇతర నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం సమాచారాన్ని శివాజీకి ముందస్తుగా ఎవరు అందించారో బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా నుంచి కడపకు.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై కడప, హైదరాబాద్‌లలో ఇటీవల పెద్ద ఎత్తున ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన కన్పించకపోవడంతో రాష్ట్రంలో ఆసక్తికర చర్చసాతున్న తరుణంలో ఆదివారం రాత్రి ఆయన కడపకు చేరుకున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకే సీఎం రమేష్ వచ్చారని చెబుతున్నారు. కాగా, సీబీఐ హిట్‌లిస్ట్‌లో ఉన్న సాన సతీశ్ ఎక్కడ ఉన్నారనేదానిపై చర్చ జరుగుతోంది. కాకినాడలోని సతీశ్ గెస్ట్‌హౌస్, ఆయన అనుచరుల ఇళ్లలో సీబీఐ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. దీంతో సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సతీష్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. -
హత్యా రాజకీయాలకు బాబు ట్రేడ్‌మార్కు
సాక్షి, హైదరాబాద్: హత్యా రాజకీయాలకు సీఎం చంద్రబాబు ట్రేడ్‌మార్క్ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. తన కుమారుడు నారా లోకేశ్ భవిష్యత్ కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అంత మొందించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. ఆపరేషన్ గరుడ కూడా చంద్రబాబు పథకమేనని దుయ్యబట్టారు. లక్ష్మీపార్వతి సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెన్నుపోట్లు, హత్యా రాజకీయాలు, అవినీతి, అన్యాయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను ప్రత్యక్షంగా ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదన్నారు. ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఆయన్ని మానసిక క్షోభకు గురి చేశాడని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పుకుని బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ బతికే ఉండి ఉంటే చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చూసి ఆత్మహత్య చేసుకునేవారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబువన్నీ దగుల్బాజీ రాజకీయాలని.. వంగవీటి రంగా, దశరథరామ్‌తో పాటు అనేక మంది హత్యలతో చంద్రబాబుకు సంబంధాలున్నట్లు అప్పట్లో పత్రికలు కూడా చెప్పాయన్నారు. ప్లాన్ బెడిసి కొట్టిందనే ఢిల్లీ వెళ్లావా?: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీకి చెందిన అనేక మంది నేతలను హత్య చేశారని.. చివరకు ఆయన చెంతకు చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి కూడా హతమయ్యారంటే రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌కు లభిస్తున్న జనాదరణను చూసి భరించలేక ఆపరేషన్ గరుడ అంటూ స్కెచ్ వేసి మట్టు బెట్టాలనుకున్నారని దుయ్యబట్టారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబేనన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అన్ని సర్వేలూ స్పష్టంగా చెబుతుండటంతో.. చంద్రబాబు ఈ ఆపరేషన్ గరుడను తెరపైకి తెచ్చాడని మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంటలోపే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రకటన చేసిన డీజీపీ అసలు ఆ పదవికి అర్హుడేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందని ఢిల్లీకి వెళ్లావా? లేక రక్షణ కోసం వెళ్లావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. -
ఆ ‘గరుడపక్షి’ని ఆడించేదెవరు?
‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్రయత్నంపైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్రబాబు ప్రకటించడం దాని వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరో అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, అతని ఆ మిత్రుడు సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే. ఏదేశ చరిత్ర చూసినా సమస్తమూ నరజాతి చరిత్రగా పైకి కనిపించినా పరస్పర పీడనా దోసిళ్లతోనే, అధికార దాహంతో ప్రతి పక్షాన్ని చంపుకోవడంతోనే నిండిఉందని ఒక్క శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’లో కాదు, పురాణ సాహిత్యం పేర్కొన్న క్రీస్తుపూర్వపు మగధ రాజ్య చరిత్రలో ఒక ఆసక్తికర ఘట్టం కూడా తిరుగులేని సాక్ష్యం పలుకుతోంది. బహుశా ఆ చరిత్ర మరొకసారి పునరావృత్తమవుతోందని ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో సాగు తున్న భ్రష్టుపట్టిన టీడీపీ పాలన నిరూపిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 75 ఏళ్ల నాడే ఎందుకన్నాడో గానీ మన దేశంలో కొన్ని రాజకీయ పక్షాలకు దేశంలో అసంఖ్యాకులైన దళిత, మహాజనులు, మైనారిటీల జీవితాలే బహు చులకనగా కనిపిస్తోందన్నారు. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరని వ్యంగ్యంగా మాట్లాడుతూ దళితుల్ని తూలనాడారు. అందుకు దళిత సంఘాలన్నీ ఆయన్ని దుమ్మెత్తిపోయవలసిన పరిస్థితి వచ్చిందనీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈమాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చరిత్ర ఎలా పునరావృత్తమవుతుందో మరోసారి చెప్పడానికే. క్రీస్తుపూర్వం మగధ సామ్రాజ్యానికి నంది వర్ధనుడు, ఆ తర్వాత మహానందనుడు అనే చక్రవర్తులు ఇద్దరు రాజులుగా ఉండేవారు. కానీ ఈ ఇరువురు శూద్రులు కావడం వల్ల శూద్రులైన నంద వంశం పొడగిట్టని మౌర్య చక్రవర్తులకు కొమ్ముకాసిన కుటిల నీతిపరుడు, మౌర్యుల పురోహితుడైన చాణక్యుడికి కన్నెర్రగా ఉండి శూద్రజాతికి చెందిన నందవశం నిర్మూలనే కంకణం కట్టుకున్నాడు. సరుకులేని అభినవ చాణక్యుడిగా చంద్రబాబు కూడా ఒక దళితుడినే వినియోగించి తన కుట్రలకు ఆసరాగా పావుచెక్కలా వాడుకుంటున్నాడని లోకం కోడై కూస్తోంది. శతాబ్దాలనాటి చాణక్యనీతికి, ఈనాటి అపర చాణక్యుని నీతికి మధ్య తేడా కన్నా సామీప్యతే ఎక్కువని బోధపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక పెద్ద ప్రతిపక్ష నాయకుడిగా అనుపమానమైన ప్రజాదరణ మధ్య ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా దూసుకువెళుతూ ఆ వేల కిలోమీటర్ల యాత్ర ఇక కొద్ది రోజుల్లోనే విజయవంతంగా ముగుస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జీవనాడిగా, రాష్ట్ర భవిష్యత్ దీపశిఖగా ఉన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన (లేదా జరిపించిన) హత్యాప్రయత్నం, ‘అభిమాని’ ముసుగులో విశాఖ విమానాశ్రయంలో చొప్పించిన ఆధునిక ‘జుడాస్’ చర్య! ఈ అమానుష రాజకీయ కుట్ర బహిర్గతం కాకుండా పోలీస్ యంత్రాంగం ఒక స్థాయిలో జరిపి, సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాత్రం జగన్‌పై జరిగింది హత్యాప్రయత్నమేనని, ఆయన్ని అంతం చేయడానికే కత్తితో ఆయనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. కానీ ఆ రిమాండ్ రిపోర్టులో రాజకీయ కుట్రదారులెవరో మాత్రం ఎలాంటి వివరణ లేకపోవడం, ‘‘కొత్తదాసరికి పంగనామాలెక్కువ’’ అన్నట్లుగా టీడీపీకి అనుకూలంగా పొత్తుల కోసం ‘డూడూబసవన్నలు’గా మారిన కాంగ్రెస్ సహా ‘ఐక్య సంఘటన’ దుస్తులు ధరించిన కొన్ని ప్రతిపక్షాల నాయకులు సహా, మినహాయింపులు లేకుండా ఈ ఘాతుకాన్ని, కుట్రను ఖండించారు. ఆ నాయకులు జగన్‌ని పరామర్శించారు. ఒకనాడు అలిపిరి సలపరానికి గురైన చంద్రన్నను ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శించి, త్వరలో కోలుకోవాలని కోరుకున్నారు కూడా. కానీ నేడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు కానీ, బాధ్య తగల ‘దేశం’ నాయకులు కానీ ఏకైక పెద్ద ప్రతి పక్షంగా ఉన్న పార్టీ నాయకుడు జగన్‌ని కనీసం పరామర్శించే సంస్కారాన్ని కూడా పాటించలేకపోయారు. పైగా జగన్‌ని వాడు ఇంటికి పోయాడుగా అని కనీస వాక్శుద్ధి కూడా లేకుండా ముఖ్యమంత్రి వెటకరించడం హేయం. పోలీసుల రిమాండ్ రిపోర్టులో.. ఇది జగన్‌ని అంతమొందించడానికే జరిగిన హత్యాప్రయత్నమేనని స్పష్టం చేస్తున్నా, ఆ ప్రయ త్నాన్ని ఓ ‘చిన్నగాయం’గా కావాలని ‘చీరుకున్న’ గాయం గానూ, తలచుకుంటే టీడీపీ కార్యకర్తలూ, టీడీపీ వ్యక్తులూ జగన్‌ను కైమా, కైమా చేసేవాళ్లని’ మరికొందరు ‘దేశం’ నాయకులు, మంత్రులూ అమానుషంగా ప్రకటనలు చేయడం దుస్సహం. పైగా ‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్ర యత్నం పైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్ర బాబు ప్రకటించడం హత్యాప్రయత్నం వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరన్నదే అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే. అలిపిరి దుర్ఘటనను ఊహించి, ముందు హెచ్చరిక చేయలేని ఆ ‘గండ భేరుండ పక్షి’ శివాజీకి ఆ శక్తిని కల్పించింది, నీడ నిచ్చిందీ ఎవరో తేలాలి. అసలా ‘పక్షి’ కనపడ్డేం? కొన్ని మాసాలనాడే ‘బాబు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అదే సమయంలో జగన్‌పై హత్యాప్రయత్నం జరుగుతుందన్న ఆ శివాజీ మరోవైపున ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి, ‘ఐటీ’ దాడులకు, హత్యలకు తెరలేపనున్నారని వీడియోల్లో కనపడి అకస్మాత్తుగా తప్పుకుపోయిన ఆ ‘అపర శివాజీ’ బాబు చేయి, బీజేపీ నేతల చేతులకు దొరక్కుండా ఎక్కడికిపోయి తలదాచుకు న్నాడు?! ‘ఆపరేషన్ గరుడ’ పదాన్ని శివాజీ ఆశీస్సులతోనే టీడీపీ మీడియా గుంపు ప్రచారంలో పెట్టిందా? పదే పదే చంద్రన్న వర్ణిస్తూ వల్లిస్తున్న శివాజీ ‘గరుడ’ రూపంలో ‘గండిపేట’ కార్యాలయంలో తలదాచుకుంటున్నాడా, జూబ్లీహిల్స్‌లోని నేలమాళిగలోనా? హాస్యనటుడిగా ఉన్నట్టుండి రహస్య జీవితంలోకి జారుకున్న ఆ గరుడపక్షిని పట్టుకోవడం మాల్యా, చౌక్సీ, నీరద్మోదీల ఉనికికి మించినంత కష్టమా? తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్టీఆర్‌ను క్రమంగా పాలకునిగా తప్పించి, ఆ స్థానాన్ని ఆక్రమిం చేందుకు అల్లుడి హోదాలోనే, పార్టీ కార్యదర్శి రూపంలోనే సాగించిన నాటకాలను తెలుగు ప్రజలు కళ్లారా చూశారు. అందులో తొలి నాటకం మల్లెల బాజ్జీ ద్వారా పూర్తి చేయగా, మలి నాటకంలో ‘ఎన్కౌంటర్’ పత్రిక సంపాదకుడు దశరథరామ్ హత్యతో ముగిసింది. ఆ తరువాత చిన్నవీ, పెద్దవీ రకరకాల అంకాలుగా ముగిశాయి, కొత్త అంకాలకు తెర లేపడానికి ముందు సీఎంగా ఎన్టీఆర్‌పై ‘దేశం’లోని తన తైనాతీలను బాబు ఉసిగొల్పి ఎన్టీఆర్పైన చెప్పులు వేయించాడు. ఫలితంగా ‘దేశం’ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనస్తాపంతో తనువు చాలించాల్సి వచ్చింది. తన ‘వెన్నుపోటు’ చరిత్రను అనుక్షణం గమనిస్తున్న దేశ ప్రతిపక్షాలు నేడు ఆంధ్రప్రదేశ్‌లో తన చేష్టల వల్ల, ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న ‘ఉల్టా పల్టా’ రాజ కీయాలవల్ల తన పట్ల ఆమోదం చూపవని బాబుకి తెలుసు. తాజాగా, జగన్‌పై జరిగిన హత్యా ప్రయత్నంతో ఆ ‘అపవాదు; తన పార్టీకి రాకుండా చేసుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర తలపెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తాజా పరిణామాల దృష్ట్యా ప్రతి పక్షాల నాయకులు బాబుతో శాలువాలు కప్పించుకోవడం మినహా, తనను మించిన కాంగ్రెస్‌తోనే బాబు చేతులు కలిపి ఐక్యసంఘటన ఏర్పాటుకు ప్రయత్నించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మాట నిలకడ లేని బాబుతో చేతులు కలపడం ఏ రోజుకైనా ప్రమాదమేనన్న అనుభవం కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని ఇతర ప్రతిపక్షాలకూ లేకపోలేదు. జాతీయ స్థాయిలో తన ఐక్యసంఘటన ఏర్పాటుయత్నం విఫలం కాక తప్పదని, తన ఇంట్లో కాలుతున్న చేతుల్ని కాపాడుకునేందుకు మాత్రమే బాబు చేసే ప్రయత్నమని జాతీయ ప్రతిపక్షాలకు తెలుసు. ఒకసారి జాతీయ ఐక్యసంఘటన ప్రయత్నాల్నీ, ప్రభుత్వాల్నీ ముంచేసిన బాబును మరోసారి ఆదరిస్తాయనుకోవటం భ్రమ. కాబట్టి, ఈ దుస్థితిలో దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని రక్షించగల్గింది నిలువెల్లా ‘మశూచి’ మచ్చలతో నిండిన తె.దే.పా.ను మినహాయించి బుద్ధి, జ్ఞానంగల ప్రతిపక్షాల (వామపక్షాలు సహా)తో ఐక్యసంఘటన ముందుకు సాగడమే. అందుకు ముందుగా నెరవేర్చుకోదగిన షరతు– మానవ ద్వేషులైన ‘శాడిస్టు’లు నాయక స్థానంలో ఉన్న పార్టీలను, ఆ శాడిస్టు రాజకీయవేత్తలు అంట కాగుతున్న శివాజీ లాంటి అజ్ఞాత గరుడపక్షులనూ వదిలించుకోవడమూ! ఇంతకీ ప్రస్తుతం దేశ విపక్షాలపై ఢిల్లీలో వాలిన బాబుగారి శివాజీ గరుడపక్షి ప్రస్తుత ఉనికి ఎక్కడ? ప్రస్తుతం ఆ గరుడ శివాజీతోనే అమెరికా చేరిందట, అంటే శివాజీ ఒక మాల్యాలా, ఒక నీరద్మోదీలా, ఒక చౌక్సీలా దేశ పాలకుల కళ్లుకప్పి అమెరికాకు ఉడాయించాడు. సీఎం రమేష్ సింగపూర్‌కు వెళ్లినట్టు వెళ్లి ఒమన్‌కు జారుకున్నాడు. విద్యుచ్చక్తి శాఖలో ఓ చిన్న ఉద్యోగి హోదాలో ఉండి కోటికి పడగలెత్తిన సానా సతీష్ (తూర్పుగోదావరి) సీబీఐ కేసులో ఇరుక్కుని అడ్రస్ లేకుండా ఎటో పోయాడు. మరి ఇక చంద్రబాబు ప్రయాణించే మార్గం ఎన్ని తీరాలకో చూడాలి. అధి కారాంతమందు చూడవలె నా అయ్య సౌభా గ్యముల్!! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
శివాజీకి ముందే ఎలా తెలుసు?
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు నాయడు కనుసన్నల్లోనే ఆపరేషన్ గరుడ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డిలు ఆరోపించారు. ఆపరేషన్ గరుడ కుట్రదారుడైన నటుడు శివాజీపై చర్య తీసుకోవాలంటూ వారు సోమవారం నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నటుడు శివాజీ చౌదరిని ఉపయోగించి చంద్రబాబు ఈ కుట్ర కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు. కత్తితో హత్యకు ప్రయత్నించిన శ్రీనివాస్‌తో పాటు చంద్రబాబు, శివాజీ చౌదరిలను విచారించాలని డిమాండ్ చేశారు. శివాజీ చౌదరి గరుడ పురాణం చెప్పడం... శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం.. శివాజీ ముందే చెప్పాడంటూ చంద్రబాబు సమర్ధించడం కుట్ర అనేందుకు నిదర్శనమన్నారు. గరుడ కుట్ర పేరుతో మాట్లాడుతున్న శివాజీ చౌదరిపై తక్షణమే కేసు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శివాజీకి ముందస్తుగా ఈ సమాచారం ఎలా వచ్చిందని, ఈ సమాచారం అందించిన వారు ఎవరో బయట పెట్టాలన్నారు. -
రాష్ట్రంలో గరుడ పురాణం నడుస్తోంది..!
సాక్షి, గుంటూరు /గన్నవరం: దేవాలయాల్లో నడవాల్సిన గరుడ పురాణం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయపార్టీల్లో నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. కాల్‌షీట్‌లులేని కమిడియన్ చెప్పే గరుడ పురాణం కథను చదువుతూ సీఎం చంద్రబాబు రాజకీయం చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గుంటూరులో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగిన మహిళా సాధికారిత– మహిళా సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు ఆయన గన్నవరం విమానాశ్రయంలోనూ మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళల అభిమానంతోనే మోదీ ప్రధాని అయ్యారని, వారి కష్టాలు తీర్చేందుకు స్వచ్ఛభారత్ అభియాన్ పేరుతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఏపీలో మరుగుదొడ్లను లెక్కల్లోనే చూపుతున్నారని ఆరోపించారు. గతంలో పశువుల గడ్డిని తిన్న సీఎంను చూశామని, ఆంధ్రా సీఎం మరుగుదొడ్లలో సైతం దోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. కేంద్రం పేదల కోసం ఇచ్చే నిధుల్లో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకోదని, విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటన సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు తప్పితే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం కాదని రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతుండడంతో వారిని బుజ్జగించేందుకు చంద్రబాబును రంగంలోకి దింపినట్లు ఆరోపించారు. ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేయాలనే ఆలోచనతో పార్టీ పెడితే, చంద్రబాబు మాత్రం మాయావతి వద్దకు వెళ్లి సాగిలపడి కాంగ్రెస్‌కు మద్దతివ్వమని బతిమాలుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ హోషిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు రహత్కర్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మహిళా మోర్చా జాతీయ ఇన్చార్జి పురంధరేశ్వరి పాల్గొన్నారు. -
నిజాలకు పాతరేస్తూ కేంద్రంపై నెపం
సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన లో కుట్ర బట్టబయలు అవుతుండటంతో నెపా న్ని కేంద్రంపైకి నెట్టి తప్పుకునేలా టీడీపీ వ్యూహం పన్నడాన్ని బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, కేంద్రం పరిధిలోనిదని చెబుతూనే.. ఒక్కో ఆధారం బయట పడుతుండటంతో కీలక అంశాలను తెరమరుగు చేసేందుకు ఏపీ ప్రభు త్వం హడావుడిగా విచారణ సాగిస్తుండటాన్ని వారు అనుమానిస్తున్నారు. వైఎస్ జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగాక.. ‘అది కేంద్రం పరిధిలోనిది. దానితో మాకే మి సంబంధం. అక్కడ భద్రత బాధ్యత మాది కాదు’అని ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబే వ్యాఖ్యానించడాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. ఇది ముమ్మాటికీ కుట్రేనని స్పష్టీకరిస్తున్నారు. కేంద్రం పరిధిలో ఉన్న ప్రాంతంలో సంఘటన జరిగితే నిబంధనల ప్రకారం కేంద్రం పరిధిలో ఉండే సంస్థలతో విచారణ జరగాల్సి ఉంటే, మరి ఏపీ ప్రభుత్వమే ఎందుకు హడావుడిగా విచారణ మొదలు పెట్టిందని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టే ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా కుట్రను కేంద్రంపైకి నెట్టేసి, తాము తప్పించుకోవాలని చూస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలు ఈ సంఘటనపై విచారణ మొదలుపెట్టక ముందే ఈ కేసులో కీలక ఆధారాలన్నింటిని పక్కదారి పట్టించాలన్నది రాష్ట్ర పాలక పెద్దల ఆలోచన అంటున్నా రు. ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ పూర్తి వివరాలతో బీజేపీ రాష్ట్ర శాఖ అధిష్టానానికి ఓ నివేదిక పంపింది. విచారణపై ఎన్నో అనుమానాలు.. ఏపీపై కేంద్రం ఏదో కుట్ర చేస్తోందంటూ ఆపరేషన్ గరుడ పేరుతో జరిగిన ఒక ప్రచారాన్ని ఈ సంఘటనకు ముడిపెడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో, ఢిల్లీలో వ్యాఖ్యానించడం చూ స్తుంటే జరిగిన కుట్ర మొత్తాన్ని పక్కదారి పట్టిం చి, తప్పిదాన్ని బీజేపీపై నెట్టేందుకు ఎత్తుగడ వేశారని బీజేపీ అధిష్టానానికి అందజేసిన నివేదికలో రాష్ట్ర నేతలు పేర్కొన్నట్లు తెలిసింది. ముందే తెలిస్తే ఎందుకు నివారించలేదు? ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే ఇలా జరిగిందని, అంతా సినీ నటుడు శివాజీ చెప్పినట్లు జరుగుతోందని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతుండ టాన్ని ప్రధానంగా అనుమానించాల్సి వస్తోం దని వారు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎప్పుడు ఏమి జరిగేది శివాజీకి ఎలా తెలుసు? ఆయనకు తెలిసినప్పుడు దానిని నివారించడానికి ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు? జగన్‌పై దాడి జరుగుతుందనేది శివాజీకి ముందే తెలిసిందంటే కుట్రలో ఆయనకూ భాగస్వామ్యం ఉందని అనుమానించాలి కదా? తదితర ప్రశ్నలు ఏపీ రాష్ట్ర ప్రజానీకం మధ్య చర్చనీయాంశాలుగా మారాయని వారు వివరించినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే రాజకీయంగా కేంద్రంలోని బీజేపీని బదనాం చేయడానికే తప్ప మరోటి కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ ఆ పార్టీ అధిష్టానానికి నివేదించింది. -
సర్కారు పెద్దల కనుసన్నల్లోనే అంతా..
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నాన్ని అన్ని పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండిస్తుండగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌పై అభిమానే దాడి చేశాడంటూ డీజీపీ కనీసం విచారణ కూడా చేయకుండా ముందే ప్రకటించడం, హత్యాయత్నాన్ని ఖండించి నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని ప్రకటించాల్సిన ముఖ్యమంత్రి ఇదంతా నాటకమంటూ మాట్లాడటంలోనే కుట్ర కోణం బట్టబయలవుతోందని పేర్కొంటున్నారు. అనుమానాలను నివృత్తి చేయకుండా అసలు జగన్‌పై హత్యాయత్నమే జరగలేదని, అదంతా నాటకమని, సర్కారును కూల్చేందుకు జరిగిన కుట్ర అని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పట్ల అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లిన జగన్‌ను నేతలు పరామర్శించడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. హత్యాయత్నం వెనుక కుట్ర అంతా సర్కారు పెద్దలదేనని జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోందని ప్రజాస్వామ్యవాదులు విశ్లేషిస్తున్నారు. పలువురు అధికారులు సైతం సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? అంటూ సంధిస్తున్న వాటిల్లో ముఖ్యమైనవి ఇవీ... - అభిమాన నేతపై ఎవరైనా హత్యాయత్నం చేస్తారా? పోనీ సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ చెబుతున్నట్లుగా జగన్‌పై సానుభూతి పెంచేందుకే నిందితుడు శ్రీనివాస్ హత్యాయత్నం చేస్తే ఆ విషయాలు రాసిన లేఖను జేబులో ఎందుకు పెట్టుకుంటారు? సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు కనీసం ఈ లాజిక్ కూడా తెలియదా? - నిందితుడు శ్రీనివాస్ నిజంగానే జగన్ అభిమాని అయితే అతడికి టీడీపీ నేత హర్షవర్దన్ చౌదరి ఎయిర్‌పోర్టులో నిర్వహించే హోటల్లో ఉద్యోగం ఎందుకు ఇస్తారు? కేసులు నమోదైన శ్రీనివాస్‌కు టీడీపీ నేతలు పోలీసులతో ఎన్ఓసీ ఇప్పించి మరీ ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో ఉద్యోగం ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటి? నిందితుడికి ఉద్యోగం ఇచ్చిన టీడీపీ నాయకుడు హర్షవర్దన్ చౌదరిని ఎందుకు అరెస్టు చేయలేదు..? - హత్యాయత్నాన్ని ఖండించడాన్ని కూడా తప్పుబట్టిన సీఎం దేశంలో చంద్రబాబు మినహా ఎవరైనా ఉన్నారా? - 2003 అక్టోబరు 1న అలిపిరిలో నక్సలైట్ల దాడిలో చంద్రబాబు గాయపడినట్లు తెలియగానే దీనికి నిరసనగా అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతిలో ధర్నా చేసింది వాస్తవమా? కాదా? ఇలాంటి మానవీయత, హుందాతనం సీఎం చంద్రబాబు ఎందుకు ప్రదర్శించలేదు? - గాయపడిన వ్యక్తిని కించపరచడం టీడీపీవారి నైజమా? - ప్రభుత్వం జారీ చేసే జీవోలు అన్నింటినీ గవర్నర్ పేరుమీదే ఇవ్వడం వాస్తవం కాదా? మా డీజీపీతో మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఎలా ప్రశ్నిస్తారు? కలెక్టర్ల ముందు గవర్నర్ వ్యవస్థను అవమానించేలా మాట్లాడటం తప్పు కాదా? ఇది వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కాదా? - ఆలయాలపై దాడులు జరుపుతారని సీఎం ఎలా చెబుతారు (విజిలెన్స్ చెప్పకపోయినా) చంద్రబాబుకు ఏమైనా భవిష్యత్‌ను చెప్పే అతీంద్రియ శక్తి ఉందా? ఉంటే అలిపిరిలో తనపై జరిగే దాడి గురించి ఎందుకు తెలుసుకోలేదు? - నిందితుడు శ్రీనివాస్ తొమ్మిది సిమ్‌కార్డులు మార్చినందున అందుకోసం వినియోగించిన ఐడీఫ్రూఫ్లు, కాల్ డేటా వివరాలను తక్షణమే సర్కారు బయట పెట్టగలదా? - హత్యాయత్నం జరగ్గానే నిందితుడు శ్రీనివాస్ దళితుడు, జగన్ అభిమాని అని చెప్పిన డీజీపీ నిందితుడికి ఉద్యోగం ఇచ్చిన క్యాంటీన్ యజమాని కులాన్ని ఎందుకు చెప్పలేదు? - గతంలోనే ఓ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌కు ఎన్వోసీ ఇప్పించిందెవరు? ఇలాంటి అసాంఘిక శక్తికి ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో టీడీపీ నాయకుడు ఉద్యోగం వెనుక ఉన్న కుట్రను డీజీపీ ఎందుకు ప్రస్తావించలేదు? - విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించక ముందే జగన్‌పై సానుభూతి పెంచడానికే శ్రీనివాస్ దాడి చేశారని డీజీపీ ప్రకటిస్తే ఇక ‘సిట్’ దీనికి భిన్నంగా రిపోర్టు ఎలా ఇవ్వగలదు? ముఖ్యమంత్రి, డీజీపీ చెప్పిన దానికి భిన్నంగా వారి కింద పనిచేసే అధికారులు నివేదిక ఇస్తారని నమ్మే అమాయకులు ఎవరు? - ‘ఆపరేషన్ గరుడ’లో శివాజీ చెప్పినట్లుగానే జరుగుతోందని సీఎం అంటున్నప్పుడు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోరు? - ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు వైద్యం కోసం వెళితే తప్పేమిటి? వేరే రాష్ట్రానికి వెళ్లారని జగన్‌ను తప్పుబట్టిన సీఎం ఆయన భార్య, కోడలు, మనవడిని మాత్రం హైదరాబాద్‌లో ఉంచి ప్రభుత్వ సొమ్ముతో భద్రత ఎందుకు కల్పిస్తున్నారు? - పరిటాల రవి హత్య సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ, చంద్రబాబు డిమాండ్ చేయలేదా? దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కేంద్రానికి లేఖ రాయలేదా? ఇలా చేయడానికి చంద్రబాబుకు భయమెందుకు? హత్నాయత్నం వెనుక పాత్ర బయటపడుతుందని భయమా? - తుని రైలు దగ్ధం ఘటనకు సంబంధించి ఇది రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాల పని అని ఆరోపణలు చేసిన సర్కారు పెద్దలు గోదావరి జిల్లాల కాపులనే ఎందుకు అరెస్టు చేయించారు? -
‘గరుడ’ ముసుగులో భారీ కుట్ర
సాక్షి, అమరావతి: ‘ఆపరేషన్ గరుడ’ ముసుగులో సీఎం చంద్రబాబు పథకం ప్రకారం భారీ కుట్ర పన్నారా? తిరుగులేని ప్రజాదరణతో బలీయమైన శక్తిగా అవతరించిన వైఎస్సార్సీపీకి చెక్ పెట్టడంతోపాటు తన పాలనలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడం, వైఫల్యాలను కేంద్రంపై నెట్టేయడం, ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోకముందే గరుడ పురాణాన్ని రచించి సినీనటుడు శివాజీతో ప్రచారం చేయించడమే లక్ష్యంగా పావులు కదిపారా? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అంతమొందించి దాన్ని కేంద్రంపై మోపాలనుకున్నారా? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి కేంద్ర బలగాల పహారాలో ఉండే విమానాశ్రయాన్ని ఎంచుకోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోందని చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో జట్టు కట్టినా కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేకపోయారు. సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి రాజధాని భూములు, నిర్మాణ పనుల వరకూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి లక్షలాది కోట్ల రూపాయాలను దోపిడీ చేయడంలో టీడీపీపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల వ్యత్యాసంతో వైఎస్సార్ సీపీ అధికారానికి దూరమైనా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అక్రమాలను ఎండగడుతూనే.. మరో వైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. గతేడాది నవంబర్ 6 నంంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర అశేష జనాదరణ మధ్య అప్రతిహతంగా సాగుతోంది. అత్యంత ప్రజాదరణతో తిరుగులేని రాజకీయ శక్తిగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు: రాష్ట్రంలో తన పాలనపై ప్రజా వ్యతిరేకత నానాటికీ బలపడుతుండటంతో నలభైయేళ్ల రాజకీయ అనుభవంతో భారీ కుట్రకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడం, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేయడం, వైఎస్సార్ సీపీకి చెక్ పెట్టాలనే లక్ష్యంతో గరుడపురాణం రచనకు పూనుకున్నారు. ఈ ఏడాది మార్చి 16 నాటికి గరుడ పురాణం రచనను పూర్తి చేసిన సీఎం చంద్రబాబు.. అదే రోజున ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆ తరువాత రెండు రోజులకే కేంద్ర మంత్రివర్గం నుంచి తన పార్టీకి చెందిన మంత్రులతో రాజీనామా చేయించారు. ఆ తర్వాత మార్చి 22న తాను రచించిన గరుడ పురాణాన్ని సినీ నటుడు శివాజీ ద్వారా.. ఎల్లో మీడియా సహకారంతో విస్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యత్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావు, వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేసినప్పుడు సినీ నటుడు శివాజీ ఆపరేషన్ గరుడలో చెప్పినట్లుగానే తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై క్షక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. ఈ దాడులు చేయిస్తోందని సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రకటనలు చేశారు. సీఎం చంద్రబాబు బినామీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేసినప్పుడు గరుడ పురాణాన్నే వల్లె వేశారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పతాక స్థాయికి చేరిన ఆపరేషన్ ఆపరేషన్ గరుడలో భాగంగా ప్రతిపక్ష నేతపై ప్రాణాపాయం లేని రీతిలో దాడి చేసేందుకు హైదరాబాద్, గుంటూరుల్లో రెక్కీ నిర్వహించారని.. ఆ నెపాన్ని రాయలసీమకు చెందిన ఒక ముఖ్యనేత కుటుంబంపై వేసి.. బిహార్, ఒడిశాలకు చెందిన మనుషులతో అల్లర్లు సష్టించి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిపరుస్తారని సినీ నటుడు శివాజీతో అప్పట్లో చెప్పించారు. కానీ.. అమలులో వ్యూహం కాస్త మార్చారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు చెప్పారు. ప్రతిపక్ష నేతను అంతమొందించి.. ఆ నెపాన్ని కేంద్రం నెట్టేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని ఎత్తు వేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్త అయిన శ్రీనివాసరావుకు ప్రొఫెషనల్ కిల్లర్లతో తర్ఫీదు ఇప్పించి.. విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ కీలక హర్షవర్దన్‌ప్రసాద్ చౌదరికి చెందిన రెస్టారెంట్లో చెఫ్ పేరుతో చేర్పించారని చెబుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ఠ నిఘా, భారీ భద్రత ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా అత్యంత పదునైన కత్తులను రెస్టారెంట్లోకి చేరవేసి.. శ్రీనివాసరావుకు అందించారని పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ విశాఖపట్నం విమానాశ్రయం ద్వారా హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నానికి పలు మార్లు రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కాగా రూపొందించిన పథకం మేరకు గురువారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అంతమొందించడానికి ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ప్రతిపక్ష నేత ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. కేసును నీరుగార్చే కుట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం హత్యాయత్నం నుంచి తప్పించుకోవడంతో కలెక్టర్ల సదస్సు నుంచి బయటకు వచ్చిన సీఎం చంద్రబాబు పలు మార్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో మంతనాలు జరిపారు. ఈలోగా ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్పను బయటకు పంపి.. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును గంటలో తేల్చుతామని ప్రకటించారు. ఆ తర్వాత డీజీపీ ఆర్పీ ఠాకూర్ మీడియాతో మాట్లాడూతూ ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై దాడి చేశారు. చిన్న సంఘటన ఇది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. పదో పదకొండో పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నాం’ అంటూ విచారణ చేయకుండానే తీర్పును ఇచ్చేశారు. ఈలోగా ఒక్కో మంత్రి బయటకు వచ్చి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కార్యకర్తనేనని.. వైఎస్ జగన్‌తో నిందితుడు వేసిన ఫ్లెక్సీ ఇదేనంటూ ప్రదర్శించారు. కానీ.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు వేయించే ఫ్లెక్సీల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ విజయమ్మ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ల ఫోటోలు ఉంటాయి. కానీ.. మంత్రులు ప్రదర్శించిన ఫ్లెక్సీలో ఎక్కడా వైఎస్సార్ ఫొటో లేదు. ఫైగా గరుడ బొమ్మ ఉండటం గమనార్హం. కానీ.. ఆ మరుసటి రోజు పోలీసులు శ్రీనివాసరావుకు చెందిన వ్యవసాయ పొలం నుంచి తవ్వి తీసిన ఫ్లెక్సీకి.. మంత్రులు ప్రదర్శించిన ఫ్లెక్సీకి ఏమాత్రం పొంతన లేకపోవడాన్ని బట్టి చూస్తే కేసును నీరుగార్చడానికి పథకం ప్రకారమే ఈ డ్రామా ఆడారన్నది స్పష్టమవుతోంది. ఇక నిందితుడు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలో ముగ్గురి చేతిరాతలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యవహారం మొత్తం తమ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు, మంత్రులు హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని పరామర్శించాల్సిందిపోయి.. తాము ప్లాన్ చేస్తే కత్తులు గుచ్చమని, ఏకంగా ఖైమా (ముక్కలు ముక్కలుగా నరికేయడం) చేస్తామని ప్రకటిస్తుండటంపై తీవ్ర విమర్శులు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ గరుడను తాను రూపొందించకపోతే.. తన ప్రభుత్వాన్ని అస్థిపరిచే ఈ కుట్రపై అప్పట్లోనే చంద్రబాబు ఎందుకు విచారణకు ఆదేశించలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రశ్నించడం గమనార్హం. -
బయటపడ్డ బాబు గరుడ బండారం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయా? ఈ ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీలు స్పందించిన తీరు ఇప్పటికే దర్యాప్తును తీవ్ర ప్రభావితం చేసే విధంగా ఉండగా, ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి మొత్తం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ వెళ్లి అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు ఆసాంతం అలాగే కొనసాగింది. జగన్‌పై విమానాశ్రయంలో దాడి జరిగితే మమ్మల్నెందుకు నిందిస్తారంటూ కేసును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో కేంద్రం విఫలమైతే మాపై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. (ఢిల్లీలో చంద్రబాబు హైడ్రామా) శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు, ఎవరు అడక్కుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన గురించి చంద్రబాబు మూడుసార్లు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తన బాధ్యతను విస్మరించి కేసు విచారణ, దర్యాప్తును తీవ్ర ప్రభావితం చేసే విధంగా మరోసారి తన సహజ ధోరణిని బయటపెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనను మీడియా సమావేశంలో ఆయనే ప్రస్తావిస్తూ దాడికి వాడింది చిన్న కత్తి అని అంటూ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను చంద్రబాబు తేలికగా చెప్పారు. అలాగే జగన్‌కు అయింది చిన్న గాయమేనన్నారు. ‘వాడింది చిన్న కత్తి... అయింది చిన్న గాయం... జరిగింది విమానాశ్రయం... విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది... దీనిపై నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ’ ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత జగన్ ఎందుకు హైదరాబాద్ వెళ్లిపోయారు? హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారని చెప్పారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర డీజీపీకి గవర్నర్ ఫోన్ చేసి విషయాలను అడగటమేమిటని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. పైగా గవర్నర్ ఢిల్లీకి వచ్చి కేంద్రానికి నివేదిక అందిస్తారా? దీనిపై బీజేపీ నేతలు మాపై విమర్శలు చేస్తారా? అంటూ మొత్తం హత్యాయత్నం ఘటనను వక్రీకరించే ప్రయత్నం చేశారు. జనవరి ఒకటిన ఫ్లెక్సీ వేశారా? హత్యయత్నానికి పాల్పడిన యువకుడు జగన్ అభిమానే అని చెప్పడానికి చంద్రబాబు ఈ సందర్భంగా మరోసారి ప్రయత్నం చేశారు. దాడి చేసిన వ్యక్తి జగన్ పక్కపక్కనే ఉన్నట్టు ఒక ఫ్లెక్సీ సృష్టించి అసలు దోషులకు పట్టుకోకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్న ముఖ్యమంత్రి ఫ్లెక్సీలో లేని విషయాన్ని ఈరోజు ఢిల్లీలో వెల్లడించడం గమనార్హం. ఆ ఫ్లెక్సీ జనవరి ఒకటవ తేదీన వేశారని చంద్రబాబు చెప్పారు. జనవరి ఒకటిన వేశారన్న విషయం ఆయన ఒక్కరికే ఎలా తెలిసిందో చెప్పలేదు. జనవరి ఒకటని ఆ ఫ్లెక్సీమీద ఎక్కడా లేకపోగా, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆ మాట చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. గరుడ విషయాన్ని శివాజీ చెబుతాడా? వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడిన చంద్రబాబు మరో ముందడుగు వేసి ఆపరేషన్ గరుడలో చెప్పినట్టే జరుగుతోందని అన్నారు. అయితే ఆపరేషన్ గరుడ అంశంపై విచారణ జరిపించకపోవడంపై సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆపరేషన్ గరుడ గురించి తొలిసారి శివాజీ ప్రకటించినప్పుడు దానిపై విచారణ జరిపించాలని అన్ని పక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబే ఆపరేషన్ గరుడ అంశాన్ని ప్రస్తావించారు. సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రకారమే జరుగుతున్నాయని, ఏపీలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి తద్వారా జోక్యం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ అంశాన్ని ఒక విలేకరి లేవనెత్తుతూ, అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఆ విషయంపై దర్యాప్తు జరిపించలేదని ప్రశ్నించారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం విస్మయపరుస్తోంది. "మీకు ఏదైనా సమాచారం తెలిసినప్పుడు అడిగితే సోర్స్ చెప్పనంటావ్ కదా... !" అంటూ ఆపరేషన్ గరుడ విషయంలో శివాజీని విచారణ జరపాల్సిన అవసరం లేదన్నట్టు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆ వెంటనే నాలుక కరుచుకుని లీగల్‌గా చేయాల్సింది చేస్తామంటూ దాటవేశారు. -
రివర్సైన ఆపరేషన్ గరుడ