శివాజీ వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరు? | AP BC community national president Uday Kiran comments On Operation Garuda | Sakshi
Sakshi News home page

శివాజీ వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరు?

Published Tue, Oct 30 2018 6:05 PM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

AP BC community national president Uday Kiran comments On Operation Garuda - Sakshi

నాంపల్లి: ఆపరేషన్‌ గరుడ పేరుతో సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో అలజడులకు కారణమవుతున్నాయని ఏపీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు డేరంగుల ఉదయ్‌ కిరణ్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీ హీరో శివాజీ ఓ టీవీ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను బట్టి అతడి వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆపరేషన్‌ గరుడలో శివాజీ వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి పేరును బహిర్గతం చేయాలన్నారు. విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. శివాజీ దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement