నిజాలకు పాతరేస్తూ కేంద్రంపై నెపం | Report of state BJP leaders to the Central Govt | Sakshi
Sakshi News home page

నిజాలకు పాతరేస్తూ కేంద్రంపై నెపం

Published Mon, Oct 29 2018 2:22 AM | Last Updated on Mon, Oct 29 2018 2:23 AM

Report of state BJP leaders to the Central Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన లో కుట్ర బట్టబయలు అవుతుండటంతో నెపా న్ని కేంద్రంపైకి నెట్టి తప్పుకునేలా టీడీపీ వ్యూహం పన్నడాన్ని బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, కేంద్రం పరిధిలోనిదని చెబుతూనే.. ఒక్కో ఆధారం బయట పడుతుండటంతో కీలక అంశాలను తెరమరుగు చేసేందుకు ఏపీ ప్రభు త్వం హడావుడిగా విచారణ సాగిస్తుండటాన్ని వారు అనుమానిస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగాక.. ‘అది కేంద్రం పరిధిలోనిది. దానితో మాకే మి సంబంధం. అక్కడ భద్రత బాధ్యత మాది కాదు’అని ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబే వ్యాఖ్యానించడాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు తప్పు పడుతున్నారు.

ఇది ముమ్మాటికీ కుట్రేనని స్పష్టీకరిస్తున్నారు. కేంద్రం పరిధిలో ఉన్న ప్రాంతంలో సంఘటన జరిగితే నిబంధనల ప్రకారం కేంద్రం పరిధిలో ఉండే సంస్థలతో విచారణ జరగాల్సి ఉంటే, మరి ఏపీ ప్రభుత్వమే ఎందుకు హడావుడిగా విచారణ మొదలు పెట్టిందని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టే ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా కుట్రను కేంద్రంపైకి నెట్టేసి, తాము తప్పించుకోవాలని చూస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలు ఈ సంఘటనపై విచారణ మొదలుపెట్టక ముందే ఈ కేసులో కీలక ఆధారాలన్నింటిని పక్కదారి పట్టించాలన్నది రాష్ట్ర పాలక పెద్దల ఆలోచన అంటున్నా రు. ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ పూర్తి వివరాలతో బీజేపీ రాష్ట్ర శాఖ అధిష్టానానికి ఓ నివేదిక పంపింది.  

విచారణపై ఎన్నో అనుమానాలు.. 
ఏపీపై కేంద్రం ఏదో కుట్ర చేస్తోందంటూ ఆపరేషన్‌ గరుడ పేరుతో జరిగిన ఒక ప్రచారాన్ని ఈ సంఘటనకు ముడిపెడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో, ఢిల్లీలో వ్యాఖ్యానించడం చూ స్తుంటే జరిగిన కుట్ర మొత్తాన్ని పక్కదారి పట్టిం చి, తప్పిదాన్ని బీజేపీపై నెట్టేందుకు ఎత్తుగడ వేశారని బీజేపీ అధిష్టానానికి అందజేసిన నివేదికలో రాష్ట్ర నేతలు పేర్కొన్నట్లు తెలిసింది. 

ముందే తెలిస్తే ఎందుకు నివారించలేదు? 
‘ఆపరేషన్‌ గరుడ’లో భాగంగానే ఇలా జరిగిందని, అంతా సినీ నటుడు శివాజీ చెప్పినట్లు జరుగుతోందని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతుండ టాన్ని ప్రధానంగా అనుమానించాల్సి వస్తోం దని వారు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎప్పుడు ఏమి జరిగేది శివాజీకి ఎలా తెలుసు? ఆయనకు తెలిసినప్పుడు దానిని నివారించడానికి ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు? జగన్‌పై దాడి జరుగుతుందనేది శివాజీకి ముందే తెలిసిందంటే కుట్రలో ఆయనకూ భాగస్వామ్యం ఉందని అనుమానించాలి కదా? తదితర ప్రశ్నలు ఏపీ రాష్ట్ర ప్రజానీకం మధ్య చర్చనీయాంశాలుగా మారాయని వారు వివరించినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే రాజకీయంగా కేంద్రంలోని బీజేపీని బదనాం చేయడానికే తప్ప మరోటి కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ ఆ పార్టీ అధిష్టానానికి నివేదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement