సాక్షి, కాకినాడ: 2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే.. కోడి కత్తి కేసు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎగతాళి చేశాయని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఎప్పుడైనా కోడి కత్తి చూశారా? అని ప్రశ్నించారు. ఎంత పదునుగా ఉంటుందో ఓసారి టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. ఈ మధ్య కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది చూసుకోండి అని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.
'వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఛార్జిషీటు పేర్కొంది. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఈనాడు కథనంలో దీనిపై తీర్పు కూడా ఇచ్చేశారు. తీర్పులు ఇవ్వడానికి మీరెవరూ? మీకు ఏం హక్కుఉంది. నిందితుని వాంగూల్మంతో తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈనాడు అచ్చేస్తుంది. ఎన్ఐఎ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయమని కోరితే మీకు ఇబ్బంది ఏంటి?
మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ సంఘటనను చులకనగా తీసిపడేస్తే చంద్రబాబును కాపాడొచ్చు అని మీ దుర్బుద్ధి కాదా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు బాధ్యత లేదా? నిందితుడి కత్తి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్ధితి ఏంటి?' అని కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’
Comments
Please login to add a commentAdd a comment