
నాదౌన్: బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌటైంది. సాయికృష్ణ (74; 9 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా... చివర్లో మనీశ్ (47 బంతుల్లో 32; 6 ఫోర్లు) కొన్ని పరుగులు చేశాడు. హిమాచల్ బౌలర్లు పంకజ్ జైస్వాల్ (5/50), అర్పిత్ (2/43), రిషి ధావన్ (2/47) ధాటికి ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఎదురు నిలువలేకపోయారు. ఓపెనర్ ప్రశాంత్ (0), జ్ఞానేశ్వర్ (19) రికీ భుయ్ (10) భరత్ (1), కెప్టెన్ సుమంత్ (9), గిరినాథ్ రెడ్డి (2), షోయబ్ ఖాన్ (5) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం హిమాచల్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. ప్రశాంత్ చోప్రా (32 బ్యాటింగ్), ప్రవీణ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment