హీరో నారా రోహిత్ పేరు చెప్పి ... | sai krishna arrested in vijayawada police | Sakshi
Sakshi News home page

హీరో నారా రోహిత్ పేరు చెప్పి ...

Published Thu, Feb 11 2016 4:40 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

హీరో నారా రోహిత్ పేరు చెప్పి ... - Sakshi

హీరో నారా రోహిత్ పేరు చెప్పి ...

విజయవాడ : సినీ నటుడు నారా రోహిత్ పేరు చెప్పి తన స్నేహితులను మోసగించిన తాడికొండ సాయికృష్ణను భవానీపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చూశారు. పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సీఐ ఐ.గోపాలకృష్ణ కేసు వివరాలు వెల్లడించారు.

గొల్లపూడికి చెందిన తాడికొండ సాయికృష్ణ తాను సినిమా రంగంలో నిర్మాతలకు పెట్టుబడులు పెడుతుంటానని, నటుడు నారా రోహిత్‌తో సినిమా తీస్తున్నానని చెప్పి అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు  వెలగపూడి పవన్‌కుమార్, నీరుకొండ శ్రీని వాసరావు, దిలీప్‌లను నమ్మించాడని తెలి పారు.

రెండేళ్ల క్రితం  శ్రీనివాసరావు, దిలీప్ దగ్గర రూ.15 లక్షల చొప్పున, పవన్‌కుమార్ వద్ద రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చదువుకునే రోజుల్లో వీరి స్నేహితురాలైన ఉషశ్రీ(ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తుంది)కి స్టేజి షోలు ఇప్పిస్తానని చెప్పి ఆమె దగ్గర రూ.10 లక్షలు తీసుకున్నాడని తెలిపారు.


తర్వాత చాలా రోజులు స్నేహితులకు కనిపించకుండా తిరుగుతుండటం తో వారికి అనుమానం వచ్చి హైదరాబాద్ వెళ్లి విచారించగా సాయికృష్ణ చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవని తేలిం దన్నారు. సాయికృష్ణను బాకీ తీర్చమని బాధితులు గట్టిగా నిలదీయటంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం, శ్రీనివాస్‌పై దాడి చేసి కొట్టడంతో వారు తమకు ఫిర్యాదు చేశారని సీఐ వివరించారు. అరెస్ట్ చేశామని, మరి కొంతమంది బాధితులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్.ఐ రామకృష్ణుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement