bhavanipuram police
-
వినోద్ జైన్‌కు రిమాండ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలోని విద్యాధరపురానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక బలవన్మరణానికి కారకుడైన కామాంధుడు వినోద్ జైన్ (48)ను భవానీపురం పోలీసులు ఆరెస్టుచేసి, మంగళవారం సాయంత్రం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సునీల్‌కుమార్ ముందు హాజరుపరిచారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరా దృశ్యాలను సీజ్‌చేసి కోర్టుకు సమర్పించారు. తొలుత.. ఐపీసీలోని 306, 354(ఏ), (డి) 509, 506 పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం.. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 354, 354డి, 509, 506 ఐపీసీ సెక్షన్లను చేర్చారు. దీంతో మేజిస్ట్రేట్ నిందితుడికి ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం వినోద్‌ను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికకు ఏమైనా మెసేజ్‌లు పంపించేవాడాç? వీడియోలు ఏమైనా తీశాడా? బాలిక ఆత్మహత్య లేఖ కాకుండా గతంలో ఇంకా ఎక్కడైనా రాసుకుందా, తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను కూడా పోలీసులు విచారించారు. బాలిక బయటకు వెళ్లే సమయాల్లో వినోద్ జైన్ అక్కడే ఉండేవాడని అతను చెప్పాడు. రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలివే.. ► బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి వినోద్ జైన్ కారకుడయ్యాడు. ► బాలిక ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆత్మహత్యకు కారకుడయ్యాడు. ► బాలిక నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని జీ–43లో నిందితుడు ఉండేవాడు. ► జనవరి 29వ తేదీ సా.5.15 గంటలకు అపార్ట్మెంట్ పైనుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలలుగా వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో ఆమె స్పష్టంగా రాసింది. ► దీంతోపాటు ఆమె సెల్‌ఫోన్, ట్యాబ్‌లో ఆ వేధింపులను పొందుపరిచింది. ► లిఫ్ట్, మెట్ల వద్ద వెంటపడేవాడు. బాలిక తమ్ముడు విఘ్నేష్ (10)ను స్కూల్ ఆటో వద్దకు తీసుకెళ్లేటప్పుడు, సరుకుల కోసం షాపునకు వెళ్లేటప్పుడు, వాకింగ్‌కు వెళ్లేటప్పుడు వినోద్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ► ఈ బాధలను భరించలేక ఆమె అపార్టుమెంట్ పైనుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. బాలిక సూసైడ్ నోట్‌తోపాటు, సెల్‌ఫోన్, ట్యా బ్‌ను పోలీసులు సీజ్‌చేశారు. 12 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. -
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని విజయవాడ భవానీపురం పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పశ్చిమ ఏసీపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బరుసుపాడు మండలం ఎర్రబాలెంకు చెందిన బట్టు వెంకట సుబ్బారావు (33) కుటుంబం జీవనోపాధి నిమిత్తం విజయవాడలో స్థిరపడింది. తండ్రి ఆంజనేయులు ముఠా పనిచేస్తుండగా సుబ్బారావు ప్రస్తుతం ప్రైవేట్‌గా లా చేస్తున్నాడు. సుబ్బారావుకి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ‘పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్’ అనే నకిలీ ఐడీ కార్డ్ తయారు చేసి ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా నాలుగు సిమ్‌లు తీసుకుని.. ట్రూకాలర్ యాప్‌లో బీవీఎస్ రావు, సీఎంవో ఆఫీస్, బీవీఎస్ రావు సీఎం ఆఫీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం, పీఎస్ టు కలెక్టర్ పేర్లతో నమోదు చేశాడు. ఆయా ఫోన్ నంబర్లతో మండల స్థాయి అధికారులతో మాట్లాడి ప్రజలకు కావాల్సిన పనులు చేయించి.. వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. అలాగే జర్నలిస్ట్ సంఘాలు, ఉన్నతాధికారులు ప్రచురించిన డైరీల్లోని ఫోన్ నంబర్లకు కూడా ఐయామ్ పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం అనే సందేశాలను పంపి వారితో పనులు చేయించుకుని డబ్బు గడించేవాడు. 20 రోజుల నుంచి చాలామంది సుబ్బారావుకు ఫోన్ చేసి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కావాలని, డబ్బు ఎంతైనా ఇస్తామని చెప్పడంతో జిల్లాలో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు, డ్రగ్ కంట్రోలర్స్‌కు ఫోన్‌చేసి ఇంజక్షన్లు కావాలని చెప్పాడు. ఇలా అందిన ఇంజక్షన్లను కోవిడ్ పేషెంట్లకు అధిక ధరలకు అమ్మి లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇంజక్షన్ కావాలని ఫోన్‌చేసి అతడిని వలపన్ని పట్టుకున్నారు. అతడి వద్ద నాలుగు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, రూ.70వేల నగదు, మోటార్ సైకిల్, మూడు సెల్ఫోన్లు, నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ముజ్రాపార్టీ కేసులో హైకోర్టులో పోలీసుల కౌంటర్
సాక్షి, విజయవాడ : ఇటీవల విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్లో ముజ్రా పార్టీ పేరిట మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుత్నునాయి. ఈ నేపథ్యంలో ముజ్రా పార్టీ కేసులో అసలు నిందితులను పోలీసులు వదిలేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు దర్యాప్తును వేరే దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ మహమ్మద్ ఖాసీం బాషా పిటిషన్ వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్, వెస్ట్ జోన్ ఏసీపీ, భవానీపురం సీఐలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో భవానీపురం సీఐ మోహన్ రెడ్డి బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. అందరిని అరెస్ట్ చేశామని, ఎవరిని తప్పించలేదని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నగరంలోని భవానీపురంలో ఉన్న ఆలీవ్ ట్రీ హోటల్‌పై గత బుధవారం (జూలై 19న) అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. ఐదుగురు మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో హోటల్లో ఈ పార్టీ జరిగినట్టు కథనాలు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి హోటల్లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం. ఈ ఘటనలో పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, 15 మందిని భవానీపురం పీఎస్‌కు, 10 మందిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు, మరో పదిమందిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు. ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబ సభ్యుడు కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడని, అయితే, పోలీసుల రైడ్ నుంచి అతన్ని తప్పించారని తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై నగరంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ముజ్రా పార్టీకి సంబంధించి 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా అప్పట్లో తెలిపారు. హోటల్ నిర్వాహకులపైనా కేసు పెట్టామని చెప్పారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని తెలిపారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
హీరో నారా రోహిత్ పేరు చెప్పి ...
విజయవాడ : సినీ నటుడు నారా రోహిత్ పేరు చెప్పి తన స్నేహితులను మోసగించిన తాడికొండ సాయికృష్ణను భవానీపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చూశారు. పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సీఐ ఐ.గోపాలకృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. గొల్లపూడికి చెందిన తాడికొండ సాయికృష్ణ తాను సినిమా రంగంలో నిర్మాతలకు పెట్టుబడులు పెడుతుంటానని, నటుడు నారా రోహిత్‌తో సినిమా తీస్తున్నానని చెప్పి అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు వెలగపూడి పవన్‌కుమార్, నీరుకొండ శ్రీని వాసరావు, దిలీప్‌లను నమ్మించాడని తెలి పారు. రెండేళ్ల క్రితం శ్రీనివాసరావు, దిలీప్ దగ్గర రూ.15 లక్షల చొప్పున, పవన్‌కుమార్ వద్ద రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చదువుకునే రోజుల్లో వీరి స్నేహితురాలైన ఉషశ్రీ(ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తుంది)కి స్టేజి షోలు ఇప్పిస్తానని చెప్పి ఆమె దగ్గర రూ.10 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. తర్వాత చాలా రోజులు స్నేహితులకు కనిపించకుండా తిరుగుతుండటం తో వారికి అనుమానం వచ్చి హైదరాబాద్ వెళ్లి విచారించగా సాయికృష్ణ చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవని తేలిం దన్నారు. సాయికృష్ణను బాకీ తీర్చమని బాధితులు గట్టిగా నిలదీయటంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం, శ్రీనివాస్‌పై దాడి చేసి కొట్టడంతో వారు తమకు ఫిర్యాదు చేశారని సీఐ వివరించారు. అరెస్ట్ చేశామని, మరి కొంతమంది బాధితులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్.ఐ రామకృష్ణుడు పాల్గొన్నారు.