
దొంగలుగా మారిన బీటెక్, ఇంటర్ విద్యార్థులు
కరీంనగర్ క్రైం : జల్సాలకు అలవాటుపడ్డ యువకులు దారితప్పి.. దోపిడీదారులుగా మారారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్‌ను చేజేతులా కాలరాసుకున్నారు. క్షణపాటి సరదాల కోసం బంగారు భవిష్యత్‌ను చీకటిమయం చేసుకున్నారు. నలుగురు ముఠాగా చేరి దారిదోపిడీలకు పాల్పడ్డాడు. ఫలితంగా కటకటాల పాలయ్యారు. వివరాలు సీఐ నరేందర్ బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తెలిపారు. నగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన సర్ధార్ కులదీప్‌సింగ్(20), ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కేంద్రానికి చెందిన ముత్యం సాయికృష్ణ(19), కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన ఎండీ ఫిరోజ్(19), రామడుగు ఎక్స్‌రోడ్డుకు చెందిన శనిగరపు రంజిత్(19) ముఠాగా ఏర్పడ్డారు.
కులదీప్‌సింగ్ వెల్డింగ్ పనులు చేస్తుండగా, సాయికృష్ణ బీటెక్ మూడో సంవత్సరం, ఫిరోజ్ పాలిటెక్నిక్, రంజి త్ ఇంటర్ పూర్తి చేశారు. వీరు ముఠాగా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడుతున్నా రు. ఈనెల 4న రాత్రి పది గంటలకు చొ ప్పదండి నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లా రీని అటకాయించి డ్రైవర్‌ను బెదిరించి రూ.8 వేలు లాక్కున్నారు. బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కులదీప్‌సింగ్‌పై నిఘా పెట్టారు. బుధవారం ఇంటికి చేరుకున్న కులదీప్‌సింగ్‌తోపాటు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని వి చారించగా అసలు విషయం చెప్పారు. వారి నుంచి బైక్, రూ.2వేల నగదు స్వా ధీనం చేసుకున్నారు. ఎండీ ఫిరోజ్, రం జిత్ పరారీలో ఉన్నారు. గతంలో కుల దీప్‌సింగ్, ఫిరోజ్, రంజిత్‌పై రెండు కే సులు నమోదయ్యాయి. రిమాండ్‌కు సైతం వెళ్లొచ్చారు. వీరిని పట్టుకు నేందుకు రెండు బృందాలుగా పోలీసు లు గాలించారు. సమావేశంలో రూరల్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.