అన్నీ పంచేసుకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ డబ్బులు తీసుకుని పెద్దాస్పత్రి పారిశుద్ధ్యం కాంట్రాక్ట్‌ను వేరొకరికి అప్పగిం చారు. జేఎల్‌ఎం, విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. అంగన్‌వాడీ సరుకుల కాంట్రాక్ట్ విషయంలోనూ అదే చేశారు. ఏదొచ్చినా పంచేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు వర్కులిచ్చి, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు.’ అంటూ తోటి టీడీపీ నేతల తీరుపై ఆరోపణలు గుప్పిస్తూ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వద్ద విజయనగరం పట్టణం 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు దుమ్మెత్తిపోశారు.
అంతటితో ఆగకుండా అశోక్ బంగ్లాలో తిష్ఠవేసిన ఓ రాజు కాంట్రాక్టర్‌గా అప్పటి షాడో నేత, ఇతర కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై కోట్లాది రూపాయ ల వర్కులు చేశారని, అడ్డగోలుగా బిల్లులు చేసుకున్నారని, ఇప్పుడు కూడా అదే దందాను సాగిస్తున్నారని, దారికి రాని ఇంజినీరింగ్ అధికారులను బదిలీ చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని కూడా అశోక్ వద్ద గట్టిగా విన్పించారు. ఇలాంటి వాటిని అరికట్టి, పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని అశోక్‌కు విన్నవించారు.దీంతో అశోక్ అవాక్కయ్యారు. సోమవారం ఉదయం బంగ్లాలో పట్టణంలోని కౌన్సిల ర్లతో అశోక్ గజపతిరాజు సమావేశమయ్యారు. ఈ సం దర్భంగా కౌన్సిలర్లు తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, వీధి లైట్లు వెలగడం లేదని తదితర సమస్యలను ఆయ న దృష్టికి తీసుకొచ్చారు.
ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు విడుదల చేయించాలని, పార్టీ కౌన్సిలర్లకు వర్కులొచ్చేలా నిధులు విడుదల చేయించాలని కోరారు. ఈ సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు మధ్యలో జోక్యం చేసుకుని మన పార్టీ నేతల తీరు బాగోలేదని, వారి తీరు దారుణమని ఏకిపారేశారు. ఇప్పుడు వాటి కోసం మాట్లాడొద్దని చెప్పినా ఆగకుం డా నేతల తీరును దుయ్యబట్టారు. అలాగే కార్యకర్తలు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టాలని, గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వా టిని రద్దుచేసి ఆపార్టీ కార్యకర్తలకు ఇప్పించుకున్నారని, ఇప్పుడలాగే పలు కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను రద్దుచేసి టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని కోరారు.
అంతేకాకుండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అశోక్ మాట్లాడుతూ అంతా నిబంధనల మేరకు జరుగుతుం దని, మార్గదర్శకాలుంటాయని తన సహజ ధోరణిలో భూమిగుండ్రంగా తిరుగుతుందంటూ చెబుతుండగా రామారావు ఆవేదనకులోనై సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటికొచ్చేశారు. అంతటితో ఆ గకుండా లోపల సమావేశం జరగుతుండగానే బయట పెద్ద పెద్ద కేకలు వేసి నేతలను తీరును ఆక్షేపించారు. ఇలాగైతే సామా న్య కార్యకర్తలకు న్యాయం జరగదని, పదవులొచ్చాయ ని నాయకుల ఆనందంతో కష్టపడిన కార్యకర్తలను ప ట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తాని కి జరుగుతున్న భాగోతాలను వివరిస్తూ టీడీపీనేతలపై తోటి పార్టీ నేత, కౌన్సి లర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. ఆయనంతే అని కొందరు తేలికగా తీసుకున్నా, మరి కొందరు అవన్నీ ఆలోచించాల్సిన అంశాలే అంటూ గుసగుసలాడుకోవడం కన్పించింది.