ఉచితం కాదు.. అనుచితం
Published Thu, Dec 26 2013 3:00 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
దొమ్మేరు (కొవ్వూరు రూరల్), న్యూస్‌లైన్ :ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రూ.5 వేలు కట్టించుకుని ఓ రైతుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మం జూరు చేశారు. ఆ కనెక్షన్‌పై వ్యవసాయూనికి వినియోగించే విద్యుత్‌ను జీవితకాలం ఉచి తంగా ఇస్తామన్నారు. ఆ తరువాత ఆయన భార్య పేరిట మరో విద్యుత్ కనెక్షన్ మంజూ రైంది. యూనిట్‌కు 50 పైసలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన విద్యుత్‌కు వేలల్లో బిల్లు పంపిస్తున్నారు. రైతు భార్య పేరిట ఉన్న సర్వీసుపై యూనిట్‌కు 50 పైసలకు బదులు రూ.3.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘మీరు ఆదాయ పన్ను పరిధిలో ఉన్నారు’ అంటున్నారు. పథకాల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, వాటిని అమలు చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సామాన్యులకు ఇలాంటి ఇబ్బందులు తప్పటం లేదు. వివరాల్లోకి వెళితే... కొవ్వూరు మండలం దొమ్మేరులో నివాసముంటున్న ముదునూరి హనుమంతరాజు, అన్నపూర్ణ దంపతులు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వారు. అన్నపూర్ణకు 92సెంట్ల పంటభూమి ఉండగా, 2649 సర్వీస్ నంబర్‌తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు.
హనుమంతరాజుకు ధర్మవరం పరిధిలో 97 సెంట్ల భూమి ఉండటంతో 318 సర్వీస్ నంబర్‌తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. అన్నపూర్ణ పేరుతో ఉన్న సర్వీస్‌కు యూనిట్‌కు రూ.3.50 వరకు బిల్లు వసూలు చేస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ పొందే సమయంలో యూనిట్‌కు 50 పైసలు వరకు బిల్లు పడుతుందని చెప్పారు. ఇంత ఎక్కువగా ఎందుకు బిల్లు వస్తోందని విద్యు త్ అధికారులను ప్రశ్నిస్తే మీరు ఇన్‌కం టాక్స్ పరిధిలో ఉన్నారని చెప్పడంతో భార్యాభర్తలు అవాక్కయ్యారు. బిల్లు తగ్గాలంటే ఇన్‌కంటాక్స్ కార్యాలయం నుంచి పన్ను చెల్లించడం లేదంటూ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరారు. ఇన్‌కం టాక్స్ కార్యాలయానికి వెళితే టాక్స్ చెల్లించకుండా తామెలాంటి పత్రాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తప్పని పరి స్థితుల్లో 2012 జనవరి నుంచి ఆ దంపతులు ఐదు దఫాలుగా విద్యుత్ శాఖకు రూ.26 వేల వరకు చెల్లించారు.
మూడు నెలల క్రితం మరో రూ.4 వేలు చెల్లించాలంటూ అధికారులు బిల్లు పంపారు. ఆ మొత్తం చెల్లించకపోవడంతో మోటారుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈనెల 17న అప్పుచేసి మరీ రూ.3,738 చెల్లించారు. హనుమంతరాజు పేరిట ఉన్న సర్వీసును 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా తీసుకున్నారు. రూ.5 వేలు చెల్లిస్తే జీవిత కాల మంతా విద్యుత్ బిల్లు చెల్లించనవసరం అప్పట్లో చెప్పారని ఆ దంపతులు తెలిపారు. ఇప్పుడు దానికి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆ దంపతులు వాపోతున్నారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన తాము తరచూ వేలాది రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టేదని ఆవేదన చెందుతున్నారు.
Advertisement
Advertisement