చాలామంది తమ జీవితంలో కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రమే 'గుర్తుందా శీతాకాలం". హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
కన్నడ సక్సెస్‌ఫుల్ దర్శకుడు, నటుడైన నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చినబాబు, ఎం.సుబ్బారెడ్దిల సమర్పణలో వేదాక్షర ఫిలింస్ నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబులు నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
► చిన్నప్పుడు చిరంజీవి గారి నెగిటివ్ ఫిల్మ్స్ తీసుకొని తెరమీద వెయ్యడం.. అలాగే ఆ నెగిటివ్ ఫిల్మ్ షర్ట్ కింద పెట్టి ఐరన్ చేస్తే షర్ట్ మీద చిరంజీవి బొమ్మ పడేది.
► సుబ్బారెడ్డితో కలసి ఆడు మగాడ్రా బుజ్జీ కు అసోసియేట్ గా వర్క్ చేశాను. ఆ తరువాత గజకేసరీ, సమంతతో టెన్ వంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలు చేసిన తరువాత ఇప్పుడు "గుర్తుందా శీతాకాలం"’ వంటి స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాను.
► ఈ సినిమాకు భాగస్వామ్యం గా ఉన్న సుబ్బారెడ్డి 120 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశాడు.వారి సలహాలు తీసుకున్నాను. ప్రతి నిర్మాతకు మొదట కొంత ఇబ్బంది అనిపించినా అనుభవంతో అంతా సెట్ అయ్యి అలవాటు అవుతుంది.
► సత్యదేవ్ చాలా మంచి వ్యక్తి. మొదట నుంచి చివర వరకు కూడా నేను సెట్స్‌కు సరిగా వెళ్ళక పోయినా అకౌంట్స్ తో సహా ప్రతి విషయంలో మాకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపించాడు. తమన్నా ప్రొఫెషనల్ యాక్టర్. అంతా కొత్త వారితో చేస్తే మా సినిమా బిజినెస్ కూడా జరగాలి కాబట్టి తనను తీసుకున్నాం.
► డిసెంబర్ 9 న సుమారు 12 సినిమాలు రిలీజ్‌కు ఉన్నా కూడా మా సినిమాను మాత్రం రెండు రాష్ట్రాల్లో 600 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాము.
► కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. తను కన్నడలో చాలా హిట్ సినిమాలు చేశాడు.అయితే ఈ సినిమాకు కూడా చాలా కేర్ తీసుకొని బాగా చేశాడు. తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది.
► ఈ సినిమా చూస్తుంటే నాగార్జున గారి "గీతాంజలి" సినిమాకు దగ్గరగా ఉంటుంది
► నాకు రివాల్యూషనరీ, సామాజిక అంశాల మీద జరిగే షోషల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు, హార్రర్,క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథలు అంటే ఇష్టం.
► కృష్ణ వంశీ గారి రంగ మార్తాండ సినిమాకు ఫైనాన్సియల్ అసోసియేట్ అయ్యాము, సినిమా పూర్తైంది. ఎన్టీఆర్ బావమరిదితో శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చేస్తున్నాము. ఫిబ్రవరి లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాము.ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త కథలు లైనప్ లో ఉన్నాయి అని ముగించారు.
చదవండి: ఆ స్టార్ హీరోని నేను పెళ్లి చేసుకోవడం లేదు: కృతీసనన్
రష్యాలో ల్యాండైన పుష్ప టీమ్
Comments
Please login to add a commentAdd a comment