
పోకూరి రామారావు
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈతరం ఫిలింస్’ పతాకంపై ఎన్నో చిత్రాలకు సమర్పకునిగా వ్యవహరించిన పోకూరి రామారావు (65) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆçస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడు ఆయన. కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో రామారావు హస్పిటల్‌లో చేరారు. పది నెలల క్రితం ఆయనకు గుండె సంబంధిత చికిత్స జరిగిందని తెలిసింది. గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరి’ తదితర చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. రామారావుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment