Senior Tollywood Director Tatineni Ramarao Passed Away Due To Health Issues - Sakshi
Sakshi News home page

Tatineni Rama Rao: దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత

Published Wed, Apr 20 2022 7:43 AM | Last Updated on Wed, Apr 20 2022 10:17 AM

Tollywood Director Tatineni Ramarao Passed Away - Sakshi

చెన్నై: తెలుగు, హిందీ సినిమాల సీనియర్‌ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించాడు. 1966 నుంచి సినీ రంగానికి సేవలందించిన రామారావు దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తొలి సినిమా నవరాత్రి. దర్శకునిగా పనిచేయడానికి ముందు ఆయన తన కజిన్‌ తాతినేని ప్రకాశ్‌రావు వద్ద, కోటయ్య ప్రత్యగత్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement