మూడున్నర నెలల క్రితం ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో అదృశ్యమైన సంతోష్‌కుమారి(20) జాడ ఇంకా తెలియకపోవడంతో తల్లిదండ్రులు కె. రామారావు, చంద్రావతి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మూడున్నర నెలల క్రితం ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో అదృశ్యమైన సంతోష్‌కుమారి(20) జాడ ఇంకా తెలియకపోవడంతో తల్లిదండ్రులు కె. రామారావు, చంద్రావతి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పిపోయిన తమ కూతురిని వెతికిపెట్టాలంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులను మరోమారు ఆశ్రయించారు. ఏప్రిల్ 12వ తేదీన సంతోష్‌కుమారి టైలరింగ్ నేర్చుకోవడానికి సమీపంలోని లేడీస్ టైలర్ శేఖర్ షాప్‌నకు వెళ్లింది. అయితే, రాత్రి 7 దాటినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అయితే తన కూతురిని లేడీస్ టైలర్ శేఖర్ బలవంతంగా తీసుకెళ్లాడని అతడి కుటుంబసభ్యులను విచారిస్తే ఆమె జాడ దొరుకుతుందని తండ్రి రామారావు మంగళవారం ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సంతోష్‌కుమారి కోసం గాలింపు చేపట్టారు.