ఉడా రాజకీయం.. రాజధానికి.. | Uda politics .. Capital .. | Sakshi
Sakshi News home page

ఉడా రాజకీయం.. రాజధానికి..

Published Sun, Feb 2 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

ఉడా రాజకీయం.. రాజధానికి..

ఉడా రాజకీయం.. రాజధానికి..

  • చైర్మన్ ప్రమేయం లేకుండానే వీసీ బదిలీ
  •  రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు
  •  పోస్టింగ్ కోసం హైదరాబాదులో మకాం
  •  రేపు ఉషాకుమారి బాధ్యతల స్వీకరణ!
  •  ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విజయవాడలోనే పోస్టింగ్ కోసం మకాం వేసిన ఐఏఎస్ అధికారిణి ఉషాకుమారి ఉడా వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం వీసీగా ఉన్న రామారావుకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండానే ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో రామారావు శనివారం బదిలీ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లటం చర్చనీయాంశమైంది. మరోవైపు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించటానికి ఉషాకుమారి సిద్ధమయ్యారు.
     
    సాక్షి, విజయవాడ : జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారి గత ఏడాది అక్టోబర్‌లో బదిలీ అయ్యారు. పలు కారణాలతో రిలీవ్ కాకుండా ఈ ఏడాది జనవరి వరకు ఇక్కడే జేసీగా కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధుల్లో చేరాల్సి ఉన్నప్పటికీ అక్కడ చేరకుండా ఉండి విజయవాడలో పోస్టింగ్ కోసం విశ్వప్రయత్నాలు చేసి రాజకీయ సహకారంతో అనుకున్నది సాధించారు. దీంతో అకారణంగా వైస్ చైర్మన్‌పై బదిలీ వేటు పడింది. ఉడా వైస్ చైర్మన్ పోస్టింగ్ కోసం దాదాపు ఆరు నెలలు రామారావు ఎదురుచూశారు.

    చివరకు పోస్టింగ్ వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికల కోసం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు.. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండున్నర నెలలు ఉడా సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు.. అనంతరం ఎన్నికల విధుల నిమిత్తం వీసీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు.. ఇలా నిత్యం ప్రత్యేక విధులే ఆయనకు సరిపోయాయి. చివరకు బదిలీ జరిగిన శుక్రవారం కూడా పామర్రులో ఓటర్ల గుర్తింపు కార్డుల్లో అవకతవకలపై విచారణ కోసం ప్రత్యేక డ్యూటీలో వెళ్లారు.

    ఇలా ఎనిమిది నెలల పదవీకాలంలో ఎక్కువ రోజులు ప్రత్యేక సేవల్లోనే కొనసాగిన ఆయనపై అకస్మాత్తుగా బదిలీ వేటు పడింది. అదీ అకారణంగా కావటం ఉడాలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ప్రభుత్వం వీసీని బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీసీగా రామారావు రిలీవ్ కాకుండా శనివారం హైదరాబాద్ వెళ్లారు. చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఉడా రాజకీయం రాజధానికి చేరినట్లయింది.
     
    రాజధానిలో మకాం...

    వీసీ రామారావు హైదరాబాద్‌లో మకాం వేశారు. కనీసం పోస్టింగ్ కూడా ఎక్కడ కేటాయించకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి పోస్టింగ్ కేటాయించాల్సిదిగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉషాకుమారి శ్రీకాకుళంలో జేసీగా విధుల్లో చేరలేదు.

    దీంతో అక్కడ ఆయన్ని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నూతన విసీగా నియమితులైన ఉషాకుమారి ఈ నెల మూడున బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వాస్తవానికి శనివారమే చార్జ్ తీసుకుంటారని అందరూ భావించినా వీసీ రామారావు రిలీవ్ కాకపోవటంతో సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. మరోపక్క బదిలీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
     
     6- 10 నుంచి  వీరమ్మ తల్లి ఉత్సవాలు
     
    ఉయ్యూరు, న్యూస్‌లైన్ : కోర్కేలు తీర్చే కొంగుబంగారం ఉయ్యూరు శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి ఉత్సావాలు  10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా మాఘశుద్ధ(భీష్మ) ఏకాదశి పర్వదినాన ప్రారంభమై 15రోజులపాటు అంగరంగ వైభవంగా తిరునాల జరుగుతుంది. ఈ ఏడాది భీష్మ ఏకాదశి రోజు సోమవారం రాత్రి 8.30గంటల తరువాత అమ్మవారి తిరునాల ప్రారంభమవుతుంది.

    ఆనవాయితీ ప్రకారం ఉయ్యూరు టౌన్ పోలీసులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, సారే సమర్పిస్తారు. అనంతరం పారపూడి వంశస్తులు పూజా కార్యక్రమాలు పూర్తిచేసి తల్లిని మెట్టినింటి నుంచి బయటకు తీసుకొచ్చి పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారు మెట్టినింటి నుంచి ఊరే గింపుగా బయలుదేరగా, వేలాది మంది భక్తులు అఖండ(ఎదురు గండ) దీపాలతో హారతులిచ్చి స్వాగతం పలికి మొక్కుబడి తీర్చుకుంటారు.

    తిరుగుడు గండ దీపాల భక్తులు వెంటరాగాపట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. 11వ తేదీ సాయంత్రం ప్రధాన సెంటర్లో ఊయల స్తంభాల వద్ద అమ్మవారు ఊరేగి ఆదే రోజు రాత్రి ఆలయ ప్రవేశం చేస్తారు. అక్కడ నుంచి ఆలయంలో భక్తుల పూజలు అందుకుంటారు. ఉత్సవాల్లో 11వ రోజు శిడిబండి ఉత్సవం జరుగుతుంది. ఈ వేడుక ఉత్సావాల్లో ప్రధానమైనది. పెళ్లి కాని ఓ దళిత యువకుడు శిడి బుట్టలో కూర్చుని వేడుక నిర్వహిస్తుండగా భక్తులు ఆ యువకుడు, శిడి బుట్టపై అరటిపండ్లు విసురుతూ భక్తిపారవశ్యం చెందుతారు. ఉత్సవాలకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
     
    రంగుల ఉత్సవానికి తరలిన అమ్మవారు...
     
    ప్రతి రెండేళ్లకోసారి అమ్మవారి రంగుల ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రంగుల ఉత్సవానికి శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి విగ్రహాలకు అనాధిగా మచిలీపట్నంలో రంగులు వేయటం, ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. దీంతో శనివారం వేకువజామున మెట్టినింటిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లారు.

    రంగుల ఉత్సవానికి వెళ్తున్న తల్లికి మార్గమధ్యంలో దారి పొడవున భక్తులు పసుపు నీళ్లు వారపొసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజుపేటకు చెందిన స్వర్ణకారుడు దిలీప్ ఈ ఏడాది సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేయనున్నారు. రంగుల ఆలంకరణ  7వ తేదీ లోగా పూర్తి చేసి 9వ తేదీవరకు బందరులోని పురవీధులో అమ్మవారు ఊరేగింపు పూర్తి చేసుకొని 10వ తేదీ ఉదయానికి మెట్టినింటిలోకి ప్రవేశిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement