Uda
-
Telangana: జిల్లాలన్నీ 'ఉడా'లే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని గ్రామాలు మినహా.. రాష్ట్రమంతా వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ–ఉడా)ల పరిధిలోకి వెళ్లింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉడాలు ఉండగా, తాజాగా వాటి పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతోపాటు.. ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, కొన్ని జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇప్పటివరకు ఉడాలు లేని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కొత్తగా మరో 19 ఉడాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఉడాలు ఏర్పాటైనట్టయ్యింది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆ జిల్లాలోని మండలాల్లో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు చేరాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉడాల పరిధిలోకి రావడం గమనార్హం. ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాలే ఉడాల పరిధిలో.. రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో ఏర్పాటు చేసిన మొత్తం 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఇప్పటివరకు చుట్టుపక్కలున్న గ్రామాలు మాత్రమే ఉండేవి. మిగతా గ్రామాలన్నీ డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోకి వచ్చేవి. దీంతో 800 చదరపు గజాల పైబడి నిర్మాణాలకు, గ్రామాల్లో సాగే లే అవుట్ల అనుమతులన్నీ డీటీసీపీ ద్వారానే తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాల పరిధి మొత్తానికి ఉడాలను విస్తరించడంతో లే అవుట్లతో పాటు 800 చదరపు గజాల నిర్మాణాల అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటైన ఉడాల ద్వారానే పొందే అవకాశం లభించింది. జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్‌కు అవకాశం రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు కూడా సరైన మాస్టర్‌ప్లాన్ లేదు. ఉడాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కొన్ని ప్రయత్నాలు గతంలో జరిగినా వివిధ కారణాల వల్ల కొలిక్కి రాలేదు. ఇప్పుడు జిల్లా పరిధినే యూనిట్‌గా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా మొత్తానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే అవకాశం లభించినట్లయిందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు మండల కేంద్రాల మాస్టర్ ప్లాన్లను కూడా ప్రత్యేకంగా రూపొందించే అవకాశం లభించింది. కేంద్ర నిధులు పెరిగేందుకు దోహదం గ్రామాల్లో సాగే పేదల గృహనిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు కూడా ఉడాల ఏర్పాటు దోహదపడనుంది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పట్టణాలు, కార్పొరేషన్లతో పాటు 10 నుంచి 15 మండలాల్లోని గ్రామాలు వస్తుండడంతో కేంద్రీకృతమైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యధాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యథాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. -
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాగాలు ఎటువైపు ?
నాగాలాండ్‌లో అంతా ఒకటే పక్షం. అదే అధికార పక్షం. ప్రస్తుతం అక్కడ ప్రతిపక్షం ఊసే లేదు. అభివృద్ధే లక్ష్యంగా రెండేళ్ల క్రితం రాజకీయ పక్షాలన్నీ ఏకమై కొత్త సంప్రదాయానికి తెరతీశాయి. అయినా ఈ సారి ఎన్నికల్లో అదే పాత సమస్య నాగాల శాంతి చర్చలే ప్రధాన అంశంగా మారింది. నాగాలాండ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఈ ఏడాది శాంతి ఒప్పందం చుట్టూనే తిరుగుతున్నాయి. నాగాల చిరకాల డిమాండ్లు నెరవేర్చకపోవడంతో అధికార నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)–బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలుస్తున్నాయి. 2018 ఎన్నికలకు ముందు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) చిరకాల మితృత్వాన్ని వదులుకున్న బీజేపీ ఎన్డీపీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీపీపీకి చెందిన నిఫూయి రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో అధికార బీజేపీ నాగాలు ఆశిస్తున్నట్టుగా ప్రత్యేక జెండా, రాజ్యాంగం ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో వారంతా కాషాయ కూటమికి వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి వేర్పాటు వాదుల హింసాకాండతో రక్తమోడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలన్న లక్ష్యంతో 2021లో రాజకీయ పార్టీలన్నీ చేతులు కలిపి యునైటెడ్ డెమొక్రాటిక్ అలయెన్స్ (యూడీఏ) ఏర్పాటయ్యాయి. అధికారంలో ఉన్న నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ కూటమిలో ప్రతిపక్ష నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) చేరడం రాజకీయంగా కొంత పుంతలకు దారి తీసింది. ఎన్డీపీపీ–బీజేపీ కలసికట్టుగా పోటీ రెండేళ్లుగా అభివృద్ధి ప్రయత్నాలు ముందుకు కదలకపోగా నాగా వేర్పాటు వాద సమస్య తీవ్రతరం కావడంతో ఫిబ్రవరి 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీఎఫ్ ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. గత ఎన్నికల్లో 26 సీట్లలో నెగ్గిన ఎన్పీఎఫ్ ఈ సారి అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అచ్చుబెమొ కికోన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీపీపీ– బీజేపీ కలసి కట్టుగా పోటీ చేయనున్నాయి.మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 40 సీట్లలో ఎన్డీపీపీ, 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఒక్క స్థానం రాకపోయినా ఈ సారి 60 స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. ఎన్నికల తర్వాత ఎన్పీఎఫ్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఒక్క స్థానంలో నెగ్గిన జేడీ(యూ) ఈసారి నాగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. దీంతో బీజేపీ నుంచి జేడీ(యూ)లోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఏమిటీ నాగాల సమస్య నాగాల వివాదం ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి భారత నేలపై రక్త చరిత్ర రాస్తూనే ఉంది. బ్రిటీష్ కాలంలో మొదలైన ఈ సమస్యపై ఇప్పటికీ నాగాలు పోరాటం చేస్తూనే ఉన్నారు. 1881లో నాగా తెగలు నివసించే నాగాహిల్స్ ప్రాంతాన్ని బ్రిటీష్ ఇండియాలో భాగం చేశారు. దీనిని నాగా తెగలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ భవిష్యత్ తామే నిర్ణయించుకుంటామని స్వతంత్ర నాగా దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామంటూ పలు ఉద్యమాలు నడిపాయి. తమకు సొంత జెండా, రాజ్యాంగం కావాలంటూ 1946లోనే నాగా నేషనల్ కౌన్సిల్ (ఎన్ఎన్సీ) ఏర్పాటై వేర్పాటు వాదం దిశగా అడుగులు వేసింది. నాగా ఫెడరల్ ఆర్మీ (ఎన్ఎఫ్ఏ) పేరుతో ఏర్పాటైన తీవ్రవాదులు భారీగా హింసకు పాల్పడేవారు. దీంతో వారిని అణిచివేయడానికి 1958లో నాటి కేంద్ర ప్రభుత్వం సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తెచ్చింది. అప్పట్నుంచి కేంద్రం, నాగాల మధ్య విభేదాలు ముదురుతూనే ఉన్నాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు ఇప్పటికీ నాగాలు గట్టిగా చేస్తున్నారు. నాగాలు నివసించే ప్రాంతాన్ని అంతటినీ కలిపి 1963లో కేంద్రం నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1975లో ఎన్‌ఎన్‌సీలో ఒక వర్గంతో షిల్లాంగ్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సమస్యపై ఎన్‌ఎన్‌సీలో చీలిక వర్గమైన ఎన్ఎస్సీఎన్ (ఐఎం) బలంగా తన వాణి వినిపిస్తోంది. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పాటు మయన్మార్‌లో నాగాలు అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ కలిసి గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటు చేసి సొంత రాజ్యాంగం, జెండా కావాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఎన్ఎస్సీఎన్ (ఐఎం) శాంతి ఒప్పందం కుదుర్చుకొని అప్పటి గవర్నర్ ఆర్.ఎన్.రవిని మధ్యవర్తిగా నియమించింది. అయినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో నాగాల శాంతి చర్చలే ఈ సారి అతి పెద్ద ఎన్నికల అంశంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ►ప్రత్యేక జెండా, రాజ్యాంగం కోరుతూ గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ కోసం దశాబ్దాలైనా నాగా తెగలు గట్టిగా పట్టుపట్టడం ►ఏడు ఆదివాసీ సంస్థలతో కూడిన ఈస్ట్రన్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ) రాష్ట్రంలోని 16 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్టాన్ని డిమాండ్ చేయడం. ఈ డిమాండ్‌తో 2010 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సెగలు పుట్టిస్తోంది. ►500 కి.మీ. పొడవైన సరిహద్దుని పంచుకుంటున్న అసోం, నాగాలాండ్ మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలు. అసోంలో ఉన్న కొంత భూభాగం తమదేనని, రాష్ట్రంలో కలిపేయాలంటూ డిమాండ్లు ఉన్నాయి. ►దాదాపుగా 22 లక్షల జనాభా కలిగిన నాగాలాండ్‌లో 90 వేల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాల కల్పన అతి పెద్ద సవాల్‌గా మారింది. ►నాసిరకం రోడ్లు, మౌలికసదుపాయాల కొరత, విద్య, ఆరోగ్యం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. -
24 జిల్లాలకు కొత్త పట్టణాభివృద్ధి సంస్థలు
పట్టణ జనాభా విస్తృతి మేరకు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలోని 24 జిల్లాల్లో కొత్తగా పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. -
ఉడాలో గ్రీవెన్స్ డే
8 రేపటి నుంచే ప్రారంభం సాక్షి, విజయవాడ : అన్ని ప్రభుత్వ విభాగాల మాదిరి గానే వీజీటీఎం ఉడా కూడా ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కార్యాలయ వేళల్లో రోజూ రెండు గంటలు మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వచ్చే సోమవారం నుంచి గ్రీవెన్స్ డే నిర్వహించాలని అన్ని విభాగాల అధికారులను ఉడా వీసీ ఉషాకుమారి నిర్ణయించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని విభాగాల ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. గ్రీవెన్స్ డేలో నిర్వహించే ప్రతి ఫిర్యాదుకు రశీదు ఇస్తారు. ప్రతి సమస్యను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తారు. -
ఉడాలో కుర్చీలాట సా...గదీతే
రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు నూతన వీసీ చేరికపై వీడని సందిగ్ధత రెండు రోజులు వేచిచూడాలని ఉషాకుమారికి పెద్దల సూచన! కొనసాగుతున్న రామారావు యత్నాలు నేడు లేదా రేపు ఉషాకుమారి చేరే అవకాశం ఉడాలో కుర్చీలాట ఇంకా కొన‘సా...గుతోంది’. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు, నూతనంగా నియమితులైన ఉషాకుమారి తమ పరపతిని ఉపయోగించి ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌గా చివరికి ఎవరు వస్తారనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఉషాకుమారి సోమవారమే బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, రామారావు రిలీవ్ కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి, విజయవాడ : ఉడా వైస్‌చైర్మన్‌గా పి.ఉషాకుమారిని నియమిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వీసీగా ఉన్న రామారావును బదిలీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. ఉషాకుమారి ఈ నెల ఒకటిన బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా వీసీ రామారావు రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. రిలీవ్ కాకుండా విధుల్లో కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారివి... ఇద్దరు ఐఏఎస్ అధికారులూ తమ గాడ్ఫాదర్ల ద్వారా ఎవరికివారు సీటు దక్కించుకోవటానికి ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. వైస్ చైర్మన్ రామారావుకు ఐఏఎస్ అయ్యాక వచ్చిన మొదటి మంచి పోస్టింగ్ కావడం.. అదీ తక్కువ రోజుల్లోనే ఆకస్మికంగా బదిలీ చేయటంతో సీటును కాపాడుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐఏఎస్ వచ్చాక పోస్టింగ్ కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత వచ్చిన ఉడా పోస్టింగ్‌లోనూ పట్టుమని మూడు నెలలు కూడా పనిచేసే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది. తన బదిలీ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేయటంతో పాటు తన గాడ్ఫాదర్ల ద్వారా హైదరాబాద్‌లో లాబీయింగ్ కొనసాగించినట్లు సమాచారం. మరోవైపు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించకపోతే మంగళవారం సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా నుంచి బదిలీ అయిన ఉషాకుమారి తన రాజకీయ పరపతితో చక్రం తిప్పి ఉడా వైస్‌చైర్మన్ సీటును పొందగలిగారు. రామారావు ప్రయత్నాల నేపథ్యంలో ఆమె కూడా పావులు కదిపి పోస్టింగ్‌లో చేరే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వేచిచూడండి... ఈ క్రమంలో పి.ఉషాకుమారి రెండు రోజులు వేచిచూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదివారం మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరలేదు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గత నెల 21న విజయవాడలో జేసీగా రిలీవై 31న ఉడా వైస్ చైర్మన్‌గా మళ్లీ పోస్టింగ్ దక్కించుకున్న క్రమంలో 22 నుంచి 31 వరకు ఆమె దరఖాస్తు చేసుకున్న సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉడా రాజకీయం.. రాజధానికి..
చైర్మన్ ప్రమేయం లేకుండానే వీసీ బదిలీ రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు పోస్టింగ్ కోసం హైదరాబాదులో మకాం రేపు ఉషాకుమారి బాధ్యతల స్వీకరణ! ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విజయవాడలోనే పోస్టింగ్ కోసం మకాం వేసిన ఐఏఎస్ అధికారిణి ఉషాకుమారి ఉడా వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం వీసీగా ఉన్న రామారావుకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండానే ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో రామారావు శనివారం బదిలీ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లటం చర్చనీయాంశమైంది. మరోవైపు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించటానికి ఉషాకుమారి సిద్ధమయ్యారు. సాక్షి, విజయవాడ : జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారి గత ఏడాది అక్టోబర్‌లో బదిలీ అయ్యారు. పలు కారణాలతో రిలీవ్ కాకుండా ఈ ఏడాది జనవరి వరకు ఇక్కడే జేసీగా కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధుల్లో చేరాల్సి ఉన్నప్పటికీ అక్కడ చేరకుండా ఉండి విజయవాడలో పోస్టింగ్ కోసం విశ్వప్రయత్నాలు చేసి రాజకీయ సహకారంతో అనుకున్నది సాధించారు. దీంతో అకారణంగా వైస్ చైర్మన్‌పై బదిలీ వేటు పడింది. ఉడా వైస్ చైర్మన్ పోస్టింగ్ కోసం దాదాపు ఆరు నెలలు రామారావు ఎదురుచూశారు. చివరకు పోస్టింగ్ వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికల కోసం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు.. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండున్నర నెలలు ఉడా సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు.. అనంతరం ఎన్నికల విధుల నిమిత్తం వీసీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు.. ఇలా నిత్యం ప్రత్యేక విధులే ఆయనకు సరిపోయాయి. చివరకు బదిలీ జరిగిన శుక్రవారం కూడా పామర్రులో ఓటర్ల గుర్తింపు కార్డుల్లో అవకతవకలపై విచారణ కోసం ప్రత్యేక డ్యూటీలో వెళ్లారు. ఇలా ఎనిమిది నెలల పదవీకాలంలో ఎక్కువ రోజులు ప్రత్యేక సేవల్లోనే కొనసాగిన ఆయనపై అకస్మాత్తుగా బదిలీ వేటు పడింది. అదీ అకారణంగా కావటం ఉడాలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ప్రభుత్వం వీసీని బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీసీగా రామారావు రిలీవ్ కాకుండా శనివారం హైదరాబాద్ వెళ్లారు. చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఉడా రాజకీయం రాజధానికి చేరినట్లయింది. రాజధానిలో మకాం... వీసీ రామారావు హైదరాబాద్‌లో మకాం వేశారు. కనీసం పోస్టింగ్ కూడా ఎక్కడ కేటాయించకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి పోస్టింగ్ కేటాయించాల్సిదిగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉషాకుమారి శ్రీకాకుళంలో జేసీగా విధుల్లో చేరలేదు. దీంతో అక్కడ ఆయన్ని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నూతన విసీగా నియమితులైన ఉషాకుమారి ఈ నెల మూడున బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వాస్తవానికి శనివారమే చార్జ్ తీసుకుంటారని అందరూ భావించినా వీసీ రామారావు రిలీవ్ కాకపోవటంతో సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. మరోపక్క బదిలీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 6- 10 నుంచి వీరమ్మ తల్లి ఉత్సవాలు ఉయ్యూరు, న్యూస్‌లైన్ : కోర్కేలు తీర్చే కొంగుబంగారం ఉయ్యూరు శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి ఉత్సావాలు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా మాఘశుద్ధ(భీష్మ) ఏకాదశి పర్వదినాన ప్రారంభమై 15రోజులపాటు అంగరంగ వైభవంగా తిరునాల జరుగుతుంది. ఈ ఏడాది భీష్మ ఏకాదశి రోజు సోమవారం రాత్రి 8.30గంటల తరువాత అమ్మవారి తిరునాల ప్రారంభమవుతుంది. ఆనవాయితీ ప్రకారం ఉయ్యూరు టౌన్ పోలీసులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, సారే సమర్పిస్తారు. అనంతరం పారపూడి వంశస్తులు పూజా కార్యక్రమాలు పూర్తిచేసి తల్లిని మెట్టినింటి నుంచి బయటకు తీసుకొచ్చి పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారు మెట్టినింటి నుంచి ఊరే గింపుగా బయలుదేరగా, వేలాది మంది భక్తులు అఖండ(ఎదురు గండ) దీపాలతో హారతులిచ్చి స్వాగతం పలికి మొక్కుబడి తీర్చుకుంటారు. తిరుగుడు గండ దీపాల భక్తులు వెంటరాగాపట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. 11వ తేదీ సాయంత్రం ప్రధాన సెంటర్లో ఊయల స్తంభాల వద్ద అమ్మవారు ఊరేగి ఆదే రోజు రాత్రి ఆలయ ప్రవేశం చేస్తారు. అక్కడ నుంచి ఆలయంలో భక్తుల పూజలు అందుకుంటారు. ఉత్సవాల్లో 11వ రోజు శిడిబండి ఉత్సవం జరుగుతుంది. ఈ వేడుక ఉత్సావాల్లో ప్రధానమైనది. పెళ్లి కాని ఓ దళిత యువకుడు శిడి బుట్టలో కూర్చుని వేడుక నిర్వహిస్తుండగా భక్తులు ఆ యువకుడు, శిడి బుట్టపై అరటిపండ్లు విసురుతూ భక్తిపారవశ్యం చెందుతారు. ఉత్సవాలకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రంగుల ఉత్సవానికి తరలిన అమ్మవారు... ప్రతి రెండేళ్లకోసారి అమ్మవారి రంగుల ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రంగుల ఉత్సవానికి శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి విగ్రహాలకు అనాధిగా మచిలీపట్నంలో రంగులు వేయటం, ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. దీంతో శనివారం వేకువజామున మెట్టినింటిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లారు. రంగుల ఉత్సవానికి వెళ్తున్న తల్లికి మార్గమధ్యంలో దారి పొడవున భక్తులు పసుపు నీళ్లు వారపొసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజుపేటకు చెందిన స్వర్ణకారుడు దిలీప్ ఈ ఏడాది సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేయనున్నారు. రంగుల ఆలంకరణ 7వ తేదీ లోగా పూర్తి చేసి 9వ తేదీవరకు బందరులోని పురవీధులో అమ్మవారు ఊరేగింపు పూర్తి చేసుకొని 10వ తేదీ ఉదయానికి మెట్టినింటిలోకి ప్రవేశిస్తుందని నిర్వాహకులు తెలిపారు.