ఉడాలో గ్రీవెన్స్ డే | Uda Grievance Day | Sakshi
Sakshi News home page

ఉడాలో గ్రీవెన్స్ డే

Published Sun, Jul 20 2014 1:17 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

Uda Grievance Day

  • 8 రేపటి నుంచే ప్రారంభం
  • సాక్షి, విజయవాడ : అన్ని ప్రభుత్వ విభాగాల మాదిరి గానే వీజీటీఎం ఉడా కూడా ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కార్యాలయ వేళల్లో రోజూ రెండు గంటలు మాత్రమే ఫిర్యాదులు  స్వీకరిస్తున్నారు. వచ్చే సోమవారం నుంచి గ్రీవెన్స్ డే నిర్వహించాలని అన్ని విభాగాల అధికారులను ఉడా వీసీ ఉషాకుమారి నిర్ణయించారు.  

    ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని విభాగాల ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. గ్రీవెన్స్ డేలో నిర్వహించే ప్రతి ఫిర్యాదుకు రశీదు ఇస్తారు. ప్రతి సమస్యను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement