- గంగూరు పెట్రోలు బంకు వద్ద ఘటనలో ఇద్దరు..
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- జూపూడి వద్ద ట్రక్ ఆటో ఢీకొని మహిళ..
పెనమలూరు మండలం గంగూరు, ఇబ్రహీపట్నం మండలం జూపూడిలో శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాద ఘటనల్లో ముగ్గురు మరణించారు. గంగూరు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జూపూడి మినీ ట్రక్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యవసాయ కూలీ మృతిచెందింది.
గంగూరు(పెనమలూరు), న్యూస్‌లైన్ : గంగూరు పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాయ్యాయి. పెనమలూరు పోలీసులు తెలి పిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కొందరు వ్యక్తులు గురువారం పొక్లెయిన్‌ను లారీపై లోడ్ చేసి కానూరుకు బ యలుదేరారు. లారీని వడుగు వీర్రాజు నడుపుతుండగా విజయనగరం జిల్లా పాంచాలి గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ ఉద్దంటి సత్యనారాయణ(25), హెల్పర్ రేపల్లి రామారావు(రేపల్లె), సాలాది సూర్య అనే వ్యక్తులు అందులో ఉన్నారు.
లారీ శుక్రవారం వేకువజామున నా లుగు గంటల సమయంలో విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు పెట్రోల్ బంకు వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న కొబ్బరికాయల లోడు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో పొక్లెయిన్ ఆపరేటర్ సత్యనారాయణ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హెల్పర్ రేపల్లె రామారావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వీర్రాజు, సూర్యను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బందరురోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళా కూలీ ఉసురు తీసిన ట్రక్ ఆటో
జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ మహిళా కూలీని గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది. శుక్రవారం సా యంత్రం జూపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణిం చింది. సేకరించిన వివరాల ప్రకారం.. జూపూడి భీమేశ్వర కాలనీకి చెందిన కన్నా వెంకటేశ్వరమ్మ(45) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె భర్త కొంతకాలం కిందట మరణించాడు.
శుక్రవారం సాయంత్రం తన పాడిగేదెకు గడ్డిని తీసుకువస్తూ జాతీయ రహదారి దా టుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న ట్రక్ ఆటో ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పిల్లల ప్రయోజకత్వాన్ని చూడకుండానే..
వెంకటేశ్వరమ్మ పెద్దకుమారుడు ప్రైవేటు ఎలక్ట్రీషియన్. ఈ ప్రాంతంలోని ప్రైవేటు ఇంజి నీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేశ్వరమ్మ తన కాయకష్టంతో చిన్నకుమారుడిని ఇంజినీరింగ్ చదివిస్తోంది. తల్లి మృతదేహం వద్ద కుమారులు రోదిస్తున్న తీరు స్థానికుల కంటతడి పెట్టించింది. పిల్లలు చేతికంది వస్తున్న తరుణంలో వారి ఉన్నతిని చూడకుండానే వెంకటేశ్వరమ్మ అకాల మరణం చెందిందని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేశారు.