Petrol filling station
-
పెట్రోల్ బంకుల్లో ఇంధన దోపిడీ
అటు కల్తీ.. ఇటు కోత - వినియోగదారుడు లూటీ - ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో మోసాలు - ఫిర్యాదు వస్తేనే స్పందిస్తున్న అధికారులు - నామమాత్రంగా తనిఖీలు - అపరాధ రుసుముతో సరి.. పోచమ్మమైదాన్ : పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కల్తీతోపాటు మీటర్ రీడింగ్‌లో జంపింగ్ (కొలతల్లో మోసం)లకు పాల్పడుతూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో 210 వరకు పెట్రోల్ బంకులు ఉన్నారు. చాలావరకు బంకుల్లో ఇంధనం కల్తీ అవుతున్నట్లు ఫిర్యాదులుఅందగా.. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన ఘటనలు కోకొల్లలు. జిల్లాలోని పలు బంకుల్లో పరీక్షలకు అందని స్థారులో కల్తీ జరుగుతున్నట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు బంకుల నిర్వాహకులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కొలతల్లో మోసాలకు పాల్పడుతుండడం వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. హన్మకొండ అదాలత్ సమీపంలోని కీర్తి ఫిల్లింగ్ స్టేషన్లో సోమవారం మోసాల తంతు బట్టయలైన తీరు... జిల్లాలోని బంకుల్లో సాగుతున్న అక్రమ దందాకు నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా ఇంధనం రూపేణా పెట్రోల్, డీజిల్ వినియోగదారుల జేబులకు నిత్యం రూ.లక్షల్లో చిల్లు పడుతోంది. అధికారుల నిర్లక్ష్యంతోనే... వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందితే గానీ.. అధికారులు కదలరనే అపవాదు తూనికలు, కొలతల శాఖపై ఉంది. ఇంధన కల్తీ.. రీడింగ్ జంపింగ్‌కు సంబంధించి తూతూమంత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పంథిని, తొర్రూర్, ఫోర్ట్ రోడ్లలోని పలు బంకుల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిర్వాహకుల మోసాలు బట్టబయలయ్యూరు. ఓ ఫిల్లింగ్ స్టేషన్లో ఐదు లీటర్ల పెట్రోల్‌కు 130 మిల్లీ లీటర్లు, మరో బంక్‌లో ఐదు లీటర్ల పెట్రోల్‌కు 50 మిల్లీ లీటర్ల పెట్రోల్ తక్కువగా వచ్చినట్లు తేలింది. ఈ మేరకు అధికారులు తక్కువగా వచ్చిన ఫిల్లింగ్ పాయింట్ల (యంత్రాలు)ను మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఆయూ బంకుల్లోని మిగతా ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా పెట్రో ఉత్పత్తుల విక్రయూలు కొనసాగుతుండగా... అపరాధ రుసుం చెల్లించడంతో మూతబడినవి కొన్ని రోజుల తర్వాత తెరుచుకోవడం పరిపాటిగా మారింది. దీంతో బంకుల నిర్వాహకుల్లో భయం లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మోసాలు బయటపడితే సదరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేయడమే కాకుండా సంబంధిత వస్తువులను సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలి. కానీ.. తూనికలు, కొలతల శాఖ అధికారులు అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు జిల్లాలో ఎక్కడా లేవు. కొలతల్లో మోసాలు ఇలా... - పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలే ఫిల్లింగ్ యంత్రాలను సరఫరా చేస్తాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ యంత్రాల్లో మార్పు చేర్పులతోపాటు రిమోట్ ద్వారా ఆపరేట్ వెసులుబాటు కల్పించాయి. దీన్ని అసరా చేసుకున్న ఫిల్లింగ్ స్టేషన్ల యజమాన్యాలు యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ రీడింగ్‌లో జంపింగ్‌కు పాల్పడుతున్నాయి. - కొన్ని కంపెనీలకు సంబంధించి ఫిల్లింగ్ యంత్రాలకు రిమోట్ వెసులుబాటు లేదు. అయినా.... పలు బంకుల నిర్వాహకులు పంపింగ్ యం త్రాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ అమర్చి కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు. - భారీ క్యూ ఉండే పెట్రోల్ పంపుల్లో జీ రీడింగ్ చేయకుండానే (డబ్బులు ఫీడ్ కానీ... లీటర్లు అని) పంపింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన కంటే ముందు బైక్ వ్యక్తి ఎంత పెట్రోల్ పోసుకుంటే... అతడి వెనుక వాహనానికి అంత తక్కువగా వస్తుంది. కల్తీ.. ఇలా గుర్తుపట్టొచ్చు.. - ఇంధన పరీక్షకు సంబంధించి ప్రతి పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ ఉండాలి. చతురస్ర ఆకారంలో ఉండే ఫిల్టర్ పేపర్‌పై రెండు చుక్కల పెట్రోల్‌ను పోయూలి. రెండు నిమిషాల తర్వాత అవి నల్లగా మారితే కల్తీ జరిగినట్లే. - పెట్రోల్ పంపుల్లో హైడ్రోమీటర్, థర్మామీటర్ తప్పనిసరిగా ఉండాలని ఆయిల్ కంపెనీ మార్కెటింగ్ గైడ్‌లైన్స్‌లో ఉంది. పెట్రోల్ లేదా డీజిల్‌లో హైడ్రోమీటర్, థర్మామీటర్ పెట్టాలి. హైడ్రోమీటర్ ద్వారా రీడింగ్... థర్మామీటర్ ద్వారా టెంపరేచర్(ఉష్ణోగ్రత)ను చెక్ చేయాలి. గతంలో కంపెనీ వారు పంప్ దగ్గర ఉన్న బుక్‌లో నమోదు చేసిన రీడింగ్‌ను పరిశీలించాలి. ఈ రీడింగ్‌లో 3 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే కల్తీ జరిగినట్లుగా నిర్ధారించవచ్చు. కొలతల్లో ఇలా... - పెట్రోల్ పంప్ వద్ద బీఎస్ఐ గుర్తించిన ఐదు లీటర్ల కొలత పాత్రలు ఉండాలి. కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ఇంధనం వచ్చినట్లు అనుమానం కలిగితే... వెంటనే ఆ పాత్రలో పోసి కొలిచి చూడవచ్చు. - కల్తీ జరిగిందని గానీ... కొలతలో తేడా వచ్చిందని గానీ తేలితే పోలీస్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, తూనికలు, కొలతల శాఖ, సివిల్ సప్లయీస్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. మూడుసార్లు ఇలాంటి ఫిర్యాదులు అంది... పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు తెలితే ఆయూ బంకులను సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంది. 97016 06633కు ఫోన్ చేయండి ఏ బంకుల్లోనైనా కల్తీగానీ.. కొలతల్లో మోసం గానీ జరిగితే ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వండి. వెంటనే అక్కడ వాలుతాం. ఫిర్యాదులు అందిన బంకుల్లో వెంటవెంటనే తనిఖీలు చేస్తున్నాం. మీటర్ రీడింగ్ మోసాలకు పాల్పడిన బంకుల యజమానులపై కేసులు సైతం పెడుతున్నాం. - రామ్‌కుమార్, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కమిషనర్ -
ముంచుకొస్తున్న‘పెట్రో’ ముప్పు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు జిల్లాలోని వివిధ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తున్న స్టోరేజి పాయింట్ల మార్పు కారణంగా జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో ‘నోస్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టోరేజి పాయింట్లను మార్చడం, అక్కడి నుంచి మన జిల్లాకు మరింత దూరం పెరగడంతో పాటు స్టోరేజి పాయింట్ సామర్థ్యం కూడా తక్కువగా ఉండడంతో జిల్లాకు అవసరమైన పెట్రోల్, డీజిల్ సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని రెండు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టగా, మరో రెండు, మూడు రోజుల్లో ఈ సంఖ్య పదుల్లోకి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వారం రోజుల్లో సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. 54 బంకులకు మరింత సమస్య... జిల్లాలో మొత్తం 135 పెట్రోల్ బంకులున్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీ) కంపెనీలకు చెందిన బంకుల ద్వారా రోజుకు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 7.50 లక్షల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. వీటిలో బీపీసీకి చెందిన 27, హెచ్‌పీసీకి చెందిన 54 బంకులకు ఎలాంటి సమస్యా లేకపోయినా, ఐఓసీకి చెందిన 54 బంకుల పరిస్థితి కష్టంగా మారనుంది. ఎందుకంటే ఈ బంకులకు కృష్టా జిల్లా కొండపల్లిలో ఉన్న స్టోరేజి పాయింట్ నుంచి, రాజమండ్రి నుంచి పెట్రోల్ వచ్చేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ పాయింట్‌ను కరీంనగర్ జిల్లా రామగుండానికి మార్చారు. అంటే విశాఖపట్నం రిఫైనరీలో ఉన్న ఆయిల్ కొండపల్లి స్టోరేజి పాయింట్‌కు కాకుండా, రామగుండం వస్తే, అక్కడి నుంచి జిల్లాకు రావాల్సి ఉంది. కొండపల్లి నుంచి వచ్చేటప్పుడు రోజుకో ట్రక్కు ఆయిల్ వచ్చే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రామగుండం నుంచి ఒక ట్రక్కు వచ్చేసరికి మూడు రోజులు పడుతోంది. రామగుండంలో ఉన్న స్టోరేజి పాయింట్ సామర్థ్యం కూడా తక్కువేనని తెలుస్తోంది. రెండు జిల్లాలకు మాత్రమే సరఫరా చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఈ పాయింట్‌కు మరో మూడు జిల్లాలను అదనంగా కలపడంతో ఓవర్‌లోడ్ సమస్య అవుతోంది. ఇక్కడి నుంచి ఆయిల్ తెచ్చే ట్యాంకర్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. ఆంధ్ర ప్రాంతం నుంచి ట్రక్కులను తెచ్చుకుని సరఫరా చేసుకునేందుకు అక్కడి కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదు. దీంతో ఐఓసీ పరిధిలో ఉన్న జిల్లాలోని 54 బంకులకు తగినంత ఆయిల్ సరఫరా కావడం లేదు. దీంతో ఒకే ట్యాంకులో నాలుగైదు బంకులకు పెట్రోల్ పంపుతున్నారు. ఆ పెట్రోల్ తక్కువ సమయంలోనే అయిపోతుండడంతో మళ్లీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఐఓసీకి చెందిన బంకులకు సూర్యాపేటలో స్టోరేజి పాయింట్ ఉన్న హెచ్పీసీ నుంచి ఆయిల్ సరఫరా చేయాలని అడుగుతున్నా, అది కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. గతంలో సూర్యాపేట నుంచి కేవలం 26 హెచ్‌పీ బంకులకు మాత్రమే ఆయిల్ రాగా, మిగిలిన బంకులకు రాజమండ్రి నుంచి వచ్చేది. ఇప్పుడు 54 బంకులకు సూర్యాపేట నుంచే సరఫరా చేయాల్సి రావడంతో సమస్య తలెత్తుతోంది. మరోవైపు కొండపల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆయిల్ తేవాలంటే మన రాష్ట్రం అదనపు పన్ను విధించే అవకాశం ఉండడంతో డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగితే జిల్లాలో పెట్రో తిప్పలు తప్పవని అధికారులు, పెట్రోల్ డీలర్లు అంటున్నారు. బంకుల వారీ వివరాలు సేకరించిన జేసీ... ఈ పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ శుక్రవారం ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో బంకుల వారీగా ఉన్న వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ సమాచారాన్ని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌కు కూలకషంగా వివరిస్తూ నివేదిక పంపారు. ఈ విషయమై జేసీ ‘సాక్షి’తో మాట్లాడుతూ సమస్య ఉన్న మాట వాస్తవమేనని, అయితే, దీని పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. -
బీఎంసీకి ‘బల్క్’ భారం
సాక్షి, ముంబై: బల్క్ ద్వారా ఇంధనం కొనుగోలు గిట్టుబాటు కాకపోవడంతో బీఎంసీ బయట పెట్రోల్ బంకుల నుంచి కొనుగోలు ప్రారంభించింది. బల్క్ పద్ధతిలో ఇంధనం కొనుగోలుపై ఇటీవల ప్రభుత్వంపై లీటరుకు రూ.10 అదనపు భారం మోపింది. దీని ప్రభావం బీఎంసీపై పడింది. ఈ భారాన్ని భరించే స్తోమతలేక బయట పెట్రోల్ బంకుల నుంచి బీఎంసీ డీజిల్ కొనుగోలు చేస్తోంది. బల్క్ ద్వారా ఇంధనం కొనుగోలుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలపై పడింది. దీంతో బస్సులకు అవసరమైన డీజిల్‌ను బయట పెట్రోల్ బంకుల నుంచి ఎమ్మెస్సార్టీసీ కొనుగోలు చేస్తోంది. బీఎంసీ కూడా ఇదే బాట పట్టినట్లు అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని తెలిపారు. బీఎంసీకి వర్లీ, ఎల్ఫిన్స్టన్ రోడ్, ఘాట్కోపర్లో గ్యారేజీలు ఉన్నాయి. బీఎంసీ చేతిలో 1,140 వాహనాలున్నాయి. 280 కార్లు, జీపులు, స్కార్పి యో, చిన్నాచితకా వాహనాలతోపాటు చెత్తను తరలించే ట్రక్కులు ఉన్నాయి. ప్రస్తుతం బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర లీటరుకు రూ.63.83 ఉంది. అదే బల్క్‌లో కొనుగోలు చేస్తే రూ.10 అదనంగా చెల్లించాలి. ఇలా బీఎంసీకి ప్రతీరోజు 17,500 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ప్రస్తు తం ఆరు వేల లీటర్ల డీజిల్‌ను బయట బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల బీఎంసీకి రోజుకు రూ.60 వేలు ఆదా అవుతున్నాయి. త్వరలో మిగతా డీజిల్‌ను కూడా బయటి బంకుల నుంచి కొనుగోలు చేస్తామని అడ్తాని చెప్పారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
గంగూరు పెట్రోలు బంకు వద్ద ఘటనలో ఇద్దరు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు జూపూడి వద్ద ట్రక్ ఆటో ఢీకొని మహిళ.. పెనమలూరు మండలం గంగూరు, ఇబ్రహీపట్నం మండలం జూపూడిలో శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాద ఘటనల్లో ముగ్గురు మరణించారు. గంగూరు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జూపూడి మినీ ట్రక్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యవసాయ కూలీ మృతిచెందింది. గంగూరు(పెనమలూరు), న్యూస్‌లైన్ : గంగూరు పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాయ్యాయి. పెనమలూరు పోలీసులు తెలి పిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కొందరు వ్యక్తులు గురువారం పొక్లెయిన్‌ను లారీపై లోడ్ చేసి కానూరుకు బ యలుదేరారు. లారీని వడుగు వీర్రాజు నడుపుతుండగా విజయనగరం జిల్లా పాంచాలి గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ ఉద్దంటి సత్యనారాయణ(25), హెల్పర్ రేపల్లి రామారావు(రేపల్లె), సాలాది సూర్య అనే వ్యక్తులు అందులో ఉన్నారు. లారీ శుక్రవారం వేకువజామున నా లుగు గంటల సమయంలో విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు పెట్రోల్ బంకు వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న కొబ్బరికాయల లోడు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో పొక్లెయిన్ ఆపరేటర్ సత్యనారాయణ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హెల్పర్ రేపల్లె రామారావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వీర్రాజు, సూర్యను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బందరురోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళా కూలీ ఉసురు తీసిన ట్రక్ ఆటో జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ మహిళా కూలీని గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది. శుక్రవారం సా యంత్రం జూపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణిం చింది. సేకరించిన వివరాల ప్రకారం.. జూపూడి భీమేశ్వర కాలనీకి చెందిన కన్నా వెంకటేశ్వరమ్మ(45) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె భర్త కొంతకాలం కిందట మరణించాడు. శుక్రవారం సాయంత్రం తన పాడిగేదెకు గడ్డిని తీసుకువస్తూ జాతీయ రహదారి దా టుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న ట్రక్ ఆటో ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడకుండానే.. వెంకటేశ్వరమ్మ పెద్దకుమారుడు ప్రైవేటు ఎలక్ట్రీషియన్. ఈ ప్రాంతంలోని ప్రైవేటు ఇంజి నీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేశ్వరమ్మ తన కాయకష్టంతో చిన్నకుమారుడిని ఇంజినీరింగ్ చదివిస్తోంది. తల్లి మృతదేహం వద్ద కుమారులు రోదిస్తున్న తీరు స్థానికుల కంటతడి పెట్టించింది. పిల్లలు చేతికంది వస్తున్న తరుణంలో వారి ఉన్నతిని చూడకుండానే వెంకటేశ్వరమ్మ అకాల మరణం చెందిందని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నిత్యం పెట్రో దోపిడీ రూ.కోటి
‘పంపింగ్ జంపింగ్’తో బంకుల నయా‘వంచన’ ఐదేళ్లుగా పలురకాల ఇం‘ధన’ మోసాలు వాహన చోదకుల జేబులకు భారీగా చిల్లు పట్టని తూ.కొ. సివిల్ సప్లై శాఖలు సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ పరిధిలో పలు బంకులు రోజుకు రూ. 95.88 లక్షల మోసానికి పాల్పడుతూ వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. గత ఐదేళ్ల నుంచి పెట్రోల్ బంకుల రిమోట్ మోసాలు చాప కింద నీరులా సాగుతున్నట్లు బహిర్గతమైంది. సాక్షాత్తు పెట్రోల్ బంకుల డీలర్లే తప్పు మాది కాదు.. ఆయిల్ కంపెనీలదంటూ మోసాలను అంగీకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలే మోసాలకు సహకరించే డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను సరఫరా చేస్తున్నట్లు డీలర్లు స్పష్టంచేయడం నయా‘వంచన’ను తేటతెల్లం చేస్తుంది. రాష్ట్రం మొత్తంమీద పెట్రోల్ వినియోగంలో సగం వాటా గల మహాన గరంలో బంకుల నయామోసాలు వినియోగదారుల కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. మహానగరంలో సుమారు 330 పెట్రోల్ బంకులు ఉండగా.. ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోతుందన్నది అంచనా. బంకుల్లో ఫిల్లింగ్ మిషన్ పైకి అంతా సవ్యంగానే కనిపించినప్పటికీ రిమోట్ కంట్రోల్ ద్వారా రీడింగ్‌ను జంపింగ్ చేయిస్తే కనీసం ప్రతి వెయ్యి లీటర్లుకు 40 లీటర్ల ఇంధనం తక్కువగా పంపింగ్ జరుగుతుంది. ఈ లెక్కన నగరంలో ప్రతిరోజు 30 లక్షల లీటర్లకు గాను 1.20 లక్షల లీటర్లు తక్కువగా పంపింగ్ జరగుతున్నట్లు అంచనా. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ. 79.90. దీని ప్రకారం లెక్కిస్తే.. రోజుకు పెట్రోల్ మోసం విలువ రూ.95.88 లక్షలు. గత ఐదేళ్లుగా సాగుతున్న పెట్రోల్ మోసాల దోపిడీని లెక్కిస్తే... మహా నగరవాసుల కళ్లు బైరు కమ్మడం ఖాయం. తనిఖీ భయంతో సమ్మెకు దిగి.. ఈ నేపథ్యంలో తూనికలు, కొలతల శాఖ వరుస ఆకస్మిక దాడులతో బెంబేలెత్తిన పెట్రోలియం డీలర్లు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మెరుపు సమ్మెకి దిగి.. ఇరవై నాలుగు గంటల తర్వాత తామంతట తామే బేషరతుగా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. నయామోసాల తప్పు తమది కాదు.. ఆయిల్ కంపెనీలదంటూనే తక్షణమే రిమోట్లను సరెండర్ చేసి ప్రభుత్వం ఆమోదం లేని డిస్పెన్సింగ్ యూనిట్లను మార్పు చేసుకుంటామని లిఖిత పూర్వకంగా తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు. నివ్వెరపర్చిన నయామోసాలు.. మహానగరంలో బంకుల నయామోసాలు నివ్వెరపర్చాయి. ఇప్పటివరకు పెట్రో ఫిల్లింగ్ మిషన్లలో చేతివాటం ప్రదర్శించి హెచ్చు తగ్గులతో మోసాలకే పాల్పడే బంకులు.. ఏకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువుగా మార్చుకొని స్టాఫ్వేర్నే కంట్రోల్ చేసే విధానానికి దిగడం విస్మయానికి గురిచేసింది. సరిగ్గా నెలరోజుల క్రితం సైబరాబాద్ ప్రత్యేక పోలీసులు బృందం చేతిలో ఒక నకిలీ సాఫ్ట్వేర్ ముఠా చిక్కడంతో పెట్రో చిప్‌ల మోసాల వ్యవహారం బయటపడింది. ఎస్ఓటీ పోలీసులు సుమారు 11 ఫిల్లింగ్ స్టేషన్లలో అమర్చిన చిప్‌లను తొలగించి నిందితులను కటకటాల వెనక్కి పంపించారు. తూ.కొ. శాఖ కు కేసు బదిలీచేసి మరో 70 బంకుల్లో చిప్‌లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసినా ఫలితం లేదు. తూ.కొ. శాఖ తీరిక చేసుకొని మొక్కుబడిగా కొన్ని బంకులను తనిఖీ చేయగా మరో కొత్త తరహా మోసం బయటపడటం ఖంగు తినిపించింది. కంచే చేను మేస్తే.. సాక్షాత్తు ప్రధాన ఆయిల్ కంపెనీలే మోసాలకు సహకరించే డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను సరఫరా చేయడం విస్మయపర్చింది. ముంబైలోని టట్సునో ఇండియా ప్రయివేటు లిమిటేడ్, డ్రెసర్వేన్ కంపెనీలు ఉత్పిత్తిచేసిన డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను తమ డీలర్లకు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీతో పాటు మరో ప్రయివేటు షెల్ కంపెనీ కూడా సరఫరా చేసింది. దీంతో రెండు కంపెనీలు ఉత్పత్తి చేసిన డిస్పెన్సింగ్ యూనిట్లపై తూ. కొ. అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రస్థాయిలో వాటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ కోసం ఆరా తీసి రెండు రోజుల క్రితం దాడులు నిర్వహించగా.. రిమోట్ అమ్మకాల వ్యవహారం బయటపడింది. సుమారు 250 వరకు రిమోట్లు సరఫరా జరిగినట్లు విచారణలో తెలింది. దీంతో తూ.కొ. ఉన్నతాధికారులు విస్తృత దాడులకు ఆదేశించడంతో పెట్రో బంకుల డీలర్లు వేధింపులంటూ సమ్మెకు దిగి పెట్రో బంకులను బంద్ చేసి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం సుమారు 24 గంటల పాటు నగరంలో పెట్రోల్ బంకులు మూతపడడంతో ఆర్టీసీ బస్సులకు అనూహ్యంగా ఆదరణ పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు బంకులు మూతపడడంతో చాలామంది వాహ నదారులు బస్సులను ఆశ్ర యించారు. దీంతో సాధారణ రోజుల్లో రూ.2.6 కోట్లు లభిస్తుండగా.. ఆదివారం ఒక్క రోజు రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు ఆర్టీసీ అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రతి రోజు 35 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బంకుల మూసివేత దృష్ట్యా 5 లక్షల మంది అదనంగా పయనించినట్లు ఆర్టీసీ అంచనా. చంచల్‌గూడ వద్ద జనజాతర.. చంచల్‌గూడ: తూనికలు, కొలతల శాఖ దాడులను నిరసిస్తూ నగరంలోని పెట్రోల్ బంకుల యజమానులు బంద్ పాటించిన నేపథ్యంలో చంచల్ గూడలోని జైళ్ల శాఖకు చెందిన పెట్రోల్ బంకు మాత్రం వినియోగదారుల సౌకర్యార్థం ఇంధనం విక్రయించారు. ఆదివారం సాయంత్ర 6 నుంచి 9 గంటల వరకు రూ. 4 లక్షల ఇంధనం విక్రయించినట్లు బంకు ఇన్చార్జి, డిప్యూటీ జైలర్ గణేష్‌బాబు సూచనప్రాయంగా తెలిపారు. సాధారణ రోజుల్లో 14 వేల లీటర్ల పెట్రోల్, 8 వేల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. సమ్మె ప్రభావం వల్ల అదనంగా 6 వేల లీటర్ల పెట్రోల్ విక్రయించినట్లు తెలిపారు.ఆ ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసింది. కలెక్టర్ సీరియస్ పెట్రోల్ బంకు డీలర్ల మెరుపు సమ్మెతో ప్రజలు ఇబ్బందులకు గురికావడంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సీరియస్ ఆయ్యారు. సోమవారం పెట్రోల్ డీలర్ల సమ్మెపై గవర్నర్ మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ద్వారా అందడటంతో కలెక్టర్ హుటాహుటిన సివిల్సప్లై, తూనికలు కొలతల శాఖ అధికారులతోపాటు ఆయిల్ కంపెనీలు, డీలర్ సంఘం ప్రతినిధులను పిలిపించి చర్చించారు. పెట్రోలియం డీలర్లు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగి బంకులు బంద్ పాటించడమేమిటని ప్రశ్నించారు.ప్రభుత్వ ఆమోదం లేని పరికరాలు వినియోగించడం చట్టవిరుద్దమన్నారు. సివిల్స్ సప్లై, తూనికలు, కొలతల శాఖ అధికారులు సమన్వయంతో ఆయిల్ కంపెనీలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సూచించారు. పెట్రోల్ బంకుల బంద్ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. -
జంకులేని బంకులు
సిటీలో పెట్రోల్ బంకుల బరితెగింపు శివారు ప్రాంతాల్లో మరీనూ... వాహనదారులను నిలువునా దోచేస్తున్న వైనం ఏటా రూ.35 కోట్లకుపైగా మోసం యథేచ్చగా కల్తీ పరిమాణంలోనూ భారీగా చేతివాటం మామూళ్ల మత్తులో తూనికలు కొలతలశాఖ హైదరాబాద్ సంఘటనలతోనైనా కళ్లుతెరవని అధికారులు కంటికి కనిపించని దొంగతనం అంటే ఏంటో తెలుసా..ఎప్పుడైనా చూసి ఉంటారా...లేదంటే సిటీలో పెట్రోల్ బంక్‌ల తీరును నిశితంగా గమనిస్తే ఇట్టే పట్టేయొచ్చు. నిజం..నగరంలో పెట్రోల్ బంకులు బరితెగించేస్తున్నాయి. నిలువు దోపిడీయే లక్ష్యంగా బంక్‌లతో పంపింగ్ చేస్తున్నాయి. నాలుగు చేతులు నిండితేచాలు వాహనదారులు ఏమైపోతే మనకెందుకు అనే ధోరణితో ఏటా కోట్లకు కోట్లు పిండేస్తున్నాయి. బంక్‌కు వచ్చిన వాహనదారులు తొందరగా పెట్రోల్ పోయించుకుపోతే చాలనే కంగారుతో పరోక్షంగా బంక్‌ల అక్రమాలకు బలైపోతున్నారు. ఒక పక్క కల్తీ, మరోపక్క పరిమాణం రూపంలో బంక్‌ల యాజమాన్యాలు భారీగా దిగమింగుతూ చెలరేగిపోతున్నాయి. అడ్డుకునేవాళ్లు లేక, బాధ్యత వహించాల్సిన తూనికలు కొలతలశాఖ బంక్‌లు పోసే మామూళ్ల మత్తులో తేలుతున్నాయి. ఏటా రూ.35 కోట్లకుపైగా జరుగుతున్న ఈ దోపిడీకి అంతంలేకుండా పోతోంది. మేమంతే...అడ్డుకునేవాళ్లేరి? అన్ని కంపెనీలవి కలిపి నగరంలో మొత్తం 72పెట్రోలు బంక్‌లున్నాయి. వీటిలో చాలా బంకులు అడ్డగోలుగా బరితెగించేస్తున్నాయి. నిబంధనలకు పెట్రోలొదిలి అందినకాడికి దోచుకుంటున్నాయి. వాస్తవా నికి వాహనదారుడెవరైనా బంక్‌కు వస్తేనిక్కచ్చి కొలతతో ఇంధనం పోయాలి. కానీ అడ్డగోలు మాయాజాలం లెక్కలతో తక్కువ పరిమాణం పెట్రోలుతో దోచేస్తున్నాయి. శివారు ప్రాంతంతోపాటు జాతీయరహదారిపైనున్న పదులసంఖ్యలోని పెట్రోల్ బంకులు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. లీటర్ ఇంధనం కొట్టాల్సినచోట పరిమాణం తగ్గించి పంప్ చేస్తున్నాయి. ఇలా నిత్యం వందల వాహనాల్లో ఇంధనం నింపి ఏటా కోట్లలో వెనకేసుకుంటున్నాయి. కొన్ని బంక్‌లు తక్కువ పరిమాణంలో ఇంధనం నింపి ఎక్కువ కొట్టినట్టు తప్పుడు మీటర్లతో మాయచేస్తోన్న సంఘటనలు ఇటీవల రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో బయట పడ్డాయి. సరిగ్గా ఇటువంటి దోపిడీకూడా నగరంలో యథేచ్చగా జరుగుతోంది. పేరుకు మీటర్ రీడింగ్ సక్రమంగానే కనిపించినా ట్యాంకులో మాత్రం అంత ఇంధనం పడడంలేదు. విషయం తెలియక, బంక్‌ల బరితెగింపు అర్థంకాక వినియోగదారులు చేసేదిలేక మళ్లీ ఇంధనానికి అక్కడకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేవలం కొన్ని బంక్‌లు మినహా చాలావి ఇదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ కల్తీచేసి విక్రయిస్తూ వేలాది వాహనాల జీవిత కాలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏదైనా లారీ 100 లీటర్లు డీజిల్ కొట్టిస్తే ట్యాంకులో పడేది కేవలం 9వేల మిల్లీలీటర్ల వరకు పరిమాణం తగ్గించేస్తున్నారు. అంటే సుమారుగా 9లీటర్లకుపైగానే మోసం జరుగుతోంది. ఈ విధంగా నిత్యం నగరం, చుట్టుపక్క ప్రాంతాల్లో వేలాది లారీలు వందలాది లీటర్లు ఇంధనం కొట్టిస్తాయి. ఈ విధంగా ఏటా కోట్లలో వీటినుంచి పిండేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టించుకునే ఇంధనంలో అయిదు లీటర్లకు 100ఎంఎల్ వరకు తగ్గించేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అయితే యథేచ్చగా మీటర్ ట్యాంపరింగ్ జరుగుతోంది. అయిదు లీటర్లు పెట్రోలుకు నాలుగు లీటర్లే కొట్టినా మీటర్ రీడింగ్ మాత్రం సరిగ్గానే చూపిస్తున్నాయి. వాస్తవానికి పెట్రోల్ బంక్‌ల మాయాజాలాన్ని జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారులు పట్టుకుని వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ నగరంలో మాత్రం ఆశాఖ పనిచేస్తోన్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నిసార్లు నెలనెలా, వివిధ సందర్భాల్లోనూ, నిబంధనలన్నీ సరిగ్గా అమలవుతున్నాయన్న సర్టిఫికెట్, స్టాంపింగ్ వేసే సమయాల్లో వీటినుంచి అందినకాడికి దోచేస్తున్నారు. దీంతో అధికారులు తమ జోలికి రారనే ధైర్యంతో అడ్డగోలుగా బరితెగించేస్తున్నారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్‌లపై ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. కానీ ఇదెక్కడా అమలు కావడంలేదు. నగరంలో భారీగా బంక్‌లు దోచేస్తుంటే అధికారులు మాత్రం తమ తనిఖీల్లో కేవలం అయిదు లీటర్లకు 30నుంచి 40 ఎంఎల్ మాత్రమే పరిమాణం తగ్గిస్తున్నారని చెప్పడం విశేషం. మరో పక్క ప్రతి పెట్రోల్ బంక్ విక్రయించే ఇంధన శాంపిళ్లను బంక్ వద్ద ప్రదర్శించాలి. దాన్ని తరచూ అధికారులు తనిఖీలు చేస్తుండాలి. నగరంలో 90శాతం వరకు బంక్‌లు శాంపిళ్లను ప్రదర్శించడం లేదు. విడి పెట్రోల్‌ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఇందులోను భారీగా బయటకుతరలిపోయి బాటిళ్ల రూపంలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై తూనికలుకొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ మాధురిని వివరణ కోరగా, సిటీలో బంక్‌లు కొంతవరకు మోసంచేసున్నాయని, పదిరోజులుగా తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. -
లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి
చిల్లకల్లు వద్ద ప్రమాదం, ఆరుగురికి గాయాలు మృతుడు గుంటూరు జిల్లా పశు సంవర్థకశాఖలో ఉద్యోగి పుట్రేల వద్ద ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చిల్లకల్లు (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్ : మండలంలోని చిల్లకల్లు వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వోద్యోగి దుర్మరణం చెందారు. సేకరించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పి ట్టలవానిపాలెం మండలం సంగుపా లెం కోడూరులోని పశుసంవర్థకశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెం ట్‌గా గీరా అంకినీడు ప్రసాద్(45) విధులు నిర్వహిస్తున్నారు. ఆ శాఖ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తోటి ఉద్యోగులు ఆరుగురితో కలిసి ఈనెల ఐదోతేదీన కారులో హైదరాబాద్ వెళ్లా రు. గురువారం రాత్రి వారు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం వేకువజామున మూడు గం టల సమయంలో చిల్లకల్లు సమీపం లో ఉన్న పె ట్రోల్బంకు లో నుంచి వస్తున్న లారీని వారు ప్ర యాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘ టనలో ముందు సీటులో కూర్చున్న అంకినీడు ప్రసాద్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఉన్న తోటి ఉద్యోగులు నెక్కంటి రవీంద్రకుమార్, రామిశెట్టి బ్రహ్మ య్య, జూడా రమేష్, గుండా రామకృష్ణ, గురింద్ర వెంకటశ్రీనివాస్, రెడ్డి వెంకట ఫణికుమార్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిం చా రు. చిల్లకల్లు ఎస్సై పి.నాగరాజు సి బ్బందితో ఘటనాస్థలిని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంకినీడు ప్రసాద్ మృతదేహాన్ని మం డల పశువైద్యుడు శ్రీని వాస నాయక్, సిబ్బంది సందర్శించి నివాళులర్పిం చారు. కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉం టుందని పోలీసులు భావిస్తున్నారు. రెండు లారీలు ఢీకొని మరొకరు.. విస్సన్నపేట : మండలంలోని పుట్రేల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పుట్రేల శివారులో రెండు లారీలు ఎదురెదురుగా వస్తున్న ఢీకొ న్నాయి. ఈ ఘటనలో నందిగామ స మీపంలోని అనాసాగరం గ్రామానికి చెందిన మల్లెంపాటి బాలరాజు(36)కు తీవ్ర గాయాలయ్యాయి. 108లో అతడిని తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చని పోయాడు. ఈ ఘటనలో రామిశెట్టి రమేష్, నాగభూషణం అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై దుర్గా ప్రసాద్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతాగప్ ‘చిప్’
పెట్రోల్ బంకులు ప్రత్యేక చిప్‌లతో ఇం‘ధన’ దోపిడీకి పాల్పడుతున్నాయని వెల్లడవడంతో నగరం నివ్వెరపోయింది. బంకులు ‘నయా’వంచనకు పాల్పడుతూ వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్న ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు బంకుల్లో మోసాలను బయటపెట్టి అప్పుడే నాలుగు రోజులైంది. అయినా ఒక్క బంకుపైనా ఎలాంటి చర్యలూ లేవు. తూనికలు కొలతల శాఖ తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తోంది. ఫలితం.. సిటీజనులను దారుణ మోసం చేసిన పెట్రోల్ బంకులు దర్జాగా దందా సాగిస్తు న్నాయి. నిజానికి తూ.కొ. శాఖ పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేసి పంపింగ్‌లో జరిగే మోసాలను గుర్తించి ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేయాలి. అవసరమైతే లెసైన్స్‌ల రద్దుకు సిఫార్సు చేయాలి. కానీ, ఇక్కడ అటువంటిదేమీ జరగడం లేదు. బంకులకు సాఫ్ట్వేర్ చిప్‌లను అందించిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు.. బంక్ నిర్వాహకులపై చీటింగ్ కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. తూ.కొ.శాఖ మాత్రం కనీస చర్యలకూ ఉపక్రమించట్లేదు. కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే మోసాల బంక్‌లపై చర్యలకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: పెట్రోలు బంకుల్లో ‘నయా’వంచనపై సిటీజనులు ఆందోళనకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదు. చర్యలు తీసుకోవాల్సిన తూనికలు కొలతలు శాఖ కనీస చర్యలూ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిల్లింగ్ స్టేషన్ల సీజ్ ఏదీ..? ప్రత్యేక సాఫ్ట్వేర్ చిప్ ద్వారా మోసాలకు పాల్పడిన ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణ యథావిధిగా కొనసాగడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మోసాలు బయటపడితే సదురు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేయడమే కాకుండా సంబంధిత వస్తువులను సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలి. కానీ, పెట్రోల్ బంక్ ఫిల్లింగ్ మిషన్లలో సాఫ్ట్వేర్ చిప్ అమర్చి ఇంధనం పంపింగ్‌లో మోసాలకు పాల్పడుతున్నట్లు బహిర్గతమైనప్పటికీ ఇటు పోలీసు శాఖ, అటు తూనికలు, కొలతల శాఖ ఉదాసీన వైఖరితో వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా తూనికలు, కొలతల శాఖ చట్టం ప్రకారం తూకంలో మోసాలు బయటపడితే సంబంధిత యంత్రాలను సీజ్ చే యడమే కాకుండా సదరు సంస్ధల లెసైన్స్‌ల రద్దుకు సిఫార్సు చేయాలి. కానీ, తూనికలు, కొలతల శాఖ మోసాల బంక్‌లపై కనీసం శాఖాపరమైన కేసులూ నమోదు చేయడం లేదు. తూనికలు, కొలతల శాఖ మౌనం పెట్రోలు బంకుల కేసుల వ్యవహారంపై తూ.కొ. అధికారులను సంప్రదించగా మాట్లాడటానికి నిరాకరించారు. సాక్షాత్తు శాఖ రాష్ట్ర కంట్రోలర్‌ను ఫోన్లో పలుమార్లు వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. బంక్‌లను మేం సీజ్ చేయలేం సాఫ్ట్వేర్ ద్వారా మోసానికి పాల్పడుతున్న పెట్రోల్ బంకులను సీజ్ చేసే అధికారం మాకు లేదు. తూనికలు, కొలతల శాఖకే ఆయా బంకులను సీజ్ చేసే అధికారం ఉంది. సాఫ్ట్వేర్ చిప్‌లను సరఫరా చేసిన నిందితులను మాత్రమే అరెస్టు చేసి జైలుకు పంపాం. బంకులోని మిషన్లను మాత్రం మేమే సీజ్ చేశాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆశ్యర్యమనిపిస్తోంది పత్రికల్లో సీజ్ చేశామని వచ్చింది. కా నీ పెట్రోల్ బంక్ యథావిధిగా నడుస్తుండటం ఆశ్చర్యమనిపిస్తుంది. ఎస్ఓటీ పోలీసులు దాడి చేస్తే గాని ట్యాంక్‌లో పోస్తున్న పెట్రోల్ తక్కువ వస్తుందన్న విషయం మనకు అర్థం కాలేదు. ఇప్పటికైనా ఇలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. - రోహిత్, జీడిమెట్ల పర్యవేక్షణ అవసరం దాడులు నిర్వహించినా బంకుల యాజమాన్యాలు జంకు లేకుండా పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ బంకులపై పర్యవేక్షణ ఉండాలి. అధికారులు మాత్రం మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. - శేషురావు, ద్విచక్ర వాహనదారుడు ప్రజల్లో చైతన్యం రావాలి వాహనాల్లో ఇం దనం పోయించుకునేటప్పుడు తప్పనిసరిగా ఫిల్లింగ్ యంత్రాల రీడిం గ్ను సరిచూసుకోవాలి. ఏమైనా అనుమానం వస్తే వెంటనే అక్కడి సిబ్బందిని ప్రశ్నించాలి. బంకుల్లో మోసాలపై వాహనదారులకు అవగాహనే ఉండటం లేదు. - రాజు, ట్రాక్టర్ డ్రైవర్ ప్రతిసారీ మైలేజీ తక్కువే ప్రతిసారీ మైలేజీ తక్కువ వస్తోంది. వాహనంలో తేడా ఉందేమోనని మెకానిక్ దగ్గరకు వెళ్తున్నాం. వారు వాహనాన్ని పరిశీలించి బాగానే ఉందంటున్నారు. పెట్రోల్ బంకుల్లో సిబ్బందిని ఒకటి రెండుసార్లు ప్రశ్నించాను. వారు ఎదురు తిరగడంతో మిన్నకున్నా. - శ్రీజేష్, ద్విచక్ర వాహనదారుడు చర్యలు తీసుకోవాలి మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ తెరిచే ఉండటం విస్మ యం కలిగిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి బంకులపై చర్యలు తీసుకోని అధికారులకూ శిక్షలుంటే బాగుంటుంది. - కేశవ్ , అంగడిపేట్ -
తూ.కొ.శాఖ మొద్దు నిద్ర
కళ్లముందే బంక్‌ల్లో చోరీ నివ్వెరపరుస్తున్న సాఫ్ట్వేర్ మోసం సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల పంపింగ్‌లో జరుగుతున్న కొత్త తరహా మోసాన్ని గుర్తించకుండా తూనికల కొలతల శాఖ మొద్దునిద్ర పోతోంది. ఎస్వోటీ పోలీసులు దాడులకు దిగితేనే కానీ మేల్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు నగరంలోని పెట్రోల్ బంకుల పంపింగ్‌లో యథేచ్ఛగా దోపీడీ కొనసాగుతున్నా అడ్డుకట్ట వేయాల్సిన అధికారులకు మామూళ్ల మత్తు నిద్ర మాత్రం వీడడం లేదు. పెట్రోల్ వినియోగంలో హైదరాబాద్ మహానగర వాటా రాష్ర్టంలోనే సగానికి పైగా ఉండడంతో డిమాండ్‌ను సాకుగా తీసుకొని పెట్రోల్‌బంకుల యాజమాన్యాలు అక్రమాలకు తెరలేపారు. ఇప్పటికే మీటర్ పంపింగ్‌లో చేతివాటంతో పాటు ఇంధనంలో కల్తీతో వినియోగదారుడు మోసానికి గురవుతున్నాడు. దాంతో ప్రతి లీటర్‌కు 50 నుంచి 99 ఎంఎల్‌ల వరకు తక్కువగా రావడం సర్వసాధరణమైంది. ఆయితే తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సాఫ్ట్వేర్ చిప్ వినియోగంతో పెట్రోల్ పంపింగ్‌పై ‘రిమోట్’ కంట్రోల్ వ్యవహారం వెలుగుచూడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తనిఖీలు జరిమానాలతో సరి.... మహానగరంలోని పెట్రోల్ బంకుల మీటర్ పంపింగ్‌లో మోసాలు కొనసాగుతున్నా.. తూనికల కొలతల శాఖ మాత్రం తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్ళినప్పుడు మాత్రం ఆయన ఆదేశాల మేరకు మొక్కుబడి తనిఖీలు నిర్వహించి, నామమాత్ర కేసులతో సరిపెట్టడం, చివరకు జరిమానాలతో కేసులను క్లోజ్ చేయడం సర్వసాధరణంగా మారింది. గ్రేటర్ పరిధిలో తూనికల కొలతల శాఖ కూడా గత మూడేళ్లలో సుమారు 352 బంకులను తనిఖీ చేసి మీటర్ పంపింగ్‌లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొన్నింటిపై కేసులు నమోదు చేసి జరిమాన విధించి చేతులు దులుపుకుంది. వాస్తవంగా జరిమానతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. మరోవైపు బంకుల్లోని మీటర్ పంపింగ్ యూనిట్లను తనిఖీ చేస్తూ సీల్ వేయాల్సి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. మహానగరం పరిధిలో సుమారు 330పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 40 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 11 లక్షల వాహానాలు వరకు ఉంటాయన్నది అంచనా. ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. కొత్త మోసం... నగరంతో పాటు శివార్లలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో వినియోగదారులు ఆయోమయానికి గురవుతున్నారు. సుమారు 75 బంక్‌లు మోసాలకు పాల్పడతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో పెట్రోల్‌బంకుల యాజమానుల్లో ఆందోళన రగులుకుంది. కొత్త తరహా మోసంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ కల్గిన చిప్‌ల వినియోగంతో ఫ్యూయల్ మిషన్‌తో తోపాటు బయట ఉండే రిమోట్ పనిచేస్తోంది. వినియోగదారునికి మీటర్‌పై లెక్కలు సరిగ్గానే ఉన్నప్పటికీ పంపింగ్ తక్కువగా జరుగుతుంది. తనిఖీలు జరిగినప్పుడు రిమోట్ ద్వారా చిప్‌ను ఆఫ్ చేస్తే కొలతల్లో తేడా రాకుండా పంపింగ్ మిషన్ పనిచేస్తుంది.దీంతో మోసాలు బయటపడే అవకాశాలు ఉండవు.