లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి
- చిల్లకల్లు వద్ద ప్రమాదం, ఆరుగురికి గాయాలు
- మృతుడు గుంటూరు జిల్లా పశు సంవర్థకశాఖలో ఉద్యోగి
- పుట్రేల వద్ద ప్రమాదంలో మరో వ్యక్తి మృతి
చిల్లకల్లు (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్ : మండలంలోని చిల్లకల్లు వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వోద్యోగి దుర్మరణం చెందారు. సేకరించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పి ట్టలవానిపాలెం మండలం సంగుపా లెం కోడూరులోని పశుసంవర్థకశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెం ట్‌గా గీరా అంకినీడు ప్రసాద్(45) విధులు నిర్వహిస్తున్నారు.
ఆ శాఖ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తోటి ఉద్యోగులు ఆరుగురితో కలిసి ఈనెల ఐదోతేదీన కారులో హైదరాబాద్ వెళ్లా రు. గురువారం రాత్రి వారు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం వేకువజామున మూడు గం టల సమయంలో చిల్లకల్లు సమీపం లో ఉన్న పె ట్రోల్‌బంకు లో నుంచి వస్తున్న లారీని వారు ప్ర యాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘ టనలో ముందు సీటులో కూర్చున్న అంకినీడు ప్రసాద్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఉన్న తోటి ఉద్యోగులు నెక్కంటి రవీంద్రకుమార్, రామిశెట్టి బ్రహ్మ య్య, జూడా రమేష్, గుండా రామకృష్ణ, గురింద్ర వెంకటశ్రీనివాస్, రెడ్డి వెంకట ఫణికుమార్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.
వారిని విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిం చా రు. చిల్లకల్లు ఎస్సై పి.నాగరాజు సి బ్బందితో ఘటనాస్థలిని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంకినీడు ప్రసాద్ మృతదేహాన్ని మం డల పశువైద్యుడు శ్రీని వాస నాయక్, సిబ్బంది సందర్శించి నివాళులర్పిం చారు. కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉం టుందని పోలీసులు భావిస్తున్నారు.
రెండు లారీలు ఢీకొని మరొకరు..
విస్సన్నపేట : మండలంలోని పుట్రేల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పుట్రేల శివారులో రెండు లారీలు ఎదురెదురుగా వస్తున్న ఢీకొ న్నాయి. ఈ ఘటనలో నందిగామ స మీపంలోని అనాసాగరం గ్రామానికి చెందిన మల్లెంపాటి బాలరాజు(36)కు తీవ్ర గాయాలయ్యాయి. 108లో అతడిని తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చని పోయాడు. ఈ ఘటనలో రామిశెట్టి రమేష్, నాగభూషణం అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై దుర్గా ప్రసాద్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.