వరంగల్, న్యూస్‌లైన్ : రైతులకు వరుస కష్టాలు తప్పలేదు. గత ఏడాది వానలు లేక విలవిల్లాడిన రైతులకు... ఈసారి అధిక వర్షాలు శాపంగా మారాయి. ఈనెల 23 నుంచి వరుసగాకురిసిన వానలు వారిని కోలుకోలేని దెబ్బ తీసింది. చేతికి అంది వచ్చిన పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం గుర్తించిన ప్రకారం 35 మండలాల్లోని 640 గ్రామాల్లో 3,60.497 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు నష్టపోయూరు. జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట, ములుగు, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, వరంగల్ రూరల్‌తో సహా పలు మండలాల్లో నష్టపోయిన పంటల విలువ ప్రభుత్వ అంచనాల ప్రకారం ’ 686 కోట్లు ఉంటుందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఆదివారం ఉదయం నుంచి గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పంటల నష్టంపై లెక్క తేల్చినట్లు జేడీఏ రామారావు చెప్పారు. మొత్తం 2,30,460 మంది రైతులకు వర్షాలతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. 1,44,199 హెక్టార్ల(3,60,497.5 ఎకరాలు)లో పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు.
పంటలన్నీ నీటిపాలు
జిల్లావ్యాప్తంగా 5.10 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఖరీఫ్ ఆరంభం నుంచే వర్షాలు సమృద్ధిగా కురువడం, జలాశయాలు నిండడంతో పంటలపై రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పత్తి కాయలు పగిలి మొదటి దఫా ఏరే సమయం వచ్చింది. వరి పొట్ట దశలో ఉంది. ఈ క్రమంలో కురిసిన వర్షాలు రైతులను కొలుకునే అవకాశం లేకుం డా దెబ్బకొటాయి. కాస్తొకూస్తో మిగిలిన పంట లకు తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉండడంతో రైతుల రోదన మిన్నంటుతోంది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం 2,80,467.5 ఎకరాల్లో పత్తి పూర్తిగా నాశనమైంది. వర్షం నీటిలో మొక్కలుండగా... కాయలు మొత్తం రాలిపోయాయి. ఏరే స్థితిలో ఉన్న పత్తి బుగ్గలునల్లబడిపోయాయి. అదే విధంగా 69,897.5 ఎకరాల వరి నేల వంగింది. పొట్ట దశలో ఉన్న వరి గొలుసులు వరద నీటిలో కొట్టుకుపోయా యి. 7,857.5 ఎకరాల్లో మొక్కజొన్న పంట అక్కరకు రాకుండా పోయింది. 2,275 ఎకరాల్లో వేరుశనగ నాశనమైంది. వరద నీటిలో వేరుశనగ మొలకలు కొట్టుకుపోయాయి. 70 ఎకరాల్లో మిర్చి తోటలు దెబ్బతిన్నాయి.
తెగిన రోడ్లు
ఆర్‌అండ్‌బీ పరిధిలోని 121 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వరంగల్, మహబూబాబాద్ డివిజన్లలో అధిక నష్టం వాటిల్లింది. రోడ్లకు అత్యవసరంగా తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు ’2.30 కోట్లు అవసరమని, శాశ్వత మరమమతులకు ’ 22 కోట్లు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఇక వరంగల్ కార్పొరేషన్‌లో నాలాలు, డ్రెరుునేజీలు, అంతర్గత రోడ్ల మరమ్మతులకు ’ 54 లక్షలు అవసరమని ప్రతిపాదనలు అందజేశారు. లోతట్టు ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు ’ 6 లక్షలు అవసరమని ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నిధుల నుంచి గ్రామాల్లో తాగునీటిని క్లోరినేషన్ చేయూలని కలెక్టర్ కిషన్ ఆదేశాలిచ్చారు.
చెరువులకు గండ్లు
మైనర్ ఇరిగేషన్ పరిధిలోని గండ్లు పడిన చెరువులకు రూ 3 లక్షలతో మరమ్మతు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. వర్ధన్నపేటలో ఒక టి, నర్సంపేటలో 7, పరకాలలో 4, డోర్నకల్ లో ఒకటి, భూపాలపల్లిలో 6, ములుగులో 7, ఏటూరునాగారంలో 5 చెరువులకు బుంగలు పడినట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 245 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, 473 తీవ్రస్థాయిలో ధ్వంసమైనట్లు, మరో 1081 పా క్షికంగా దెబ్బతిన్నట్లు సర్వేలో తేలింది.
వాన నష్టం రూ 710 కోట్లు
Published Mon, Oct 28 2013 3:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement