సరుకుల కొరతపై మేల్కొనండి! | Department of Consumer Affairs Comments About Shortage of goods | Sakshi
Sakshi News home page

సరుకుల కొరతపై మేల్కొనండి!

Published Tue, Apr 14 2020 5:23 AM | Last Updated on Tue, Apr 14 2020 5:23 AM

Department of Consumer Affairs Comments About Shortage of goods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ఉత్పత్తి తగ్గడం, సరుకు రవాణాలో ఆటంకాలు, కార్మికుల కొరత, గోదాముల మూత కారణంగా సరుకుల కొరత తీవ్రమవుతోంది. ముఖ్యంగా సూపర్‌ మార్కెట్లు, స్టోర్స్, కిరాణా దుకాణాలకు సరుకు రవాణా గొలుసు (సప్లయ్‌ చెయిన్‌) తెగిపోవడంతో స రుకుల లభ్యత తగ్గింది. ఈ దృష్ట్యా నిత్యావసరాలపై దృష్టిపెట్టిన కేంద్రం ఆహార ఉ త్పత్తులు, రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చింది. వాటి ధరలను కట్టడి చేసేలా తక్షణ చర్య లు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. 

50 శాతం కొనలేకపోయారు..
నిత్యావసర వస్తువుల లభ్యతను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. పెద్దసంఖ్యలో విని యోగదారులు తమ వస్తువులను ఆఫ్‌లైన్, ఆన్‌లై న్‌లో పొందలేకపోతున్నారని తాజా సర్వే వెల్లడిం చింది. స్థానిక కిరాణా దుకాణాల ద్వారా నిత్యావసరాలను 35 శాతం కొనలేకపోయారని,  ఈ–కామర్స్‌ సంస్థలైన అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమా టో వంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా నిత్యావసరా లు కొనలేని వినియోగదారులు 50 శాతం వరకు ఉన్నారంది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారా ల మంత్రిత్వశాఖ, సోషల్‌ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం సంయుక్తంగా 16వేల మంది వినియోగదారుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. ఆన్‌లైన్‌ ద్వారా గోధుమలు, బియ్యం, పప్పు ధా న్యాలు, ఉప్పు, చక్కెర వంటి సరుకుల్లోనూ 39 శాతం మంది మాత్రమే పూర్తి వస్తువులు పొందగలి గారని, మిగతా వారిలో కొందరికి కొన్ని వస్తువులు దొరకగా, చాలామందికి అవసరమైన సరుకులు లభించలేదంది. 

రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకత్వం..
మిల్లులు, గిర్నీలు పనిచేయకపోవడంతో గోధుమ, శనగ, జొన్న పిండ్ల  లభ్యత తగ్గింది. దీంతో వీటి ధరలు పెరిగాయి. గోధుమ పిండి ధర రూ.10 మేర పెరిగి రూ.36కి చేరింది. మహారాష్ట్ర నుంచి చక్కెర దిగుమతులు తగ్గడంతో దాని ధర కూడా బాగా పెరిగింది. కార్మికుల కొరతతో ప్యాకేజ్డ్‌ ఆహార వస్తువుల సరఫరా డిమాండ్‌కు తగ్గట్లు మార్కెట్‌లో కనబడట్లేదు.

ముఖ్యంగా బిస్కెట్స్, బ్రెడ్, స్నాక్స్, సబ్బులు, షాంపూలు, రవ్వ, నూనెలు వంటి వాటి సరఫరా అటు కిరాణాలకు, సూపర్‌ మార్కెట్లకు త క్కువగా ఉందని వర్తకులు చెబుతున్నారు. ఈ దృ ష్ట్యా, సరుకుల సరఫరా గొలుసు రవాణాకు ఎక్క డా ఇక్కట్లు రాకుండా చూడాలని రాష్ట్రాలను కేం ద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. రాష్ట్రీ యంగా, అంతర్రాష్ట్రాల నుంచి నిత్యావసరాలను రవాణా చేసే కార్గో సర్వీసులు, ట్రక్కులు, కా ర్మికులు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలు సజా వుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు.  

హెల్ప్‌ లైన్‌ నంబరు..
రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తుల రవాణాకు ఇబ్బందులు లేకుండా.. పోలీసు శాఖ 04023434343 నంబరుతో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సమస్యలు ఎదురైతే పరిష్కరించేలా చర్యలు తీసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement