freight transport
-
రాష్ట్రంలో రోరో సర్వి సులు.. ఇక సులభంగా సరుకు రవాణా
సాక్షి, అమరావతి: భూమిపైన ఉన్న జల మార్గాలను వినియోగించడం ద్వారా ఇంధనం, సమయం ఆదా చేసే దిశగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది. దీనికోసం రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదుల్లో రోరో సర్వి సుల (ఒకేసారి 15 వరకు సరుకు రవాణా వాహనాలను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న పెద్ద సైజు పడవలు)ను ప్రవేశపెట్టడంపై దృష్టిసారించింది. నదులపై వంతెనలు లేని చోట, సరుకు రవాణా వాహనాలు అవతలి తీరానికి చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తున్న ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ రోరో సర్వీసులను ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద రోరో సర్వి సు పనులను మూడు నెలల్లో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఏపీ ఇన్లాండ్వేస్ అథారిటీ సీఈవో ఎస్వీకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కృష్ణా నది తీరంలో ఎన్టీఆర్ జిల్లా వైపు ఉన్న ముక్త్యాల వద్ద అధికంగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ వంతెన లేకపోవడంతో ఆ పరిశమ్రలకు అవసరమైన ముడిసరుకు కావాలన్నా, ఉత్పత్తి అయిన సిమెంట్‌ను సరఫరా చేయాలన్నా మరోవైపు ఉన్న పల్నాడు జిల్లాకు 125 కి.మీ ప్రయాణించాల్సి వస్తోంది. ఇందుకోసం ముక్త్యాలకు అవతలి గట్టున ఉన్న మాదిపాడును కలుపుతూ రోరో సర్వీసులను ప్రవేశపెడతామని, దీని వల్ల ప్రయాణ సమయంతో పాటు ఇంధనం గణనీయంగా కలసి వస్తుందన్నారు. ముక్త్యాల నుంచి రోజుకు 500 ట్రక్కులు ప్రయాణిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని, రోరో సర్వి సులు ప్రవేశపెట్టడం ద్వారా ఏడాదికి 9.2 మిలియన్ లీటర్ల డీజిల్ వినియోగం తగ్గడం ద్వారా రూ. 103 కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఏడాదికి రూ. 497 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. అదేవిధంగా పోలవరం పునరావాస గ్రామాలకు నిర్మాణ సామగ్రిని తరలించడం కోసం గోదావరి నదిపై సీతానగరం–తాడిపూడి వద్ద రోరో సర్వి సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఈ సర్వీసులు ప్రవేశ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సర్వి సుల ద్వారా సరుకు రవాణా వ్యయం టన్నుకు రూ.2.50 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ మూడు సర్వి సుల ద్వారా ఏటా డీజిల్ వినియోగం తగ్గడం ద్వారా రూ. 183 కోట్ల విదేశీ మారకం ఆదాతో పాటు ఆర్థిక వ్యవస్థకు రూ. 852 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గం.. త్వరలోనే విజయవాడ చుట్టుపక్కల ఏడు ప్రధాన దేవాలయాలను ఒకే రోజు సందర్శించి వచ్చే విధంగానూ, విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో వెళ్లే విధంగానూ లాంచీ సర్వి సులను ప్రవేశపెట్టే విధంగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రోరో అంటే.. రోరో అంటే రోల్ ఆన్.. రోల్ ఆఫ్ పడవలు (ఫెర్రీ). ఇవి పెద్దగా ఉండటం వల్ల వీటి లోపలికి వాహనాలను నేరుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. అలాగే దిగవచ్చు. తక్కువ దూరంలోని రెండు తీరాల మధ్య నదిలో నడపడానికి ఇవి వీలుగా ఉంటాయి. తీరంలో వీటి కోసం ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మిస్తారు. సరుకు రవాణా వాహనాలతో పాటు సాధారణ కార్లు, ప్రజలు కూడా వీటిలో ప్రయాణించేందుకు వీలుంటుంది. వంతెనలను కట్టడానికి వీలులేని ప్రదేశాల్లో పెద్ద నదులను దాటాల్సిన చోట వీటిని ఏర్పాటు చేస్తే సమయం, ఇంధనం కూడా ఆదా అవుతుంది. వీటిని తొలిసారి మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని గోఘా, దహెజ్ మధ్య ప్రవేశపెట్టారు. ముక్త్యాల (కృష్ణానది) ♦ స్టేట్ హైవే 34, 216 గుండా500 లారీల ప్రయాణం ♦ రోరో ఏర్పాటు ద్వారా తగ్గనున్న 125 కి.మీ దూరం ♦ ఒక ట్రిప్‌కు తగ్గనున్న 40 గంటల ప్రయాణ సమయం ♦ తద్వారా ఏడాదికి 9.2 లక్షల లీటర్ల ఇంధనం ఆదా ♦ ఏడాదికి రూ. 103 కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా ♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 497 కోట్ల ఆదాయం ఇబ్రహీంపట్నం (కృష్ణానది) ♦ జాతీయ రహదారి 30, 65 నుంచి రోజుకు300 లారీల ప్రయాణం ♦ రోరో ద్వారా తగ్గనున్న 70 కి.మీ దూరం ♦ ట్రిప్‌కు తగ్గనున్న 24 గంటల ప్రయాణ సమయం ♦ ఏడాదికి 3.2 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా ♦ రూ. 36 కోట్ల ఆదా కానున్న విదేశీ మారక నిల్వలు ♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 157 కోట్ల ఆదాయం సీతానగరం (గోదావరి) ♦ పోలవరం పునరావాస గ్రామాల నిర్మాణానికిరోజుకు 300 ట్రక్కుల ప్రయాణం ♦ రోరో ద్వారా తగ్గనున్న 75 కి.మీ దూరం ♦ ఒక ట్రిప్‌కు తగ్గనున్న 24 గంటల ప్రయాణ సమయం ♦ ఏడాదికి 3.42 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా ♦ ఆదా కానున్న రూ.44 కోట్ల విదేశీ మారక నిల్వలు ♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 198 కోట్ల ప్రయోజనం -
కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు రవాణాకు సహకరిస్తాం
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు లోడింగ్, ప్రధానమైన సరుకులను నిరాటంకంగా రవాణా చేయడానికి రైల్వే శాఖ సహాయ సహకారాలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ (జీఎం) అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. మెస్సర్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్వాహకులతో సరుకు లోడింగ్ అభివృద్ధి అవకాశాలపై రైల్వే జీఎం శనివారం చర్చించారు. పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర ముఖ్యాంశాలను రైల్వే జీఎంకు పోర్టు అధికారులు వివరించారు. పోర్టు వద్ద కోస్టల్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రైల్వే జీఎం అక్కడ మొక్కలను నాటారు. అనంతరం కృష్ణపట్నం స్టేషన్ – విజయవాడ సెక్షన్ మధ్య ప్రత్యేక రైలులో ప్రయాణించి పలు రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. గూడూరు–విజయవాడ సెక్షన్ మధ్య నిర్మాణంలో ఉన్న 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం లేదు రైల్వే అధికారులు టెక్నాలజీని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం లేదని, దానికితోడు క్రమశిక్షణతో కూడిన విధులు లేవని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అసహనం వ్యక్తం చేశారు. జీఎం తన పర్యటనలో భాగంగా ఒంగోలు రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫారంపై ఉన్న ఆహారం, పండ్ల రసం స్టాల్స్‌ను తనిఖీ చేసి అక్కడి విక్రయదారులతో మాట్లాడారు. విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇస్తున్నారా లేదా అని జీఎం అడిగిన ప్రశ్నకు ఓ కూల్‌డ్రింక్ షాపు యజమాని సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టడంతో.. బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేయిస్తుంటే ఏమి చేస్తున్నారని కమర్షియల్ రైల్వే విభాగం అధికారులను జీఎం నిలదీశారు. రైల్వే ఆస్పత్రిలో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడం, రైల్వేస్టేషన్‌లోని ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్‌లోనూ సాంకేతిక సమస్యలు ఉండటం గుర్తించిన జీఎం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సక్రమంగా సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవుతున్నారని, వెంటనే లోపాలను సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే జీఎం పర్యటనలో విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్రమోహన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
చౌకగా అందుబాటులోకి.. సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు (ఎంఎంఎల్పీ)ల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో రెండు పార్కుల నిర్మాణంపై దృష్టిసారించింది. తొలుత విశాఖపట్నం, అనంతపురం వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించే విధంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా.. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్, హైదరాబాద్–బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అభివృద్ధి చేస్తున్న భారీ పారిశ్రామిక పార్కుల వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం గతిశక్తి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వస్తువు ధరలో 13 శాతంగా ఉన్న సరుకు రవాణా వ్యయం ఎంఎంఎల్‌పీలతో దానిని 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 300–350 మి.ట.లకు పెరుగుదల ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టులు.. రామాయపట్నం, మచిలీపట్నం.. కాకినాడ గేట్‌వే, భావనపాడులతో పాటు విజయవాడ–ఖరగ్‌పూర్ మధ్య సరుకు రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కారిడార్ నిర్మిస్తుండటంతో వీటికి అనుగుణంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం సుమారు 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర సరుకు రవాణా 2024–25 నాటికి 300–350 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రైల్వేలైన్‌తోనూ అనుసంధానం ఇదే సమయంలో ఓర్వకల్లు పారిశ్రామికవాడను రైల్వేలైన్‌తో అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనలు పంపింది. ఓర్వకల్లు నుంచి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులకు తోడు రైల్వే కనెక్టివిటీ కూడా ఉండేలా కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి బనగానపల్లికి ఓర్వకల్లు మీదుగా రైలు మార్గాన్ని అనుసంధానం చేయడంతో పాటు దూపాడు రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ యార్డ్‌నూ నిర్మించాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది. -
కోవిడ్ కష్టాల్లో ‘తోడు’ నీడగా
సాక్షి, అమరావతి: కోవిడ్ అవస్థల నుంచి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా రెండున్నరేళ్లలో దాదాపు రూ.1.29 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో దాదాపు 82% మంది చిరు వ్యాపారులు కరోనాతో ఆదాయాన్ని కోల్పోయి కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు ఎదుర్కొన్నట్లు పలు నివేదికల్లో వెల్లడైందన్నారు. ఇటీవల డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా ఇవే అంశాలను చూశామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని అధిగమించి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు పారదర్శకంగా నేరుగా నగదు జమ చేసినట్లు చెప్పారు. పేదలను దేశంలో మిగతా రాష్ట్రాల కంటే మన ప్రభుత్వమే అక్కున చేర్చుకుందని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. జగనన్న తోడు పథకం మూడో విడత కింద పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు. మీ అన్నగా.. తమ్ముడిగా దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి చిరు వ్యాపారికీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. తాజా లబ్ధిదారులతో కలిపి ఇప్పటిదాకా 14,16,091 మందికి రూ.1,416 కోట్లు వడ్డీలేని రుణాలిచ్చి మంచి చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సంతోషంగా చెబుతున్నా. క్రమం తప్పకుండా వడ్డీ కట్టినవారందరికీ దాదాపు రూ.32.51 కోట్లు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించాం. అరకొర ఆదాయంతోనే స్వయం ఉపాధి నిజానికి ఈ వ్యాపారాలతో పెద్దగా ఆదాయాలు వచ్చే పరిస్థితులు కూడా లేవు. అయినప్పటికీ తమకు తాము ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి అది వ్యాపారం అనేకంటే మనకు అందిస్తున్న గొప్ప సేవ అనడం సమంజసం. రకరకాల వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్స్, కూరగాయలు, పండ్లు... తదితరాలను పుట్‌పాత్ మీద, తోపుడు బళ్ల మీద, రోడ్ల పక్కన, మోటార్ సైకిళ్ల మీద, ఇళ్ల వద్ద విక్రయించి పొట్ట పోసుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలైతే ఆకుకూరలను నెత్తిమీద గంపల్లో పెట్టుకుని అమ్ముతున్నారు. మనం చేస్తున్న ఈ సహాయం లక్షల మంది చిరు వ్యాపారులు సొంత కాళ్లమీద నిలిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ కష్టాలను దగ్గరగా చూశా.. చిరు వ్యాపారులు తమ పొట్ట పోసుకుంటూనే అనేకమందికి మేలు చేస్తున్నారు. సరుకులు రవాణా చేసే ఆటోల వారికి, మూటలు ఎత్తే కూలీలకు, మిగతా వారికి కూడా ఉపాధి కలిగే గొప్ప వ్యవస్ధ ఇది. చిరు వ్యాపారుల జీవితాలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దగ్గరగా చూశా. అసంఘటిత రంగం కావడంతో బ్యాంకు రుణాలు దక్కని పరిస్థితులను, కష్ట నష్టాలు, అవసరాలను చాలా దగ్గర నుంచి స్వయంగా చూశా. బ్యాంకు రుణాలిస్తే గ్యారంటీ ఎవరు ఇస్తారనేది పెద్ద మీమాంస. తోడుగా నిలబడాలనే జగనన్న తోడు... ఇటువంటి పరిస్థితుల్లో ఈ చిరువ్యాపారులకు తోడుగా నిలబడాలి.. వారికి మంచి జరగాలి.. అండగా ఉండాలనే ఆలోచనల నుంచి జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చాం. ప్రభుత్వమే పూచీకత్తు వహించి బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించాం. లబ్ధిదారులు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి తిరిగి రుణం పొందేలా ప్రోత్సహిస్తున్నాం. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించి రీయింబర్స్ చేసి తోడుగా నిలుస్తోంది. నడ్డి విరిచే వడ్డీలకు చెల్లు చిరు వ్యాపారులు రోజువారీ విక్రయాలు సాగించేందుకు ఇన్నాళ్లూ మరో మార్గం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. వంద రూపాయలు తీసుకుంటే సాయంత్రానికి రూ.10 వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. రూ.10 వడ్డీతో వ్యాపారాలు నిర్వహించాల్సిన దారుణ పరిస్థితుల్లో ఈ రంగం ఉండేది. ఆ దుస్థితిని తొలగించి చిరు వ్యాపారులందరికీ మంచి చేయాలనే సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇతర పథకాలతోనూ లబ్ధి జగనన్న తోడు ద్వారా 14.16 లక్షల మందికిపైగా మంచి జరుగుతోంది. అంతేకాదు వారికి జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణం, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలు లాంటి వాటిలో ఒక్కొక్కరికి కనీసం మూడు, నాలుగు పథకాల ద్వారా మేలు జరిగే ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే... వీటన్నింటి ద్వారా మార్పు రావాలి. వారి జీవితాలు మారాలి, మెరుగైన పరిస్థితుల్లో ఉండాలనే తపనతో చేస్తున్నాం. సంప్రదాయ చేతి వృత్తులవారికీ... చిరు వ్యాపారులను మాత్రమే కాకుండా, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణల తయారీదారులు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు తయారీదారులు, కళంకారీ, తోలుబొమ్మలు, లేస్ వర్కర్లు, కుమ్మర్లు.. ఇలా చేతివృత్తుల మీద ఆధారపడి జీవించేవారందరినీ కూడా జగనన్న తోడు పథకం కింద తీసుకొచ్చాం. వారికి కూడా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణమిచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. పొరపాటున ఎవరైనా మిగిలిపోతే ఇంకా ఎవరికైనా పొరపాటున రాకపోతే కంగారు పడొద్దు. గతంలోనే చెప్పినట్లు.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలి, అర్హులెవరూ మిస్ కాకూడదని ఆరాటపడే ప్రభుత్వం మనది. ఏ ఒక్కరికైనా పొరపాటున రాకపోతే వలంటీర్‌ని సంప్రదించండి. సచివాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోండి. జగనన్న తోడు పథకాన్ని సెర్ఫ్, మెప్మాల ద్వారా అమలు చేస్తున్నాం. నిరంతర పర్యవేక్షణ కోసం www.gramasachivalayam.ap.gov.in పోర్టల్ కూడా ఏర్పాటు చేశాం. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరువ్యాపారులకు స్మార్ట్ కార్డులు కూడా ఇచ్చాం. బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి రుణాలు ఇప్పించడం వరకు వలంటీర్లు పూర్తిగా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తారు. లబ్ధిదారులకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే 0891 2890525 నంబరుకు ఫోన్ చేస్తే అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు. ఒక్క విషయం మరువద్దు.. ఈ సందర్భంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప వ్యవస్ధను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వ్యవస్ధను నీరుగారనివ్వొద్దు. ఇది కనుక నీరుగారిపోతే... మనం తీసుకున్న రుణాలను మళ్లీ బ్యాంకులకు తిరిగి కట్టకపోతే వ్యవస్ధే కుప్పకూలిపోతుంది. కట్టిన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు మళ్లీ కచ్చితంగా రుణాలిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ మేరకు గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కూడా ఉంది. ఇదొక రివాల్వింగ్ ఫండ్ మాదిరిగా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి.. ఆ తర్వాత టైం ప్రకారం కట్టండి. అలా చేస్తే ప్రభుత్వమే మీరు కట్టిన వడ్డీ మొత్తాన్ని మీకు వెనక్కి తిరిగి ఇస్తుంది. వడ్డీ లేకుండా రుణం పొందే గొప్ప సౌకర్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం తిరిగి కట్టకపోతే బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. ఇంకా ఇతర లబ్ధిదారులకు మంచి జరిగే అవకాశాన్ని కూడా మనం అడ్డుకున్నట్లవుతుందని అందరూ గుర్తెరిగి మనసులో పెట్టుకోవాలని మీ కుటుంబ సభ్యుడిగా కోరుతున్నా. నిశ్చింతగా వ్యాపారాలు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి జగనన్న తోడు అమలు చేస్తుండటంతో 14 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. సెర్ప్, మెప్మా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సకాలంలో రుణాలు చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారు. చిరు వ్యాపారులు ఇప్పుడు హాయిగా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్న పరిస్ధితి రాష్ట్రంలో నెలకొంది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని మోడల్‌గా తీసుకుని పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు రెండు చోట్లా అమలు చేస్తోంది. ప్రభుత్వ తోడ్పాటుతో చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. – మంత్రి బొత్స సత్యనారాయణ తోడుతోపాటు ఇతర పథకాలు కూడా.. మా ఆయన ఫ్యాక్టరీలో కూలీ పనులకు వెళ్తుండగా నేను ఇంటిదగ్గర టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నా. గతంలో రూ.ఐదు, రూ.పది చొప్పున అప్పు చేసి తెచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోగా ఏమీ మిగిలేది కాదు. ఇక కరోనాతో అంత వడ్డీకి కూడా డబ్బులు దొరకలేదు. పెట్టుబడికి డబ్బుల్లేక వ్యాపారం నిలిపివేసిన సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ. ఆరు వేలు సంపాదిస్తున్నా. నాకు ఆసరా సాయం అందింది. సున్నా వడ్డీ వచ్చింది. గతంలో మాకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. ఇప్పుడు వలంటీర్లు అన్నీ తెచ్చి ఇచ్చారు. జగనన్న ఇంటి పట్టా కూడా వచ్చింది. మా నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మంచి చికిత్స అందింది. – సయ్యద్ రుబియా బేగం, లబ్ధిదారు, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా ఆ పేరు ఎవరు పెట్టారో కానీ.. మీరు ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ చెల్లించారు. నా భర్త తాపీ మేస్త్రి. పనులు లేక కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే పెట్టుబడికి డబ్బులు లేవు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తే రూ.10 వేలు తీసుకుంటే రూ.వెయ్యి వడ్డీ కింద ముందే మినహాయించుకుని రూ.తొమ్మిది వేలు ఇస్తానన్నాడు. ఆ సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్ చెప్పాడు. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ నెలకు రూ.5 వేల నుంచి పది వేలు సంపాదిస్తున్నా. మీరు మాకు ష్యూరిటీ లేకుండా డబ్బులు ఇప్పించారు. ఈ పథకానికి జగనన్న తోడు అని ఎవరు పేరు పెట్టారో కానీ మాకు మాత్రం ఎంతో తోడుగా ఉంది. ఆసరాతోపాటు వివిధ పథకాల ద్వారా కూడా మా కుటుంబం లబ్ధి పొందింది. – కె.కళ్యాణి, లబ్ధిదారు, రేఖవానిపాలెం, విశాఖ జిల్లా నాలుగు రెట్లు ఆదాయం మేం పండ్ల వ్యాపారం చేస్తాం. బయట అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుంటే రోజూ రూ.200 – రూ.300 మాత్రమే మిగిలేవి. జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఎంతో అండగా నిలుస్తోంది. బ్యాంకు ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం అందుతోంది. మీ ఆలోచనకు పాదాభివందనం. ఇప్పుడు రోజూ రూ.700 నుంచి రూ.800 సంపాదిస్తున్నాం. డిగ్రీ చదివినా పట్టుదలతో వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు సున్నా వడ్డీ అందింది. మా కుటుంబానికి చాలా పథకాలు అందాయి. – శారద, లబ్ధిదారు, రుద్రంపేట, అనంతపురం జిల్లా -
‘లీడ్స్’లో ఏపీకి తొమ్మిదో ర్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న సరుకు రవాణా పంపిణీ (లీడ్స్)–2021కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 3.17 స్కోర్ సాధించింది. తెలంగాణ మొత్తంగా 3.14 స్కోర్‌తో పదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు రహదారుల నాణ్యతలో 3.59, రైల్వే మౌలిక వసతులు నాణ్యతలో 3.26, మల్టీమోడల్ టెర్మినల్ నాణ్యతలో 3.38, గిడ్డంగుల నాణ్యతలో 3.27, యూనిమోడల్ టెర్మినల్ నాణ్యతలో 2.92, సరుకు రవాణా పంపిణీ నాణ్యతలో 3.55, సరుకు రవాణా పంపిణీ సేవలందించే సామర్థ్యంలో 3.50, సరుకు రోడ్డు రవాణా ధరల సహేతుకతలో 2.35, టెర్మినల్ సర్వీస్ ధరల సహేతుకతలో 2.47, కార్గో డెలివరీ రవాణాలో 3.48, మొబైల్, ఇంటర్నెట్ సర్వీస్‌లో 3.60 స్కోర్ లభించింది. అలాగే రవాణా సమయంలో సురక్షితం, భద్రతకు 3.61, టెర్మినళ్లల్లో సురక్షితం, భద్రతకు 3.78 స్కోర్ సాధించింది. కాగా, రాబోయే ఐదేళ్లలో సరుకు రవాణా ఖర్చులు ఐదు శాతం తగ్గుముఖం పట్టనున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. లీడ్స్ –2021 నివేదిక విడుదల సందర్భంగా సోమవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడారు. కాగా, లీడ్స్‌లో తొలి మూడు స్థానాలు.. గుజరాత్ , హరియాణా, పంజాబ్ దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి పరిశ్రమల భాగస్వాములు అందించిన సమాచారం, వారి సమస్య ఆధారంగా లీడ్స్ నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. -
రైల్ కార్గో రవాణాలో ‘త్రివేణి’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కార్గో రవాణాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో ఘనత సాధించింది. తక్కువ సమయంలో ఎక్కువ సరుకు రవాణా చేసేలా ఇటీవల మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒకే రైలుగా ‘త్రిశూల్’ పేరుతో విజయవంతంగా నడిపిన విజయవాడ డివిజన్ అధికారులు త్రివేణి మిషన్ పేరిట ఆదివారం నాలుగు అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపి మరో ఘనత సాధించారు. రెండేసి గూడ్స్ రైళ్లను జతచేసి 118 వ్యాగన్లు ఉన్న ఓ భారీ రైలుగా మలిచారు. ఆ విధంగా ఎనిమిది రైళ్లను నాలుగు భారీ రైళ్లుగా చేసి మూడు గమ్యస్థానాలకు కార్గో రవాణా చేశారు. వాటిలో ఒక రైలును విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా తాల్చేర్ వరకు 900 కిలోమీటర్లు నడిపారు. మరో గూడ్స్ రైలును కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లి మీదుగా కేశోరామ్ సిమెంట్ కంపెనీకి 645 కిలోమీటర్లు కార్గో రవాణా చేశారు. బీసీఎన్ రేక్స్ గల రెండు భారీ గూడ్స్ రైళ్లను విజయవాడ నుంచి కొండపల్లి వరకు నడిపారు. తద్వారా కార్గో రవాణా సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుకుని విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే గుర్తింపు పొందింది. రోలింగ్ స్టాక్ నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచింది. తద్వారా కార్గో రవాణా వేగం పెరగడంతోపాటు తక్కువ సమయంలో లోడింగ్/అన్లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఖాళీ అయిన వ్యాగన్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరతాయి. సిబ్బంది అవసరం తగ్గడంతోపాటు రైలు మార్గంలో రద్దీ తగ్గడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భారీ రైళ్లను సమర్థంగా నిర్వహించినందుకు విజయవాడ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. -
ఎక్స్‘పోర్ట్స్’ ఆదాయం అదరహో
సాక్షి, అమరావతి: గడచిన ఆర్థిక సంవత్సరంలో పోర్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం లభించింది. కరోనా కాలంలోనూ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆదాయాన్ని పొందగలిగింది. విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా.. కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈ ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది (2019–20)లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.226.82 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గంగవరం పోర్టు డివిడెండ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.37.61 కోట్లు ఇవ్వడం కూడా ఆదాయం పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. 2020–21లో ఈ ఐదు పోర్టులు 89.238 మిలియన్ టన్నుల సరకు రవాణా నిర్వహించడం ద్వారా రూ.3,556.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అంతకుముందు సంవత్సరం 99.44 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా 5 పోర్టులు రూ.3,639.81 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. కాకినాడ నుంచే 63 శాతం ఆదాయం రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం రాగా.. అందులో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ.179.73 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఒక్క కాకినాడ నుంచే 62.93 శాతం ఆదాయం వస్తోంది. కొత్తగా కాకినాడ గేట్‌వే పోర్టు అందుబాటులోకి వస్తే ఈ ఆదాయం మరింత పెరిగే అవకశాం ఉందని మారిటైమ్ అధికారులు పేర్కొంటున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు 14.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.575 కోట్ల ఆదాయం ఆర్జిస్తే అందులో ప్రభుత్వానికి రూ.126.50 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే పూర్తిగా 100 శాతం వాటా కలిగిన యాంకరేజ్ పోర్టు ద్వారా రూ.49.88 కోట్లు, రవ్వ క్యాపిటివ్ పోర్టు ద్వారా రూ.3.55 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చింది. ఇదే సమయంలో గంగవరం పోర్టు 32.83 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,056.46 కోట్ల ఆదాయం ఆర్జించగా.. ప్రభుత్వ వాటాగా రూ.59.8 కోట్లు (డివిడెండ్‌తో కలిపి) వచ్చింది. అలాగే కృష్ణపట్నం పోర్టు 38.18 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,871.93 కోట్ల ఆదాయం సమకూర్చుకోగా.. రాష్ట్ర ఖజానాకు రూ.46.07 కోట్లు వచ్చాయి. -
ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు
సాక్షి, విశాఖపట్నం: పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్టు రాబోయే మూడేళ్ల కాలంలో సరికొత్త సొబగులు అద్దుకోనుందని ట్రస్టు చైర్మన్ రామ్మోహన్రావు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీలు, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుందన్నారు. పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి.. దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. పోర్టు ట్రస్ట్ సమావేశ మందిరంలో శనివారం రామ్మోహన్రావు మీడియాతో మాట్లాడారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పోర్టు ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ► 2020–21లో కరోనాతో సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ 30.08 మి.టన్నుల దిగుమతులు, 38.73 మి.టన్నుల ఎగుమతులతో, 1.03 ట్రాన్షిప్తో మొత్తం 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశాం. దేశంలోని మేజర్ పోర్టుల్లో వరుసగా రెండో ఏడాది మూడో స్థానంలో నిలిచాం. మొత్తం రూ.606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అదేవిధంగా పోర్టు చరిత్రలో తొలిసారిగా ల్యాండ్ రెంట్స్ మార్చి నాటికల్లా ఖజానాకు చేరాయి. సుమారు 4 వేల ఎకరాలకు గాను రూ.435 కోట్ల అద్దెలు వసూలయ్యాయి. ► చైనాకు ఎగుమతి చేసిన ఐరన్ ఓర్, ఫినిష్డ్ స్టీల్‌తో పాటు గుజరాత్‌కు ఐరెన్ పెల్లెట్స్ ఎగుమతుల్లో వృద్ధి సాధించగా, స్టీమ్కోల్డ్, కుకింగ్ కోల్ రవాణా గణనీయంగా తగ్గాయి. 2019–20లో 2,099 నౌకలు పోర్టుకు రాగా 2020–21లో 2,040 నౌకలు వచ్చాయి. ► రైల్వే ద్వారా చేసిన కార్గో సరుకు రవాణాలో ఈ ఏడాది ఒక శాతం వృద్ధి సాధించాం. గతేడాది 32.13 మి.టన్నుల సరుకు (9,174 ర్యాక్స్) హ్యాండిల్ చేయగా ఈ ఏడాది అత్యధికంగా 32.35 మి.టన్నులు (9,635 ర్యాక్స్) హ్యాండిల్ చేశాం. ► పోర్టు జెట్టీల సామర్థ్యం పెరిగేలా ఆధునికీకరించడంతో పాటు జెట్టీల యాంత్రీకరణకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నాం. వెస్ట్‌క్యూ (డబ్ల్యూ.క్యూ)–7, డబ్ల్యూ.క్యూ–8 జెట్టీల సామర్థ్యాన్ని రూ.300 కోట్లతోనూ, రూ.150 కోట్లతో ఈక్యూ–7 జెట్టీ యాంత్రీకరణ పనులు నిర్వహిస్తున్నాం. ► చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్–1, ఓఆర్–2 బెర్తుల అభివృద్ధి పనులు కూడా రూ.168కోట్లతో చురుగ్గా సాగుతున్నాయి. ► కాలుష్య రహిత ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించేందుకు రూ.633.11 కోట్లతో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు డిసెంబర్ 2021 నాటికి పూర్తవుతాయి. ఇది పూర్తయితే.. 5.4 లక్షల కంటైనర్లు హ్యాండిల్ చేయవచ్చు. ► రూ.103 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నాం. అనుమతులు వచ్చిన ఏడాదిలోపే టెర్మినల్ పనులు పూర్తిచేసి క్రూయిజ్ టూరిజం కార్యకలాపాలు ప్రారంభిస్తాం. దీంతో సముద్ర విహారం విశాఖ వాసులకు చేరువవ్వడమే కాక అంతర్జాతీయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. ► ఏడాది కాలంగా అదానీకి కేటాయించిన టెర్మినల్‌లో కార్యకలాపాలు జరగకపోవడంతో పోర్టు ఆదాయం కోల్పోతోంది. ఇది ప్రస్తుతం ఆర్బిట్రేషన్‌లో ఉంది. విచారణ పూర్తయ్యాక ఆ టెర్మినల్‌ను పోర్టు ఆధీనంలోకి తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తాం. -
తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ఓడరేవుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులు
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసింది. ఏపీ మారిటైమ్ విజన్ 2030 పేరుతో వచ్చే తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ఓడరేవుల నిర్వహణ సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం 100 మిలియన్ టన్నులుగా ఉన్న ఓడరేవుల నిర్వహణ సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్వీ రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలి దశలో 2024 నాటికి సరుకు రవాణా సామర్థ్యం 200 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంగవరం, కాకినాడ, కృష్ణపట్నంలలో మూడు డీప్ వాటర్ పోర్టులు ఉండగా, అదనంగా మరో నాలుగు డీప్ వాటర్ పోర్టులు నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం చేపట్టనుండగా, కాకినాడ సెజ్ సమీపంలో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ మరో ఓడరేవును నిర్మించనుంది. మూడు ఎల్ఎన్జీ టెర్మినల్స్ రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయాన్నిచ్చే ఎల్ఎన్జీ టెర్మినల్స్ నిర్మాణానికి మారిటైమ్ బోర్డు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇందులో భాగంగా గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వద్ద ఎల్ఎన్జీ టెర్మినల్స్ ఏర్పాటు కోసం వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో ఇప్పటికే ఏజీ అండ్ పీ అనే సంస్థ రూ.1,000 కోట్లతో గంగవరం వద్ద 3 మిలిఠియన్ టన్నుల సామర్థ్యంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. కాకినాడ వద్ద హెచ్ ఎనర్జీ అనే సంస్థ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే 15 ఏళ్లలో రాష్ట్ర ఖజానాకు వ్యాట్ రూపంలో రూ.50,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. పర్యాటకం కోసం క్రూజ్ టెర్మినల్స్ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఆధారంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ తెలిపారు. క్రూజ్ టూరిజం (పెద్ద సంఖ్యలో పర్యాటకులను తీసుకెళ్లే) ద్వారా ఈ రేవులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో భీమిలి, కాకినాడల్లో క్రూజ్ టెర్మినల్స్ ఏర్పాటుకు మారిటైమ్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం
లక్నో: సరుకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసే విషయంలో, రైల్వేలను ఆధునీకరించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మౌలిక వసతుల కల్పనలో రాజకీయాలు వద్దని సూచించారు. ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో భాగంగా ‘న్యూ భావ్‌పూర్ – న్యూ ఖుర్జా’ మార్గాన్ని మంగళవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ మార్గంలో తొలి రవాణా రైలు ప్రారంభమైన సందర్భంగా ‘స్వావలంబ భారత్’ గర్జన స్పష్టంగా వినిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తాజా సదుపాయంతో రైతులు సరైన సమయంలో తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చగలరన్నారు. ఈ ఫ్రీట్ కారిడార్‌కు 2006లోనే అనుమతి లభించిందని, అయితే, అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిరాసక్తత కారణంగా అది పేపర్లపైననే మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘2014 వరకు ఒక్క కి.మీ. కూడా ట్రాక్ వేయలేదు. నిధులను వినియోగించలేదు. 2014లో మేం ప్రారంభించేనాటికి ప్రాజెక్టు ఖర్చు 11 రెట్లు పెరిగింది. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 1,100 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి’ అన్నారు. ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టులో మొత్తం 1,840 కి.మీ. మేర ప్రత్యేక ఫ్రీట్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇది పంజాబ్‌లోని లూథియానా నుంచి కోల్‌కతా వరకు ఉంటుంది. -
వస్తు రవాణాలో ‘ఈ–వే’ దూకుడు
సాక్షి, అమరావతి: దేశంలో ‘ఈ–వే’ బిల్లింగ్ సంఖ్య క్రమేపీ పెరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 131 కోట్ల ఈ–వే బిల్లులు జారీ అయ్యాయని, ఇందులో 40 శాతం అంతర్ రాష్ట్ర వస్తు రవాణాకు సంబంధించినవేనని పేర్కొన్నారు. ఫిబ్రవరి 29న ఒకే రోజు 25,19,208 ఈ–వే బిల్లులు జారీ అయినట్టు వివరించారు. నిర్మలా సీతారామన్ తన ట్వీట్ ద్వారా ఇంకా చెప్పారంటే.. వడ్డీ రేట్ల తగ్గింపు.. లేట్ ఫీజుల ఎత్తివేత ► కోవిడ్ తర్వాత పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించేలా సడలింపులిచ్చాం. వాయిదా విధానంలో చెల్లింపులు, వడ్డీ రేట్ల తగ్గింపు, లేట్ ఫీజులు ఎత్తివేత, కొన్ని కేసుల్లో లేటు ఫీజును రూ.500కి పరిమితం చేశాం. రూ.5 కోట్ల వరకు టర్నోవర్ గల చిన్న పన్ను చెల్లింపుదారులు 2020 సెప్టెంబర్ 30 లోగా జీఎస్టీ ఆర్–3బీ రిటర్న్ దాఖలుకు లేట్ ఫైలింగ్‌పై వడ్డీ సగానికి తగ్గించి 9%గా ప్రకటించాం. ► చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో జీఎస్టీ వార్షిక రిటర్నుల విధానాన్ని సరళీకృతం చేశాం. ► 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు రూ.2 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు రిటర్న్స్‌దాఖలును ఆప్షనల్ చేశాం. ► రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ సౌకర్యం ద్వారా ‘నిల్’ రిటరŠన్స్ దాఖలు చేసే విధానం ప్రవేశ పెట్టబడింది. దీనివల్ల సుమారు 22 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ► 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి కాంపోజిషన్ స్కీమ్‌ను రూ.50 లక్షలకు విస్తరించడమే కాకుండా ఈ స్కీమ్ వర్తించే పన్ను చెల్లింపుదారులు 3 నెలలకు ఒకసారి కాకుండా ఏడాదికి ఒకసారే రిటర్నులు దాఖలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. -
ఆర్టీసీ కొత్త రూటు
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ కొత్త బాట వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే అద్దె బస్సులను నడుపుతున్న ఆర్టీసీ ఇక మీదట అద్దె లారీలను నడపాలని యోచిస్తోంది. వీటిని సరుకు రవాణాకు వినియోగించనుంది. ఆర్టీసీ పార్శిల్ సేవల్లో ఇప్పటికే గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అద్దెకు లారీలను తీసుకుని కార్గో సేవలను విస్త్రతం చేయడం ద్వారా మరింత ఆదాయం ఆర్జించవచ్చని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ఒక్కో డిపోకు 10వరకు అద్దె లారీలను నడపాలనే యోచనలో ఉంది. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో పాసింజర్ బస్సులను సరుకు రవాణాకు వీలుగా మార్చారు. ఇలా విజయవాడ రీజియన్‌లో మార్చిన 80కి పైగా బస్సుల ద్వారా నిత్యావసర సరుకులు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, కూరగాయలు వంటివి రవాణా చేస్తున్నారు. ఇంకా మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కూడా తరలిస్తున్నారు. -
సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నడిచే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసి వెళ్లే ఖాళీ వాహనాలకు పాస్‌లు అవసరం లేదని హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఏప్రిల్ 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధన 12(1), నిబంధన 12(6)లపై స్పష్టత ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసిన వాహనాలను పాస్‌ల పేరిట అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు లు వచ్చాయని, వీటికి పాస్‌లు అవసరం లేదని, డ్రైవర్‌కు లైసెన్స్ ఉంటే చాలునని తేల్చి చెప్పింది. దేశంలో వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఈ ఆదేశాలు పాటించేలా సూచనలు జారీ చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు పంపే విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వీరిని రోడ్డు మార్గంలో శానిటైజ్ చేసిన వాహనాల్లో తరలించాలని తెలిపింది. సంబంధిత రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని సూచించింది. -
చెక్‌పోస్టుల్లో డ్రైవర్లకు థర్మల్ స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే సరుకు రవాణా వాహనాల డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు రవాణా అధికారులను ఆదేశించారు. థర్మల్ స్కానింగ్ యంత్రంతో పరీక్షించాలని సూచించారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలుంటే వెంటనే వైద్య శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ► సరుకులు రవాణా చేసే డ్రైవర్లకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేప«థ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. ► రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లకు థర్మల్ స్కానింగ్ యంత్రాలను పంపించారు. ► వీటితో పాటు మాస్క్‌లు, శానిటైజర్లను రవాణా సిబ్బందికి అందించారు. ► సరుకు రవాణా చేసే డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని, జాతీయ రహదార్లపై దాబాలలో వారికి ఆహారం అందేలా చూడాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
సరుకుల కొరతపై మేల్కొనండి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ఉత్పత్తి తగ్గడం, సరుకు రవాణాలో ఆటంకాలు, కార్మికుల కొరత, గోదాముల మూత కారణంగా సరుకుల కొరత తీవ్రమవుతోంది. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, స్టోర్స్, కిరాణా దుకాణాలకు సరుకు రవాణా గొలుసు (సప్లయ్ చెయిన్) తెగిపోవడంతో స రుకుల లభ్యత తగ్గింది. ఈ దృష్ట్యా నిత్యావసరాలపై దృష్టిపెట్టిన కేంద్రం ఆహార ఉ త్పత్తులు, రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చింది. వాటి ధరలను కట్టడి చేసేలా తక్షణ చర్య లు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. 50 శాతం కొనలేకపోయారు.. నిత్యావసర వస్తువుల లభ్యతను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. పెద్దసంఖ్యలో విని యోగదారులు తమ వస్తువులను ఆఫ్‌లైన్, ఆన్లై న్లో పొందలేకపోతున్నారని తాజా సర్వే వెల్లడిం చింది. స్థానిక కిరాణా దుకాణాల ద్వారా నిత్యావసరాలను 35 శాతం కొనలేకపోయారని, ఈ–కామర్స్ సంస్థలైన అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమా టో వంటి ఆన్లైన్ సంస్థల ద్వారా నిత్యావసరా లు కొనలేని వినియోగదారులు 50 శాతం వరకు ఉన్నారంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారా ల మంత్రిత్వశాఖ, సోషల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం సంయుక్తంగా 16వేల మంది వినియోగదారుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. ఆన్లైన్ ద్వారా గోధుమలు, బియ్యం, పప్పు ధా న్యాలు, ఉప్పు, చక్కెర వంటి సరుకుల్లోనూ 39 శాతం మంది మాత్రమే పూర్తి వస్తువులు పొందగలి గారని, మిగతా వారిలో కొందరికి కొన్ని వస్తువులు దొరకగా, చాలామందికి అవసరమైన సరుకులు లభించలేదంది. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకత్వం.. మిల్లులు, గిర్నీలు పనిచేయకపోవడంతో గోధుమ, శనగ, జొన్న పిండ్ల లభ్యత తగ్గింది. దీంతో వీటి ధరలు పెరిగాయి. గోధుమ పిండి ధర రూ.10 మేర పెరిగి రూ.36కి చేరింది. మహారాష్ట్ర నుంచి చక్కెర దిగుమతులు తగ్గడంతో దాని ధర కూడా బాగా పెరిగింది. కార్మికుల కొరతతో ప్యాకేజ్డ్ ఆహార వస్తువుల సరఫరా డిమాండ్‌కు తగ్గట్లు మార్కెట్లో కనబడట్లేదు. ముఖ్యంగా బిస్కెట్స్, బ్రెడ్, స్నాక్స్, సబ్బులు, షాంపూలు, రవ్వ, నూనెలు వంటి వాటి సరఫరా అటు కిరాణాలకు, సూపర్ మార్కెట్లకు త క్కువగా ఉందని వర్తకులు చెబుతున్నారు. ఈ దృ ష్ట్యా, సరుకుల సరఫరా గొలుసు రవాణాకు ఎక్క డా ఇక్కట్లు రాకుండా చూడాలని రాష్ట్రాలను కేం ద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. రాష్ట్రీ యంగా, అంతర్రాష్ట్రాల నుంచి నిత్యావసరాలను రవాణా చేసే కార్గో సర్వీసులు, ట్రక్కులు, కా ర్మికులు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు సజా వుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు. హెల్ప్ లైన్ నంబరు.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తుల రవాణాకు ఇబ్బందులు లేకుండా.. పోలీసు శాఖ 04023434343 నంబరుతో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సమస్యలు ఎదురైతే పరిష్కరించేలా చర్యలు తీసుకుంది. -
సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
సాక్షి, విశాఖపట్నం: సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టుట్రస్ట్ నూతన అధ్యాయం నెలకొల్పిందని పోర్టు చైర్మన్ కె.రామ్మోహనరావు, డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరనాథ్ తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిందని, 86 ఏళ్లలో ఈ స్థాయిలో సరుకు రవాణా చేయడం ఇదే ప్రథమమన్నారు. గత ఏడాది కన్నా ఇది 7.42 మిలియన్ మెట్రిక్ టన్నులు అధికంగా రవాణా చేసి 11.50 శాతం వృద్ధి రేటును సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేటు పోర్టుల నుంచి గట్టి పోటీ, ఆర్థిక మాంద్యం, కోవిడ్ 19 విపత్తు వల్ల కలిగిన ఎగుమతి, దిగుమతి ప్రతికూల పరిస్థితులను అధిగమించి రికార్డు స్థాయిలో సరుకు రవాణా జరగడం విశేషమన్నారు. విశాఖ పోర్టు అవలంబిస్తున్న వ్యూహాత్మక వ్యాపార విధానాల వల్ల నేపాల్ ప్రభుత్వం విశాఖ పోర్టును ప్రధాన పోర్టుగా ఎంపిక చేసుకుందని చెప్పారు. గత ఏడాది నేపాల్ 16,292 కంటెయినర్లు హ్యాండిల్ చేయగా, ఈ ఏడాది 161 శాతం వృద్ధి రేటుతో 42,250 కంటెయినర్లను రవాణా చేసిందని వెల్లడించారు. వినియోగదారులకు రాయితీ కల్పించడం, యాంత్రీకరణ, షిప్ టర్న్‌ఎరౌండ్ సమయాన్ని తగ్గించడం వంటి మౌలిక సదుపాయాల కల్పన వల్ల వినియోగదారుల నిర్వహణ వ్యయాన్ని చాలా వరకూ తగ్గించామన్నారు. ఇంతటి చరిత్రాత్మక విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాన్ని అంకితమిస్తున్నామని పేర్కొన్నారు. -
రేపు దేశవ్యాప్తంగా లారీల బంద్
సాక్షి, అమరావతి బ్యూరో: లారీ ఇండస్ట్రీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేలా కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ జరిమానాలకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా లారీల సమ్మెకు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సవరించిన భారత మోటారు వాహన చట్టం–2019 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దూరప్రాంతాలకు తిరిగే లారీలపై పెను భారం మోపింది. దీని ప్రకారం చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పలు రాష్ట్రాల్లో రూ. 30 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానాలు విధిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అసలే సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు ఈ కొత్త చట్టం పెను నష్టాన్ని తెచ్చి పెడుతోందని లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. దక్షిణాదితో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ జరిమానాలు అమలు చేయకపోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారు. కానీ ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు జరిమానాల బాదుడు అధికంగా ఉంటోందని లారీ యజమానులు చెబుతున్నారు. బీమా ప్రీమియం, జీఎస్టీ వంటివి లారీ పరిశ్రమను కుదేలు చేస్తున్నాయని అంటున్నారు. లారీ పరిశ్రమను కాపాడుకోవాలంటే రానున్న ఆరు నెలల పాటు కొత్త లారీలు కొనుగోలు చేయరాదని ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ లారీ యజమానులను కోరుతోంది. రాష్ట్ర అసోసియేషన్ మద్దతు లారీల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల అసోషియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు లారీలు వెళ్లకుండా నిలువరిస్తామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల లారీలుండగా వీటిలో నాలుగో వంతు మాత్రమే సరకు రవాణాలో ఉన్నాయి. స్థానికంగా తిరిగే లారీలపై సమ్మె ప్రభావం ఉండదని, అందువల్ల సరుకు రవాణా పాక్షికంగా నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. చమురు, పాలు వంటి అత్యవసర సరుకుల రవాణా లారీలకు సమ్మె నుంచి మినహాయింపునిచ్చారు. లారీ యజమానుల ప్రధాన డిమాండ్లు - లారీ పరిశ్రమను తేరుకోలేకుండా చేసే ఎంవీ యాక్టు–2019 బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలి. - రవాణా వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని పెంచరాదు. దీనిపై ఉన్న జీఎస్టీని మినహాయించాలి. - కొత్త/పాత వాహనాల కొనుగోలుపై జీఎస్టీని తగ్గించాలి. - రవాణా రంగంలో ఏటా రూ. కోటి నగదు విత్‌డ్రాపై 2 శాతం వసూలు నిలిపివేయాలి. -
సరుకు రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లారీలకు సంబంధించిన సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సమావేశమైందని, వారంలో మరోసారి సమావేశమై సింగిల్ పర్మిట్‌పై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం కమిటీ ఏపీకి వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ పర్మిట్‌కు సంబంధించి గతంలో ఏపీ అధికారులతో కమి టీ జరిపిన చర్చలు సఫలం కాలేదని చెప్పారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధిక వేగం, పరిమితికి మించి సరుకు రవాణా చేసే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్లు, రైతుబజార్లలో సరుకు దింపే సమయంలో లారీల డ్రైవర్లను వేధించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లు, కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. -
ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లు అమలు
న్యూడిల్లీ: అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఎలక్ట్రానిక్–వే బిల్లును వచ్చే నెల 1 నుంచి తప్పనిసరి చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని భావించామనీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడిందని జైట్లీ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న రిటర్నుల విధానాన్నే జూన్ వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, అంతర్రాష్ట్ర రవాణా కోసం ఈ–వే బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరి 1నే అమలు చేయగా ఆ వ్యవస్థలో లోపాలు తలెత్తి సరిగ్గా పనిచేయకపోవడం తెలిసిందే. దీంతో తప్పులను సరిదిద్ది అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లులను మళ్లీ తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఒకే రాష్ట్రంలో రవాణాకు కూడా ఈ–వే బిల్లులను దశల వారీగా తప్పనిసరిచేస్తామనీ, ఇందుకోసం రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజిస్తామని జైట్లీ తెలిపారు. జూన్ 1 నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ–వే బిల్లుల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఏప్రిల్ 15న తొలిదశను అమలు చేస్తామనీ, ఆ రాష్ట్రాలేవో ఏప్రిల్ 7న ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎగుమతిదారులకు జీఎస్టీ కింద రీఫండ్లు చెల్లించేందుకు ఈ–వాలెట్‌ను అక్టోబరు 1 నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
లాభాల బాటలో.. కూ చుక్ చుక్
ప్రగతి పథంలో దక్షిణ మధ్య రైల్వే - గతేడాది కంటే ఈ సారి 11.9 శాతం అధిక లాభాలు - 3.4 శాతం పెరిగిన ప్రయాణికులు.. సరుకు రవాణాలోనూ ముందంజ సాక్షి, హైదరాబాద్: రోడ్డు రవాణా రంగం, ప్రైవేట్ వాహనాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ దక్షిణమధ్య రైల్వే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి అదే కాలానికి 11.9 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి రూ.3,860.16 కోట్ల ఆదాయం లభించగా... ఈ ఏడాది రూ.4,319.96 కోట్లు వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సరుకు రవాణా రంగంలోనూ ఈ ఏడాది దక్షిణమధ్య రైల్వే మంచి పురోగతిని సాధించింది. ప్రయాణికులకు సదుపాయాల కల్పనలో, పర్యావరణ పరిరక్షణలో, స్వచ్ఛభారత్ నిర్మాణంలో దేశంలోని మిగిలిన రైల్వేల కంటే అగ్రభాగాన నిలిచింది. పెరిగిన ప్రయాణికులు... తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా రంగం నుంచి రైల్వే గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ దక్షిణమధ్య రైల్వే ఈ పోటీని అధిగమించి గతేడాది కంటే రైల్వే ప్రయాణికుల సంఖ్యను 3.4 శాతం పెంచుకోగలిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 12.64 కోట్ల మంది పయనించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13.7 కోట్లకు పెరిగింది. మొత్తం జోన్‌లోని 6 డివిజన్ల పరిధిలో రోజూ సగటున 745 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సరుకు రవాణాలో... నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ సరుకు రవాణాలో దక్షిణమధ్య రైల్వే తన స్థానాన్ని కాపాడుకుంది. గతేడాది కంటే అధికంగా రవాణా చేసి పురోగతి సాధించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలకు 29 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 33 మిలియన్ టన్నులకు చేరుకుంది. తద్వారా రూ.2814.04 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ.2470 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. సదుపాయాలలో... ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలోనూ మిగతా జోన్ల కంటే ముందంజలో నిలిచింది. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రకటించిన స్వచ్ఛతా అవార్డులలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రథమ స్థానంలో నిలవడటమే ఇందుకు నిదర్శనం. సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ప్రయాణికులకు మరింత చేరువైంది. ప్రయాణికుల ¿ý ద్రత కోసం ప్రవేశపెట్టిన ‘నిర్భయ’వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో అమలు చేసిన ‘రిస్తా’మొబైల్ యాప్ వల్ల చాలామంది మహిళలు ఈవ్ టీజింగ్‌లను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగారు. అలాగే... ఈ సంవత్సరం ఇప్పటి వరకు 82 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలను వేయగా, మరో 443 కిలోమీటర్లను విద్యుదీకరించారు. -
క్లిక్ దూరంలో సరుకు రవాణా..
• దేశంలో విస్తరిస్తున్న అగ్రిగేటర్లు • తక్కువ రేట్లకే రవాణా సేవలు • వ్యవస్థీకృతం అవుతున్న పరిశ్రమ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ తను విక్రయించే వస్తువుల్లో దేన్నీ తను తయారు చేయదు. అలా తయారుచేసి... విక్రయించేవాళ్లందరినీ కలుపుతుంది. క్యాబ్ రవాణా సంస్థ ఉబెర్‌కు... సొంత కార్లేమీ లేవు. కార్లుండి వాటిని ట్యాక్సీలుగా నడిపేవారిని, డ్రైవర్లచేత నడిపించే వారిని టెక్నాలజీతో కలుపుతుంది. ఇవేకాదు. రియల్ ఎస్టేట్, ఆరోగ్య పరీక్షలు, వార్తలు, రవాణా... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా అగ్రిగేటర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. అవసరం ఉన్నవాళ్లని... ఆ అవసరం తీర్చేవాళ్లని కలిపేవే ఈ అగ్రిగేటర్లు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది అగ్రిగేటర్ల రాజ్యం. వాటి దగ్గర భౌతిక ఆస్తులుండవు. టెక్నాలజీ మాత్రమే ఉంటుంది. ఇపుడు సరకు రవాణాలో ఈ ట్రెండ్ బాగా పెరుగుతోంది. దేశంలో సరకు రవాణా రంగంలో ఏటా రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీటిలో టాప్–10 ట్రాన్స్పోర్ట్ కంపెనీల వాటా 2 శాతంలోపే. చాలావరకూ అవ్యవస్థీకృతంగానే ఉండటంతో మధ్యవర్తులదే రాజ్యం. పైపెచ్చు లావాదేవీలన్నీ నగదు రూపంలోనే. వాహనంపై యజమానికి నియంత్రణ ఉండటం లేక డ్రైవర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. సరుకు క్షేమంగా గమ్యం చేరడం ఒక ఎత్తైతే.. రవాణా డబ్బులు చేతికందే వరకు సగటు యజమానుల తిప్పలు అన్నీఇన్నీ కావు. ఈ మధ్యవర్తులకు అడ్డుకట్ట వేసి... అంతా పారదర్శకంగా నిర్వహించటానికి టెక్నాలజీ ఆసరాగా అగ్రిగేటర్లు రంగంలోకి దిగుతున్నారు. పెద్ద పెద్ద సంస్థలతో పాటు కార్పొరేట్ దిగ్గజాలూ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ అగ్రిగేటర్లు ఏం చేస్తాయంటే... ఫోర్టిగో, ట్రక్ సువిధ, ట్రక్ మండి, ఫ్రెయిట్ బజార్, స్మార్ట్‌షిఫ్ట్, ఆటో లోడ్, ఫ్రెయిట్ టైగర్, మూవో, ట్రక్కీ, బ్లాక్‌బక్, గోగో ట్రక్, కార్గో ఎక్సే్చంజ్, రిటర్న్ట్రక్స్.కామ్ వంటివన్నీ సరకు రవాణా ఆగ్రిగేటర్లే. ఒక్కొక్కరిదీ ఒకో వ్యూహం. వాహనంలో పూర్తిగా సరుకు నింపకపోయినా... ఇతర కస్టమర్ల సరుకుల్ని కూడా కలిపి రవాణా చేస్తుంటాయివి. వీటిని ఆశ్రయించిన వినియోగదారులకు 10–20 శాతం తక్కువ ధరకే సేవలందుతున్నాయి. సాధారణంగా ఆఫ్‌లైన్‌లో వాహన యజమానులు రానూపోనూ ఛార్జీల్ని ఒకేసారి వసూలు చేస్తుంటారు. అగ్రిగేటర్ల రాకతో ఆ పరిస్థితి లేదు. ఒకవైపుకే వసూలు చేస్తున్నారు కూడా. వాహనం ఎటు వెళుతోందో తెలుసుకునేందుకు జీపీఎస్... రియల్ టైమ్ ఇన్వాయిస్... శిక్షణ పొందిన డ్రైవర్లు ఇలా పలు సంస్థలు ప్రత్యేకమైన సేవలందిస్తున్నాయి. వాహన యజమానులకు రుణాలూ ఇప్పిస్తున్నాయి. వాహనం దారి మధ్యలో నిలిచిపోతే వెంటనే మరో వాహనంలో సరుకును తరలించటం కూడా చేస్తున్నారు. ‘‘సరుకు రవాణాలో వచ్చే మూడేళ్లలో మెజారిటీ వాటా వ్యవస్థీకృతమవుతుంది’’ అని ఫోర్టిగో సహ వ్యవస్థాపకులు వివేక్ మల్హోత్రా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తాము పూర్తిగా క్యాష్‌లెస్ లావాదేవీలే చేస్తున్నామన్నారు. ‘‘వాహనాల ట్రాకింగ్ ఉండాలని మా కస్టమర్లు అడుగుతున్నారు. గ్యారం టీ చెల్లింపులు, రవాణాకు హామీ ఉంటోంది కనక మాతో ట్రాన్స్పోర్టర్లు చేతులు కలుపుతున్నారు’’ అని వివరించారాయన. పనితీరులో పారదర్శకత... సరుకు రవాణా చేయదల్చుకున్నవారు అగ్రిగేటర్ వెబ్సైట్ లేదా యాప్‌లో సమాచారాన్ని పోస్ట్ చేయాలి. సరుకు రకం, బరువు, దూరాన్నిబట్టి వాహన యజమానులు చార్జీ చెబుతారు. ఇద్దరికీ సమ్మతమైతే డీల్ కుదురుతుంది. అగ్రిగేటర్లు వాహన యజమాని నుంచిగానీ, కస్టమర్ నుంచి గానీ... కొందరైతే ఇద్దరి నుంచీ కొంత కమిషన్ వసూలు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం వాహనాలు రోడ్డెక్కుతాయి కనక అదనపు ట్రిప్పులకు ఆస్కారముంటుంది. ‘సరుకు రవాణాకు ఎక్కువ ధర చెల్లిస్తున్న కస్టమర్లూ ఉన్నారు. డిమాండ్ ఎక్కడ ఉందో తెలియక వాహనాలు ఖాళీగా ఉండే సందర్భాలూ ఉన్నాయి. వ్యాపారులను, వాహన యజమానులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం’ అని స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య నందకుమార్ తెలిపారు. వాహన యజమానుల ఆదాయం భారీగా పెరిగింది. లెండింగ్‌కార్ట్ ద్వారా వారికి రుణం ఇప్పిస్తున్నామని చెప్పారు. మహీంద్రా గ్రూప్ స్మార్ట్‌షిఫ్ట్ సీడ్ ఇన్వెస్టర్‌గా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్కులు : 25 లక్షలు 1–5 ట్రక్కులున్నవారు : 80 శాతం 20 కన్నా ఎక్కువ ట్రక్కులున్న వారు : 10 శాతం 5– 20 ట్రక్కులున్న వారు : 10 శాతం తేలికపాటి రవాణా వాహనాలు : 20 లక్షలపైనే -
స్మార్ట్‌గా సరుకు షిఫ్ట్...
♦ క్లిక్ దూరంలో చిన్న వాణిజ్య వాహనాలు ♦ సరుకు రవాణా ఇక మరింత సులువు ♦ సాక్షితో స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చిన్న వాణిజ్య వాహనం అద్దెకు కావాలంటే సమీపంలో ఉన్న అడ్డాకు వెళ్లాల్సిందే. డ్రైవర్ చెప్పిన రేటుకు ఓకే చెప్పాల్సిన పరిస్థితి. లేదా మరో వాహనాన్ని వెతుక్కోవాలి. సొంత వెహికల్ లేని చిన్న వ్యాపారులకు ఇది అతిపెద్ద సమస్య. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎస్ఎంఈలను, ట్రాన్స్పోర్టర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్మార్ట్‌షిఫ్ట్. సరుకు రవాణాకు చిన్న వాణిజ్య వాహనం కావాల్సి వస్తే స్మార్ట్‌ఫోన్‌లో ఒక క్లిక్ చేస్తే చాలు. నిమిషాల్లో వాహనం ప్రత్యక్షమవుతుంది. ఇక రవాణా చార్జీ అంటారా.. ఎంచక్కా డ్రైవర్‌తో బేరమాడుకోవచ్చు. వెహికల్‌ను ట్రాక్ చేయవచ్చు కూడా. అటు వాహన యజమానులకూ అదనపు వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నామని స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య నందకుమార్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. స్మార్ట్‌షిఫ్ట్ ఇలా పనిచేస్తుంది.. వ్యాపారులు ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో స్మార్ట్‌షిఫ్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. సరుకును ఎక్కడికి రవాణా చేయాలో నిర్దేశించాలి. సరుకు రకం, దూరం, వాహనం మోడల్‌నుబట్టి చార్జీ ఎంతనో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంతకంటే తక్కువ చార్జీకే వాహనం కావాలంటే.. వ్యాపారి తనకు నచ్చిన ధరను కోట్ చేయవచ్చు. ఈ వివరాలతో వ్యాపారి ఉండే ప్రదేశానికి సమీపంలో ఉన్న 10 మంది డ్రైవర్లకు సందేశం వెళ్తుంది. డ్రైవర్ల వద్ద బేసిక్ ఫోన్ ఉన్నా ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సమాచారం చేరవేస్తారు. చార్జీ నచ్చితే డ్రైవర్ ఓకే చెప్పొచ్చు. లేదా ఎక్కువ చార్జీ డిమాండ్ చేయవచ్చు. ఇరువురికీ ఆమోదయోగ్యం అయితే డీల్ కుదురుతుంది. ఇందుకు డ్రైవర్ల నుంచి కొంత కమీషన్‌ను కంపెనీ వసూలు చేస్తుంది. హైదరాబాద్‌తోపాటు ముంబైలో సేవలందిస్తున్న స్మార్ట్‌షిఫ్ట్‌కు 3,000 మందికిపైగా వ్యాపారులు కస్టమర్లుగా ఉన్నారు. 1,200 మందికిపైగా వాహనాలు నమోదయ్యాయి. డ్రైవర్లకు అదనపు ఆదాయం..: రవాణాకు ఎక్కువ ధర చెల్లిస్తున్న వ్యాపారులూ ఉన్నారు. డిమాండ్ ఎక్కడ ఉందో తెలియక వాహనాలు ఖాళీగా ఉండే సందర్భాలూ ఉన్నాయి. వ్యాపారులను, వాహన యజమానులను ఒకే వేదికపైకి తీసుకురావడమే మా పని అని కౌసల్య నందకుమార్ తెలిపారు. రవాణా చార్జీలు ఇరువురికీ ఆమోదయోగ్యంగా ఉండడం తమ సేవల ప్రత్యేకత అని ఆమె వివరించారు. ‘వాహన యజమానుల ఆదాయం గణనీయంగా పెరిగింది. సరుకు రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నాం. లెండింగ్‌కార్ట్ ద్వారా వ్యాపారులకు రుణం ఇప్పిస్తున్నాం’ అని తెలిపారు. మహీంద్రా గ్రూప్ స్మార్ట్‌షిఫ్ట్ సీడ్ ఇన్వెస్టర్‌గా ఉందని చెప్పారు. కంపెనీ విస్తరణకు గ్రూప్ పూర్తి సహకారం అందిస్తోందన్నారు.