
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే సరుకు రవాణా వాహనాల డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు రవాణా అధికారులను ఆదేశించారు. థర్మల్ స్కానింగ్ యంత్రంతో పరీక్షించాలని సూచించారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలుంటే వెంటనే వైద్య శాఖకు సమాచారం అందించాలని సూచించారు.
► సరుకులు రవాణా చేసే డ్రైవర్లకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేప«థ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది.
► రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు థర్మల్ స్కానింగ్ యంత్రాలను పంపించారు.
► వీటితో పాటు మాస్క్‌లు, శానిటైజర్లను రవాణా సిబ్బందికి అందించారు.
► సరుకు రవాణా చేసే డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని, జాతీయ రహదార్లపై దాబాలలో వారికి ఆహారం అందేలా చూడాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment