
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లారీలకు సంబంధించిన సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సమావేశమైందని, వారంలో మరోసారి సమావేశమై సింగిల్ పర్మిట్‌పై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం కమిటీ ఏపీకి వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ పర్మిట్‌కు సంబంధించి గతంలో ఏపీ అధికారులతో కమి టీ జరిపిన చర్చలు సఫలం కాలేదని చెప్పారు.
బుధవారం సచివాలయంలో రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధిక వేగం, పరిమితికి మించి సరుకు రవాణా చేసే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్లు, రైతుబజార్లలో సరుకు దింపే సమయంలో లారీల డ్రైవర్లను వేధించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లు, కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment