సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు కూడా ఈఎస్‌ఐ, పీఎఫ్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం ప్రతినిధులు తిరుపతిరెడ్డి, రాజు, ఇతర సభ్యులు మంత్రిని కలసి తమ సమస్యలు పరిష్క రించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భవిష్య త్తులో ఆర్టీసీలో డ్రైవర్ల నియామకం చేపట్టేప్పుడు అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడిం చారు. ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో అద్దె బస్సుల సంఖ్య ఎక్కువగా ఉందని, వీటిని నియంత్రించేందుకు ఆ బస్సుల డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment