సాక్షి, బెంగళూరు : ప్రజలకు చౌకధరల్లో నిత్యావసర వస్తువులను సరఫరా చేసే రేషన్ షాపుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కాగేరి తీవ్ర విమర్శలు చేశారు. విధానసౌధలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌకధరల దుకాణాల పనితీరు, లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలు పర్యవేక్షించేవన్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌షాపుల పర్యవేక్షణకు ‘జాగృతి సమితి’లను ఏర్పాటు చేసి అందులోని సభ్యుల ఎంపిక జిల్లా ఇన్‌ఛార్జ్‌మంత్రులకు అప్పగించిందన్నారు.
జిల్లా ఇన్‌ఛార్జ్‌మంత్రులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే ఉంటారని అందువల్ల ‘జాగృతి సమితి’ సభ్యుల్లో గరిష్టంగా కాంగ్రెస్ కార్యకర్తలకే స్థానం దక్కుతుందన్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది కాంగ్రెస్ వ్యూహమన్నారు. అదేవిధంగా ‘కళాశాల అభివృద్ధి సమితి’ సభ్యుల ఎంపిక కూడా జిల్లా ఇన్‌ఛార్జ్‌మంత్రుల సిఫార్సుల మేరకు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్య మూలసూత్రాలైన అధికారిక వికేంద్రీకరణ, స్థానిక సంస్థలకే నిర్ణాయాధికారాలు అనే విషయాలు వ ురుగున పడిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మన రత్నాకర్‌తో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలల భవనాల మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాల పెంపునకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,000 కోట్లకు గండిపడిందన్నారు. దీనివల్లే బోధన పరికరాల తయారీ కోసం ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.500లకు కూడా ప్రభుత్వం కోత విధించిందన్నారు. ఎటువ ంటి ముందస్తు ఆలోచనలు లేకుండానే క్షీరభాగ్య, అక్షర దాసోహ పథకంలో ఒకరోజు గోధుమ సంబంధ పదార్థాలను విద్యార్థులకు ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
పాలు కాచడానికికాని, గోధుమ పిండి, రవ్వ చేసి వాటి ద్వారా పదార్థాలు తయారు చేయడానికి కాని అవసరమైన పరికరాలు పాఠశాలకు అందించలేదన్నారు. దీని వల్ల లక్ష్యం నేరవేరడం లేదని కాగేరి వాపోయారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష సమావేశం జరపాలని కాగేరి డివ ూండ్ చేశారు.
రేషన్ షాపుల్లో కాంగ్రెస్ మార్కు రాజకీయం
Published Sun, Jan 5 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement