రెండు వారాల క్రితం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ పరిస్థితిలో గుడ్డు రేటు అమాంతం పడిపోతుందని ఊహించారు. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డుకు రూ. 2.64 ధర ఉంది. రెండు వారాలుగా ధరలో మార్పు రాకపోవడం విశేషం.
- అమాంతం పెరిగిన పప్పు దినుసుల రేట్లు
- వేడెక్కుతున్న నూనె
- బెంబేలెత్తుతున్న సామాన్యులు
వర్ధన్నపేట : ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు.. రాములో రామన్న అన్నట్లుగా ఉంది జిల్లావాసుల పరిస్థితి. పప్పులు, వంట నూనెల ధరలు పేదలను బెంబేలెత్తిస్తున్నారుు. సామాన్యులకు పప్పు నిత్యావసర వస్తువు.. అలాంటి పప్పు దినుసుల ధర వారం క్రితం పదుల సంఖ్యను దాటలేదు. ప్రస్తుతం వీటి ధర వందల్లోకి చే రుకుంది. అమాంతం పెరిగిన పప్పు దినుసుల రేట్లతో సామాన్యుడు బుక్కె డు బువ్వ తినలేని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం రూపారుుకి కిలో బియ్యం సరఫరా చేస్తు న్నా.. రూ.1000 నుంచి రూ.1500 పింఛన్ ఇస్తున్నా.. నిత్యావసర ధరలను తగ్గించే ప్రయత్నం చేయకపోవడంతో సామాన్యుడు రెండు పూటలా కడుపునిండా తినడం లేదు. గత వారం, తాజా పరిస్థితిని పోలిస్తే ఒక్కో రకం పప్పునకు పది శాతం పైగా రేటు పెరిగింది. హోల్‌సేల్ రేటులోనే ధర ఇలా ఉంటే మార్కెట్ రేటు మరో ఐదు శాతం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా వినియోగదారుడిపై పెనుభారం పడుతోంది.
వారం క్రితం హోల్‌సేల్‌లో కందిపప్పు కిలో రూ.85 ఉండగా ప్రస్తుతం రూ.100కు పెరిగింది. రెండో రకం కందిపప్పు రూ. 78 నుంచి రూ. 90 వరకు అమ్ముతున్నారు. ఇదే దారిలో పెసరపప్పు రూ. 100 నుంచి రూ.110, శనిగపప్పు రూ. 45 నుంచి రూ. 52, మైసూర్‌పప్పు (ఎర్రపప్పు) రూ. 70 నుంచి రూ.80 వరకు , మినప గుండ్లు రూ. 90 నుంచి రూ.120, మినపపప్పు రూ.80 నుంచి రూ.110కి పెరిగింది. రిటేల్ మార్కెట్‌లో వినియోగాదారుడు ఒక్కో రకం పప్పుపై కిలోకు రూ. 3 నుంచి రూ. 7 వరకు అధికంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేడెక్కుతున్న నూనె....
వంట నూనెల రేట్లు కొద్దికొద్దిగా పెరుగుతున్నారుు. వారం క్రితం కిలో పల్లి నూనెకు రూ.90 ఉండగా ప్రస్తుతం 105కు చేరింది. కిలో శుభం ప్యాకెట్‌ను రూ. 95 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. కాటన్ నూనె ధర రూ. 55 నుంచి 60కి చేరింది. వేసవిలో పచ్చళ్ల సీజన్ కావడంతో నూనె రేట్లు పెరుగుతున్నట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. వేసవి ముగిసేలోగా పప్పు, నూనెల రేట్లు వినియోగదారుడిపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వారి మాటలను బట్టి తెలుస్తోంది. కాగా, జిలకర సైతం వినియోదారుడిపై ప్రభావం చూపిస్తోంది. కిలో జిలకర్ర ధర రూ.180 నుంచి రూ.200 వరకు చేరుకుంది.
గుడ్డుపై ప్రభావం చూపని ‘బర్డ్‌ఫ్లూ’
పప్పు ధాన్యాలపై పెరుగుతున్న ప్రభావం గుడ్డుపై పడింది. సాధారణంగా కూరగాయలు, పప్పు దినుసుల రేటు పెరుగుతున్నప్పుడు వినియోగదారుడు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం సాధారణం. ప్రస్తుతం మార్కెట్‌లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెండు వారాల క్రితం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ పరిస్థితిలో గుడ్డు రేటు అమాంతం పడిపోతుందని ఊహించారు. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డుకు రూ. 2.64 ధర ఉంది. రెండు వారాలుగా ధరలో మార్పు రాకపోవడం విశేషం. పప్పు దినుసుల రేటు పెరుగుతుండడంతో సామాన్యులు ప్రత్యామ్నాయంగా గుడ్డును ఎంచుకోవడంతో మార్కెట్‌లో వాటి అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.