వంట గ్యాస్‌ ధర పెంపు | LPG price hiked by Rs 1.76 per cylinder with effect from midnight tonight | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌ ధర పెంపు

Published Tue, Jul 31 2018 8:39 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

LPG price hiked by Rs 1.76 per cylinder with effect from midnight tonight - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది.  ఎన్‌డిఏ ప్రభుత్వం ఆధ్యర్యంలో  పెట్రోలు, డీజిలు ధరలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో  జూలై నెల  చివర్లో  ఎల్‌పీజీ  సిలిండర్‌  ధరను మళ్లీ పెంచింది.  తాజా పెంపుతో  రాయితీ ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌పై ధర రూ.1.76  పెరిగింది.  సబ్సిడీ లేని సిలిండర్‌ ధరను రూ.35.50 లు  పెరిగింది. నేటి అర్థరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. దీంతో గత నాలుగేళ్లలో 27 సార్లు గ్యాస్‌ ధరలను పెంచినట్టయింది. గత నెలలో  సిలిండర్‌పై రూ.2.71  మేర ధరను పెంచింది. పేద,మధ్య తరగతి వినియోగదారులు వినియోగిస్తున్న సిలిండర్‌పై ఇస్తున్న రాయితీని దశలవారీగా తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement