the poor
-
25న డబుల్ ఇళ్ల కోసం ధర్నా
కాచిగూడ/సాక్షి, హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంకుశ కేసీఆర్‌ను గద్దె దించడం, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాధించడం కోసం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయనిపక్షంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, శ్యామ్‌సుందర్ గౌడ్, నాగూరావు నామాజీ, కేశబోయిన శ్రీధర్, కార్పొరేటర్లు అమృత, కన్నె ఉమారమేశ్ యాదవ్, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డబుల్ ఇళ్ల అంశంపైనే కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పార్టీ కోర్ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు ఒక్కో జిల్లానుంచి ఐదువేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లబి్ధదారులకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిర్మించిన ఇళ్లను ఇవ్వాలనుకోడం సరికాదని, ముందుగా అక్కడి స్థానికులకే ఇళ్లు కేటాయించాలని, తర్వాతే ఇతర ప్రాంతవాసులకు ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇళ్ల సమస్యపై ఆందోళన తర్వాత రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు వంటి అంశాలపై కూడా వరుస ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కొత్త రేషన్ కార్డులు నేటి నుంచి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.09 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు అందజేయనుంది. భూపాలపల్లి జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ప్రతీ మండల కేంద్రంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారని మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లికేషన్ లేకుండా అన్నింటిని పరిశీలించి కార్డులు జారీ చేశామన్నారు. ఈ 3.09 లక్షల కార్డుల ద్వారా 8,65,430 మంది లబ్ధిదారులు నూతనంగా ప్రతీ నెల 6 కిలోల బియ్యాన్ని పొందనున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ నెలకు 5,200 మెట్రిక్ టన్నులతో ఏడాదికి 62,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఉన్న కోటాకు అదనంగా పౌరసరఫరాల శాఖ అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం ఏటా ప్రభుత్వం రూ.168 కోట్లు అదనంగా వెచ్చించనుందన్నారు. ఇప్పటికే ఉన్న 87.41 లక్షల కార్డులకు కొత్తవి జత కావడంతో వాటి సంఖ్య 90.50 లక్షలకు చేరనుండగా, మొత్తం లబ్ధిదారులు 2.88 కోట్లు ఉంటారని చెప్పారు. బియ్యం పంపిణీకి ఏటా ప్రభుత్వం రూ.2,766 కోట్లు వెచ్చిస్తోందని వివరించారు. -
పేదల ఆక్రమణలో కాల్వ గట్లు
సీఎం చంద్రబాబు వెల్లడి విజయవాడ : విజయవాడలో కాల్వ గట్లను పేదలు ఆక్రమించుకున్నారని, అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారని, ఆ నీటినే కింది ప్రాంతాల ప్రజలు తాగాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో అంబేద్కర్ జయంత్యుత్సవాలు, జక్కంపూడిలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. విజయవాడ సిటీ ఆఫ్ కెనాల్‌గా పేరుపొందాల్సిందని, విజయవాడలో ఇళ్లు పెద్ద సమస్యగా మారడంతో పేదలు కాల్వగట్లను ఆక్రమించుకున్నారని అభిప్రాయపడ్డారు. అందువల్లనే జక్కంపూడిలో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. లక్షమంది పేదల్ని ఇక్కడకు తరలించి, విజయవాడను సిటీ ఆఫ్ కెనాల్స్‌గా తీర్చిదిద్దుతామన్నారు. జక్కంపూడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. జక్కంపూడిలో నూతనంగా నిర్మిస్తున్న గృహసముదాయం పైలాన్‌లో తమ పేర్లు లేకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు చిన్నబుచ్చుకున్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. 125 ఏళ్ల కింద పుట్టిన అంబేద్కర్ తాను చేసిన పనులతో ఇప్పటికీ గుర్తుండేలా అందరి మదిలో నిలిచిపోయారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ఎస్సీలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో 15 మంది దళిత ప్రముఖులకు దళిత రత్న అవార్డులు ఇచ్చారు. ఇందులో 11 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే కావడం గమనార్హం. ఎమ్మార్పీస్ నేతలపై నిఘా... బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సభ వద్దకు కొంతమంది ఎమ్మార్పీఎస్ నేతలు వచ్చి నిరసన తెలియచేసిన నేపథ్యంలో జక్కంపూడిలో అటువంటి ఘటన జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో ఉన్న ఎమ్మార్పీఎస్ నేతలపై నిఘా పెట్టారు. -
సకాలంలో సరుకులు
పేదలకు ప్రతి నెలా 15వ తేదీలోగా రేషన్ సరుకులు అందేలా ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా రూపొందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి చెప్పారు. మూడు పద్ధతుల ద్వారా చౌకధరల దుకాణాలను పునర్వ్యవస్థీకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు ముగుస్తుందని, దీని ద్వారా ఇప్పుడున్న 1,338 దుకాణాలకు తోడుగా మరికొన్ని పెరగవచ్చన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పకడ్బందీగా ప్రజాపంపిణీ వ్యవస్థ - మూడు పద్ధతులలో దుకాణాల పునర్వ్యవస్థీకరణ - రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు పూర్తి - రేషన్ సరుకులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు - ‘కస్టమ్స్ మిల్లింగ్ రైస్’ పెండింగ్‌పై సీరియస్ - అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగం - జిల్లాకు 45 వేల ‘దీపం’ కనెక్షన్లు మంజూరు - జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్‌కార్డులు, దుకాణాల రేషనలైజేషన్, కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ, రబీ ధాన్యం కొనుగోళ్లు, ‘అకాల’ పంటల నష్టం పై ప్రభుత్వానికి పంపిన తుది నివేదిక తదితర అంశాల గురించి వివరించారు. ఆయన మాటలలోనే... ‘ప్రజాపంపిణీ’లో అక్రమాలు సహించం. ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నాం. బోగస్ డీలర్లు, రేషన్ దుకాణాలు, కార్డులపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నాం. ప్రజాపంపిణీ వ్యవస్థలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్లపై 6ఎ చట్టం ప్రయోగిస్తాం. రేష న్ సరుకులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుం టాం. ఇప్పటికే 12 మంది డీలర్లకు నోటీసులు జారీ చేశాం. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అ ందేలా చూస్తాం. ప్రతి నెల 22లోగా, వచ్చే నెల సరుకుల కోసం డీడీలు తీసి సంబంధిత అధికారులకు అందజేయూలి. 23 నుంచి సరుకులు పంపిణీ చేసే నెల ఒకటవ తేదీ వరకు మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి సరుకులు అందుతారు. 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేసి, 16న ముగింపు నిల్వల వివరాలు చూపాలి. -
ధరల దడ
రెండు వారాల క్రితం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ పరిస్థితిలో గుడ్డు రేటు అమాంతం పడిపోతుందని ఊహించారు. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డుకు రూ. 2.64 ధర ఉంది. రెండు వారాలుగా ధరలో మార్పు రాకపోవడం విశేషం. - అమాంతం పెరిగిన పప్పు దినుసుల రేట్లు - వేడెక్కుతున్న నూనె - బెంబేలెత్తుతున్న సామాన్యులు వర్ధన్నపేట : ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు.. రాములో రామన్న అన్నట్లుగా ఉంది జిల్లావాసుల పరిస్థితి. పప్పులు, వంట నూనెల ధరలు పేదలను బెంబేలెత్తిస్తున్నారుు. సామాన్యులకు పప్పు నిత్యావసర వస్తువు.. అలాంటి పప్పు దినుసుల ధర వారం క్రితం పదుల సంఖ్యను దాటలేదు. ప్రస్తుతం వీటి ధర వందల్లోకి చే రుకుంది. అమాంతం పెరిగిన పప్పు దినుసుల రేట్లతో సామాన్యుడు బుక్కె డు బువ్వ తినలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రూపారుుకి కిలో బియ్యం సరఫరా చేస్తు న్నా.. రూ.1000 నుంచి రూ.1500 పింఛన్ ఇస్తున్నా.. నిత్యావసర ధరలను తగ్గించే ప్రయత్నం చేయకపోవడంతో సామాన్యుడు రెండు పూటలా కడుపునిండా తినడం లేదు. గత వారం, తాజా పరిస్థితిని పోలిస్తే ఒక్కో రకం పప్పునకు పది శాతం పైగా రేటు పెరిగింది. హోల్‌సేల్ రేటులోనే ధర ఇలా ఉంటే మార్కెట్ రేటు మరో ఐదు శాతం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా వినియోగదారుడిపై పెనుభారం పడుతోంది. వారం క్రితం హోల్‌సేల్‌లో కందిపప్పు కిలో రూ.85 ఉండగా ప్రస్తుతం రూ.100కు పెరిగింది. రెండో రకం కందిపప్పు రూ. 78 నుంచి రూ. 90 వరకు అమ్ముతున్నారు. ఇదే దారిలో పెసరపప్పు రూ. 100 నుంచి రూ.110, శనిగపప్పు రూ. 45 నుంచి రూ. 52, మైసూర్‌పప్పు (ఎర్రపప్పు) రూ. 70 నుంచి రూ.80 వరకు , మినప గుండ్లు రూ. 90 నుంచి రూ.120, మినపపప్పు రూ.80 నుంచి రూ.110కి పెరిగింది. రిటేల్ మార్కెట్లో వినియోగాదారుడు ఒక్కో రకం పప్పుపై కిలోకు రూ. 3 నుంచి రూ. 7 వరకు అధికంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేడెక్కుతున్న నూనె.... వంట నూనెల రేట్లు కొద్దికొద్దిగా పెరుగుతున్నారుు. వారం క్రితం కిలో పల్లి నూనెకు రూ.90 ఉండగా ప్రస్తుతం 105కు చేరింది. కిలో శుభం ప్యాకెట్‌ను రూ. 95 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. కాటన్ నూనె ధర రూ. 55 నుంచి 60కి చేరింది. వేసవిలో పచ్చళ్ల సీజన్ కావడంతో నూనె రేట్లు పెరుగుతున్నట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. వేసవి ముగిసేలోగా పప్పు, నూనెల రేట్లు వినియోగదారుడిపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వారి మాటలను బట్టి తెలుస్తోంది. కాగా, జిలకర సైతం వినియోదారుడిపై ప్రభావం చూపిస్తోంది. కిలో జిలకర్ర ధర రూ.180 నుంచి రూ.200 వరకు చేరుకుంది. గుడ్డుపై ప్రభావం చూపని ‘బర్డ్‌ఫ్లూ’ పప్పు ధాన్యాలపై పెరుగుతున్న ప్రభావం గుడ్డుపై పడింది. సాధారణంగా కూరగాయలు, పప్పు దినుసుల రేటు పెరుగుతున్నప్పుడు వినియోగదారుడు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం సాధారణం. ప్రస్తుతం మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెండు వారాల క్రితం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ పరిస్థితిలో గుడ్డు రేటు అమాంతం పడిపోతుందని ఊహించారు. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డుకు రూ. 2.64 ధర ఉంది. రెండు వారాలుగా ధరలో మార్పు రాకపోవడం విశేషం. పప్పు దినుసుల రేటు పెరుగుతుండడంతో సామాన్యులు ప్రత్యామ్నాయంగా గుడ్డును ఎంచుకోవడంతో మార్కెట్లో వాటి అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
- అడ్డుకున్న భవానీనగర్ కాలనీవాసులు కీసర: దమ్మాయిగూడ గ్రామ పరిధిలోని భవానీనగర్‌లోగల అసైన్డ్ భూమిలో (సర్వేనెంబర్ 538 )లోని అక్రమ కట్టడాలను శ నివారం రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చేయడం చిన్నపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లో వెళితే.. గ్రామంలోని సర్వేనెం 538 లోగల సుమారు 20 ఎకరాల అసైన్ట్ స్థలంలో కొందరు రియల్ వ్యాపారులు భవానీనగర్‌పేరట లేఔట్‌ను రూపొందించి నిరుపేదలకు పాట్లు విక్రయించడంతో ఇక్కడ పెద్దఎత్తున కాలనీ వెలిసింది. ఈ భవానీనగర్‌లో కాలనీల్లో 80 శాతం ఇండ్లు నిర్మించుకోగా మిగతా 20 శాతం మంది బేస్మెంట్లు, గుడిసెలు వేసుకున్నారు. ఇండ్లు నిర్మించుకున్న వారు, ఇంటినెంబర్లు, విద్యుత్ బిల్లులు ఉండటంతో ఇటివల ప్రభుత్వం కల్పించిన జీఓ 58 క్రింద పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల ఖాళీ స్థలాల్లో కొందరు బెస్‌మెంట్ల నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు వాటిని కూల్చేయాలని నిర్ణయించారు. కాగా ఇటీవల మండలంలో క్రమబద్ధీకరణ కోసం 58 జీఓ క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్ల పరిశీలన తీరును పరిశీలించేందుకు భవానీనగర్‌ను సందర్శించిన జేసీ అక్రమంగా నిర్మిస్తు న్న బెస్మెంట్లను తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం ఉదయం స్థానిక వీఆర్ఓ నాయక్, ఆర్ఐ కార్తీక్‌రెడ్డి తమ సిబ్బందితో భవానీనగర్‌కాలనీలో అక్రమంగా నిర్మించిన బెస్‌మెంట్ల ను జేసీబీ సహాయంతో తొలగించే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికులతోపాటు కూల్చివేతలను అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేత (సర్పంచ్ భర్త) కాలనీవాసులు జేసీబీకి అడ్డం గా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు కాలనీవాసులను, ప్రజాప్రతినిధులను సముదాయించారు. -
దళితులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
నెల్లూరు (సెంట్రల్): దళితులు, పేదలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఒక హోటల్లో మాజీ కార్పొరేటర్ స్వర్ణవెంకయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూపూడి మాట్లాడుతూ దళితులు, పేదల వల్లే నాయకులు అధికారంలోకి వస్తున్నారన్నారు. అగ్రవర్ణాలకు అనుకూలంగా బడ్జెట్ ఉందే తప్ప దళితులు, పేదలకు ఏదో మమ అనిపించేలా ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు. దళితులు, పేదలు పారిశ్రామికంగా ఎదగాలంటే వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో దళితులకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే దళితులకు దక్కాల్సిన పథకాలను సాధించుకుందామని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని దళితులందరూ ఏకమై అభివృద్ధి కోసం పోరాటాలు సాగిద్దామన్నారు. కులం కోసం చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీలు మనకవసరం లేదన్నారు. రాష్ర్టంలో ఎక్కువ ఓట్లు మనకే ఉన్నాయన్నారు. మనమందరం ఒకే తాటిపై ఉంటే రానున్న ఎన్నికల్లో ప్రతి పార్టీ మన వెనుకే ఉంటుందన్నారు. దళితుల అభివృద్ధికి చేయూతనిచ్చే వారికే మన మద్దతు ఇస్తామన్నారు. -
బడుగుల పెన్నిధి రాజశేఖరుడు
* పేదల కోసం ఎన్నో పథకాలు * 108, ఆరోగ్యశ్రీతో ప్రాణాలకు ఊపిరి * విద్యార్థులకు వరం ఫీజు రీయింబర్స్మెంట్ * పింఛన్ల పెంపుతో వృద్ధులు... * వితంతువుల్లో ఆత్మస్థైర్యం * నేడు వైఎస్ జయంతి సాక్షి, మహబూబ్‌నగర్: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం పేదలు, బడుగుల సంక్షేమం గురించే ఆలోచించేవారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలతో జిల్లాలోని పేదలకు ఎంతో ఊరట కలిగింది. ప్రధానంగా 108, ఆరోగ్యశ్రీ ద్వారా వేలాదిమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. పింఛన్లతో వృద్ధులు.. వితంతువుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 2004-2009 కాలంలో జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకాన్ని జిల్లాలో 32,432మంది వినియోగించుకోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందారు. వైఎస్ రాకముందు జిల్లాలో వివిధ రకాల పింఛన్లు 60వేలు మాత్రమే ఉండేవి. వైఎస్ వాటిని 3లక్షల 52వేల 298మందికి పెంచారు. అదేవిధంగా 96వేల 445 మహిళా గ్రూపులకు పావలా వడ్డీకింద రుణాలు అందించారు. వీటితో పాటు అనేక పథకాల ద్వారా జిల్లాలో వేలాది మంది లబ్ధి పొందారు. వైఎస్ మానస పుత్రిక 108 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక 108. ప్రమాదం ఎలాంటిదైనా జిల్లాలో ఫోన్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలంలో వాలిపోతుంది. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 19 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 24, గిరిజన ప్రాంతాల్లో 26 నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ అక్కడకు చేరుతుంది. బాధితులకు తగిన ప్రాథమిక చికిత్స అందించి, పూర్తిస్థాయి వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. జిల్లాలో మొత్తం 33 అంబులెన్స్ వాహనాలు వివిధ పట్టణాల నుంచి సేవలందిస్తున్నాయి. ఆగస్టు 15, 2005న ప్రారంభమైన ఈ సేవలు దాదాపు తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా కొనసాగిస్తోంది. లక్షలాది మంది ప్రాణాలను నిలబెడుతోంది. ఈ ఏడాది జూన్‌లోనే మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 3,842మంది బాధితులను ఆసుపత్రులకు చేర్చి ఆదుకుంది. ఇందులో గర్భిణీ స్త్రీలు 1229 కాగా, రోడ్డు ప్రమాదాలు 452 తదితర కేసులున్నాయి. వీటితో పాటు వేలాది మంది వృద్ధులు, వితంతువులకు పింఛన్లతో పాటు పింఛన్ మొత్తాన్ని పెంచి ప్రతినెలా వారికి అందించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నత విద్యకు తోడ్పాటునందిస్తే... ఆరోగ్యశ్రీ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఆయన మరణించిన తర్వాత పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా నిర్వీర్యమవుతున్నాయని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు -
ప్రజల బాధలు మీకు తెలుసా?
మండ్య, న్యూస్‌లైన్ : పేదలు, రైతుల కష్టాలను చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి అన్నారు. సోమవారం ఉదయం ఆయన మండ్య పార్లమెంట్ అభ్యర్థి సీఎం పుట్టరాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నా కన్నీటిని చూసి నవ్వే ఆడదాన్ని... ఏడ్చే మగవాన్ని నమ్మరాదని మాట్లాడటం తగదన్నారు. ఆయన ఉద్దేశ్యంలో ఇక ఆడవాళ్లు నవ్వకూడదని, మగవాళ్లు ఏడ్వ కూడదని అన్నట్లు ఉందన్నారు. ప్రజలు, రైతుల బాధలు సిద్దరామయ్యకు తెలుసా అని కుమార ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడుగా రైతుల సమస్యలు దగ్గరగా పరిశీలించానన్నారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవదని సీఎం అధికారంతో అహంకారం చూపిస్తున్నారని కుమార ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి బరిలోఉన్న సీఎస్ పుటన్న ఈసారి తప్పకుండ విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జేడీఎస్ పార్టీని నడిపించేది డబ్బు కాదని, కార్యకర్తలని కుమార అన్నారు. అనంతరం వేలాది మంది కార్యకర్తల మధ్య సీఎస్ పుట్టరాజు తన నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చలూరాయస్వామి, సారా మహేష్, డీసీ తమ్మణ్ణ, మాజీ ఎమ్మెల్యే అన్నదాని, శ్రీనివాస్, శ్రీకంఠేగౌడ, శివకుమార్, నాయకులు రమేష్, సురేష్కంఠి, శీవరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు నిరుపేద... నేడు కోటీశ్వరుడు!
హంగేరీకి చెందిన లాస్లో ఆండ్రాషెక్ (55) ఒకప్పుడు బాగా బతికాడు. కానీ ముప్ఫయ్యేళ్లు వచ్చేసరికి మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పులు చేశాడు. చివరకు నిలువ నీడ లేకుండా పోయి నిరుపేదగా మిగిలాడు. తల్లికి కూడా వయసైపోయి, అతడిని పోషించలేని పరిస్థితుల్లో ఉండటంతో... బంధువులు జాలిపడి ఆ తల్లీకొడుకులకు తిండిపెట్టేవారు. కానీ కొన్నాళ్లకు వాళ్లు కూడా విసిగిపోయారు. లాస్లోని బయటకు గెంటేయమని చెప్పారు. దాంతో తాను ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాడో అర్థమైంది లాస్లోకి. కానీ ఎంత ప్రయత్నించినా మద్యానికి దూరం కాలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అంతలో అతడికి సామాజిక కార్యకర్త అనికోతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత పదేళ్ల పాటు శ్రమించి అతడిని మామూలు మనిషిని చేసింది అనికో. చిన్నాచితకా పనులు చేసుకుంటూ, భార్యతో సంతోషంగా బతుకుతోన్న లాస్లో మొన్నామధ్య అనుకోకుండా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ కాస్తా తగలడంతో ఒక్కసారిగా దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మన కరెన్సీ లెక్కలో వచ్చిపడ్డాయి. ఉక్కిరి బిక్కిరైపోయాడు లాస్లో. ఏదో సరదాగా కొన్నాను తప్ప, తగులుతుందనుకోలేదు అంటూ సంబరపడుతున్నాడు. అలాగని అతడు ఆ డబ్బును విలాసంగా ఖర్చు చేయాలనుకోవడం లేదు. ‘ఓర్పుతో నన్ను మామూలు మనిషిని చేసిన అనికోని ఏ లోటూ లేకుండా చూసుకుంటాను, మిగిలినదంతా పేదల కోసం ఖర్చుపెడతాను’ అంటున్నాడు. అదేంటి, ఏమీ దాచుకోవా అని అడిగితే... ‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఇతరుల కోసం బతకడమే జీవితం అని నా భార్యని చూసి తెలుసుకున్నాను, నేనూ అలాగే బతుకుతాను’ అంటున్నాడు నవ్వుతూ. హ్యాట్సాఫ్ లాస్లో!