పేదలకు ప్రతి నెలా 15వ తేదీలోగా రేషన్ సరుకులు అందేలా ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా రూపొందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి చెప్పారు. మూడు పద్ధతుల ద్వారా చౌకధరల దుకాణాలను పునర్‌వ్యవస్థీకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు ముగుస్తుందని, దీని ద్వారా ఇప్పుడున్న 1,338 దుకాణాలకు తోడుగా మరికొన్ని పెరగవచ్చన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో
ప్రత్యేకంగా మాట్లాడారు.
పకడ్బందీగా ప్రజాపంపిణీ వ్యవస్థ
- మూడు పద్ధతులలో దుకాణాల పునర్‌వ్యవస్థీకరణ
- రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు పూర్తి
- రేషన్ సరుకులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు
- ‘కస్టమ్స్ మిల్లింగ్ రైస్’ పెండింగ్‌పై సీరియస్
- అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగం
- జిల్లాకు 45 వేల ‘దీపం’ కనెక్షన్లు మంజూరు
- జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్‌కార్డులు, దుకాణాల రేషనలైజేషన్, కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ, రబీ ధాన్యం కొనుగోళ్లు, ‘అకాల’ పంటల నష్టం పై ప్రభుత్వానికి పంపిన తుది నివేదిక తదితర అంశాల గురించి వివరించారు. ఆయన మాటలలోనే...
‘ప్రజాపంపిణీ’లో అక్రమాలు సహించం.
ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నాం. బోగస్ డీలర్లు, రేషన్ దుకాణాలు, కార్డులపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నాం. ప్రజాపంపిణీ వ్యవస్థలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్లపై 6ఎ చట్టం ప్రయోగిస్తాం. రేష న్ సరుకులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుం టాం. ఇప్పటికే 12 మంది డీలర్లకు నోటీసులు జారీ చేశాం. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అ ందేలా చూస్తాం. ప్రతి నెల 22లోగా, వచ్చే నెల సరుకుల కోసం డీడీలు తీసి సంబంధిత అధికారులకు అందజేయూలి. 23 నుంచి సరుకులు పంపిణీ చేసే నెల ఒకటవ తేదీ వరకు మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి సరుకులు అందుతారు. 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేసి, 16న ముగింపు నిల్వల వివరాలు చూపాలి.
సకాలంలో సరుకులు
Published Fri, May 15 2015 5:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement
Advertisement