మండ్య, న్యూస్‌లైన్ : పేదలు, రైతుల కష్టాలను చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. సోమవారం ఉదయం ఆయన మండ్య పార్లమెంట్ అభ్యర్థి సీఎం పుట్టరాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నా కన్నీటిని చూసి నవ్వే ఆడదాన్ని... ఏడ్చే మగవాన్ని నమ్మరాదని మాట్లాడటం తగదన్నారు.
ఆయన ఉద్దేశ్యంలో ఇక ఆడవాళ్లు నవ్వకూడదని, మగవాళ్లు ఏడ్వ కూడదని అన్నట్లు ఉందన్నారు. ప్రజలు, రైతుల బాధలు సిద్దరామయ్యకు తెలుసా అని కుమార ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడుగా రైతుల సమస్యలు దగ్గరగా పరిశీలించానన్నారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవదని సీఎం అధికారంతో అహంకారం చూపిస్తున్నారని కుమార ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి బరిలోఉన్న సీఎస్ పుటన్న ఈసారి తప్పకుండ విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జేడీఎస్ పార్టీని నడిపించేది డబ్బు కాదని, కార్యకర్తలని కుమార అన్నారు. అనంతరం వేలాది మంది కార్యకర్తల మధ్య సీఎస్ పుట్టరాజు తన నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చలూరాయస్వామి, సారా మహేష్, డీసీ తమ్మణ్ణ, మాజీ ఎమ్మెల్యే అన్నదాని, శ్రీనివాస్, శ్రీకంఠేగౌడ, శివకుమార్, నాయకులు రమేష్, సురేష్‌కంఠి, శీవరామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల బాధలు మీకు తెలుసా?
Published Tue, Mar 25 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement