రాజంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
వైఎస్సార్ జిల్లా: రాజంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలోని ముకుందారిగడ్డలో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను పరామర్శించి సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నాయి.