distributing
-
నేటి నుంచి వారం పాటు పెన్షన్ వారోత్సవాలు
-
అనకాపల్లిలో ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం (ఫొటోలు)
-
ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకులు
-
పేదలకు నిత్యావసరాలు పంపిణి
-
అన్నదానం చేస్తున్న పలు ధార్మిక సంస్థలు
-
రోజుకు 50 వేల ఫుడ్ ప్యాకెట్లను..
-
జిల్లాకు యూరియా సరఫరా ప్రారంభం
నల్లగొండ అగ్రికల్చర్ : మూడు రోజులుగా జిల్లాకు సరఫరా ప్రారంభమైందని జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 346 టన్నుల యూరియా జడ్చర్ల వ్యాగన్ పాయిం ట్ ద్వారా, 1200టన్నుల యూరియా ఐపీఎల్ కంపెనీ ద్వారా, స్పిక్ కంపెనీ ద్వారా 1025 టన్నులు మొత్తం రూ.2571 టన్నుల యూరియా చేరుకుందని, దీనిని మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు, ప్రైవేట్ డీలర్ల ద్వారా జిల్లాలోని రైతులందరికీ సరఫరా చేస్తామన్నారు. సోమవారం 1200 టన్నుల యూరియా ఇఫ్కో కంపెనీ ద్వారా మిర్యాలగూడ వ్యాగన్ పాయింట్‌కు చేరుకుందని, మంగళవారం ఉదయం లోపు అన్ని మండలాల్లో పీఏసీఎస్‌లకు, ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేస్తామన్నారు. యూరియా అధికంగా అవసరం ఉన్న 11 మండలాలకు 2,100టన్నుల యూరియాను రోడ్డు మార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టు నుంచి పంపించడానికి కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇవికూడా రావడం ప్రారంభమైందని, రెండు మూడు రోజుల్లో అన్ని మండలాలకు రోడ్డు మార్గం ద్వారా రానుందన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని, అవసరాల మేరకే కొనుగోలు చేసి వాడుకోవాలన్నారు. యూరియాను ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేసుకోవద్దని సూచించారు. -
బుల్లెట్‌పై తిరుగుతూ.. చెక్కులు పంచుతూ..
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్‌పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్‌పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్‌పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు. -
ప్రజావైద్యంపై నమ్మకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్స్ పథకం అమలు, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుప ర్చడం వల్ల ప్రజల్లో ప్రజావైద్యంపై నమ్మకం పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. మాతాశిశు రక్షణలో అమ్మ ఒడి (102) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాటు చేసిన 200 అదనపు వాహనాలను, పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందించే 50 బైకు అంబులెన్స్‌లను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటించేందుకు ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ నోట్లు పంచుతూ..
ముంబైః నకిలీ నోట్లను పంపిణీ చేస్తున్న ముగ్గురు నిందితులను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు ముఫైలక్షల రూపాయల నకిలీ నోట్లను మార్కెట్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైన నిందితులను, వలవేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొంగనోట్ల చలామణి వ్యాపారం కొనసాగిస్తున్నారన్న సమాచారం అందడంతో అలెర్ట్ అయిన పోలీసులు.. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని దీపక్ సినిమా హాలు సమీపంలో ముగ్గురు వ్యక్తులు దొంగ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియడంతో ముంబై పోలీసులు అలర్టయ్యారు. పోలీస్ ఇనస్పెక్టర్ సునీల్ మనే బృందం సినిమాహాలు ప్రాంతానికి చేరుకొని, దొంగనోట్లతోపాటు నిందితులను అరెస్టు చేశారు. ముందుగా వారివద్దనుంచీ రూ.1000 నోట్లు 200, రూ.500 నోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిపై నకిలీ నోట్ల చలామణీ కేసు బుక్ చేసి, మొత్తం 3.2 లక్షల రూపాయల విలువచేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను 36 ఏళ్ళ బారెక్ షేక్, 33 ఏళ్ళ సైఫుద్దీన్ మోమిన్, 44 ఏళ్ళ ముస్లొద్దీన్ మోమిన్లుగా గుర్తించారు. -
వరద బాధితులకు సరుకుల పంపిణీ
వైఎస్సార్ జిల్లా: రాజంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలోని ముకుందారిగడ్డలో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను పరామర్శించి సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నాయి. -
ప్రచారం ఆపేద్దాం.. నోట్లు విసిరేద్దాం
సాక్షి, ఏలూరు:‘ఎన్నేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయక్కర్లేదు. వారి కష్టాలు పట్టించుకోవాల్సిన పని లేదు. వారి కన్నీళ్లు తుడవక్కర్లేదు. నోట్లు విసిరేస్తే ఓట్లు పడిపోతాయి’ టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ పెద్దలు చేస్తున్న హితబోధ ఇది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకేమీ చేయకపోయినా.. కొందరికే మేలు చేకూర్చి సామాన్యుల నడ్డివిరి చినా.. ఇప్పుడు హామీలు గుప్పిస్తే జనం అవన్నీ మర్చిపోతారని భావిస్తున్న ఆ పార్టీ అధినేతనే ఆదర్శంగా తీసుకోమంటున్నారు. ప్రచా రం మాట పక్కనపెట్టి పంపకాలకు మార్గాలను అన్వేషించమని సూచనలిస్తున్నారు. ఆదరణ లేదని తెలిసి... పార్లమెంటరీ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారానికి జిల్లాలో ఆదరణ లభించడం లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి డబ్బు ఖర్చుచేయడం దండగని ఆ పార్టీ భావిస్తోంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగితే జనం ఛీకొడుతుండటంతో ప్రచారం చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును మిగుల్చుకుని ఓటర్లకు పంచిపెట్టాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనాభిమానంతో కాకుండా డబ్బుతోనే ఓట్లు రాబట్టాలని నిర్ణరుుంచుకున్నారు. ఇందుకోసం సొమ్ములు కూడగట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. పంపకాలకూ కొత్త పద్ధతులు కనుగొంటున్నారు. ప్రలోభాలపైనే నమ్మకం ‘ఎన్నికల్లో గెలవడం కోసం ఆస్తులు అమ్మేయండి. పార్టీ కోసం పొలాలు తాకట్టు పెట్టండి’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చినప్పుడల్లా పార్టీ నేతలకు నూరిపోశారు. ఏదో ఒకటి చేయకపోతే ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకోవడం అసాధ్యమనే భయాన్ని ఓ సామాజిక వర్గంలో ఆయన సృష్టించారు. ఇప్పుడు అభ్యర్థులందరికీ ఆ పార్టీ పెద్దలు అదే చెబుతున్నారు. జనంలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామనే నమ్మకాన్ని కలిగించడంలో విఫలమవుతున్న అభ్యర్థులు ప్రచారంపై ఆశలు వదులుకుంటున్నారు. ప్రలోభాలపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఉపయోగించే వాహనాల దగ్గర్నుంచి, వెంటతిరిగే కార్యకర్తల వరకూ సంఖ్య తగ్గించుకుంటున్నారు. కొంద రైతే ప్రచారం ఖర్చు పూర్తిగా స్థానిక నేతలు, యువకులపైనే పడేస్తున్నారు. తమ జేబులోంచి ఒక్క రూపాయి తీయడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలా ఆదా చేసిన డబ్బును పోలింగ్‌కు ముందు ఓటర్లకు పంచేందుకు ఉపయోగించాలనుకుంటున్నారు. మరోవైపు ఓటర్లకు డబ్బులు పంచడానికి కూడా పార్టీ నాయకులు కొత్త పద్ధతులు ఆలోచిస్తున్నారు. నేరుగా సొమ్ము, బహుమతులు పంచి గత ఎన్నికల్లో కొన్నిచోట్ల అధికారులకు దొరికిపోయారు. ఈసారి అలాకాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. దీనికోసం తమకు అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ పార్టీలో పెద్దాయన ఒకరు ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారు. హైదరాబాద్‌లో తనకున్న పరిచయాలను దీనికోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యాపార సంస్థల నిర్వాహకులకు నగదు పంపిణీ చేస్తున్నారు. కొందరికి నోటి మాటగా ఒప్పందం చేసుకుని పోలింగ్ ముగిశాక నగదు చెల్లిస్తామంటున్నారు. వ్యాపారులు చేయాల్సిందల్లా పోలింగ్ ముందు ఓటర్లకు తమ వస్తువులు ఉచితంగా అందజేయడమే. చూసేవారికి ఇది కేవలం వ్యాపారంలా కనిపిస్తుంది. తెరవెనుక ప్రలోభాల పర్వం నడుస్తుంటుంది. ఇలా చేస్తే ప్రజలు తమను గెలిపిస్తారనే భ్రమల్లో ఇలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉన్న నేతనే విజయం వరిస్తుందనే వాస్తవాన్ని తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుందని ప్రజలు అంటున్నారు.