ముంబైః నకిలీ నోట్లను పంపిణీ చేస్తున్న ముగ్గురు నిందితులను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు ముఫైలక్షల రూపాయల నకిలీ నోట్లను మార్కెట్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైన నిందితులను, వలవేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొంగనోట్ల చలామణి వ్యాపారం కొనసాగిస్తున్నారన్న సమాచారం అందడంతో అలెర్ట్ అయిన పోలీసులు.. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
ముంబైలోని దీపక్ సినిమా హాలు సమీపంలో ముగ్గురు వ్యక్తులు దొంగ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియడంతో ముంబై పోలీసులు అలర్టయ్యారు. పోలీస్ ఇనస్పెక్టర్ సునీల్ మనే బృందం సినిమాహాలు ప్రాంతానికి చేరుకొని, దొంగనోట్లతోపాటు నిందితులను అరెస్టు చేశారు. ముందుగా వారివద్దనుంచీ రూ.1000 నోట్లు 200, రూ.500 నోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిపై నకిలీ నోట్ల చలామణీ కేసు బుక్ చేసి, మొత్తం 3.2 లక్షల రూపాయల విలువచేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను 36 ఏళ్ళ బారెక్ షేక్, 33 ఏళ్ళ సైఫుద్దీన్ మోమిన్, 44 ఏళ్ళ ముస్లొద్దీన్ మోమిన్లుగా గుర్తించారు.
నకిలీ నోట్లు పంచుతూ..
Published Wed, May 11 2016 1:58 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
Advertisement